Thursday, January 3, 2008

చిన్న నిర్మాతలకు "పిరమిడ్ గ్రూప్" చేయూత

పిరమిడ్ సాయిమిరా థియేటర్ లిమిటెడ్ చిత్ర నిర్మాణ, పంపిణీ సంస్థ చిన్న నిర్మాతలకు చేయూతనందించడానికి పూనుకుంది. ప్రతి సంవత్సరం 24మంది చిన్న నిర్మాతలను ఎన్నిక చేసి, ఒక్కో నిర్మాతకు ఒక్కో చిత్రాన్ని నిమించి ఇవ్వబోతోంది. తొలి విడతగా రానున్న సంక్రాంతి పర్వదినోత్సవమ్రోజు తొలి 12 మంది చిత్ర నిర్మాతల జాబితాను విడుదల చేయనుంది. ముందుగా తమిళంలో ప్రారంభించనున్న ఈ ప్రక్రియను అతి త్వరలోనే దేశవ్యాప్తంగా విస్తరించడం తన లక్ష్యంగా పెట్టుకుంది.దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమలో కొన్ని సంవత్సరాలుగా చిత్ర పరిశ్రమకు తమ జీవితాన్ని అంకితం చేసిన ఎందరో చిన్న నిర్మాతలు, సరైన ప్రోత్సాహం లేక మరుగున పడిపోతున్నారు. అలాంటి చిత్ర నిర్మాతలలో కొందరిని ఎన్నిక చేసి వారితో కొత్త చిత్రాలను నిర్మించడానికి పిరమిడ్ సాయిమిరా గ్రూప్ పూనుకుంది. ఇందులో భాగంగా ఆయా చిత్రానికయ్యే ఖర్చు మొత్త పిరమిడ్ గ్రూప్ భరిస్తుంది. ఆ చిత్రం పూర్తయిన తరువాత ఆ చిత్రాన్ని విడుదల చేయడానికి పిరమిడ్ సంస్థ సహకరిస్తుంది. ఆ చిత్రానికి వచ్చిన లాభాన్ని ఆయా చిత్ర నిర్మాతకు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగా ప్రతి చిత్రం భడ్జెట్ ను రెండు కోట్ల రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. కథను బట్టి ఇది మారుతుంది. ఈ బడ్జెట్ లో పెద్ద తారలతో చిత్రాలను నిర్మించడం సాధ్యం కాదు కాబట్టి అధిక శాతం కొత్త వారికి అవకాశం ఇవ్వడం పైనే పిరమిడ్ తన దృష్టిని సారించింది. తద్వారా సినీ రంగాన్ని నమ్ముకున్న కొన్ని వేల మందికి ఉపాధి దొరకడంతోబాటు, కొత్త కళాకారులు చిత్ర పరిశరమకు దొరుకుతారు.ఆయా చిత్రాల నిర్మాణం విశయంలో, కథ, దర్శకుడు, నటీనటులు, టెక్నీషియన్లు తదితరులను ఎన్నుకునే పూర్తి స్వేచ్చ చిన్న చిత్రాల నిర్మాతలకు పూర్తిగా ఉంటుంది.

No comments: