Friday, January 11, 2008
సూపర్ స్టార్ "కృష్ణ", సినీ రచయిత "జాలాది" లను వరించిన ఆంద్ర వర్శిటీ గౌరవ డాక్టరేట్
తెలుగు సుప్రసిద్ధ సినీ నటుడు ఘట్టమనేని కృష్ణకు ఆంధ్రా విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రధానం చేయనుంది. ఈనెల 16వ తేదీన జరిగే వర్శిటీ ప్లాటినం జూబ్లీ స్నాతకోత్సవంలో కృష్ణతో పాటు మరో ఐదుగురు ప్రముఖులకు ఈ అవార్డులను ప్రధానం చేయనుంది. మిగిలిన వారిలో ప్రేమ ఆస్పత్రి డైరక్టర్ డాక్టర్ సుంకర వెంకట ఆదినారాయణ, జాతీయ నాలెడ్జి కమిషన్ ఛైర్మన్ డాక్టర్ శ్యాంపిట్రోడా, తెలుగు సినీ రచయిత జాలాది, కావలికి చెందిన సంఘ సేవకుడు రామచంద్రార్డెడిలు ఉన్నారు. ఈ మేరకు విశ్వవిద్యాలయ ఉపకులపతి ఎల్.వేణుగోపాల్‌రెడ్డి పంపిన ప్రతిపాదనలకు విశ్వవిద్యాలయం ఛాన్సలర్, రాష్ట్ర గవర్నర్ ఎన్డీ.తివారీ గురువారం ఆమోదముద్ర వేశారు. దేశ కమ్యూనికేషన్ రంగంలో విప్లవం తీసుకువచ్చిన శ్యాంపిట్రోడా ప్లాటినమ్ జూబ్లీ స్నాతకోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరుకానుండటం గమనార్హం. పోలియో వ్యాధితో బాధపడుతున్న సుమారు మూడు లక్షల మందికి ఆపరేషన్లు చేసిన ఎస్వీ.ఆదినారాయణ దేశంలోనే ప్రేమ ఆస్పత్రి ఆదినారాయణ పేరుగాంచారు. తెలుగు సినీరంగంలో జానపద పాటల రచయితగా జాలాది సుప్రసిద్ధుడు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment