Wednesday, January 2, 2008

తెలుగు టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టిన "పిరమిడ్ గ్రూప్"

భారతదేశానికి చెందిన పిరమిడ్ సాయిమిరా థియేటర్ లిమిటెడ్ సంస్థ తెలుగు టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టనుంది. తెలుగులో తొలి సారిగా జీ టీవీకి చెందిన "జీ తెలుగు" శాటిలైట్ చానెల్ ద్వారా తెలుగులో తమ తొలి తెలుగు ధారావాహిక "టాలెంట్ హంట్" రియాలిటీ షోను నిర్మించనుంది. మొత్తం 40 వారాలపాటు కొనసాగే ఈ కార్యక్రమం ప్రముఖ దర్శక,నిర్మాత, పిరమిడ్ సాయిమిరా థియేటర్ లిమిటెడ్ తెలుగు కంటెంట్ హెడ్ తమ్మారెడ్డి భరద్వాజ సూచనలతో రూపొందుతుంది. కాగా ఈ ధారావాహిక అతి త్వరలోనే రూపొందనుంది. కాగా గతంలో తమిళ టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టిన పిరమిడ్ సంస్థ నిర్మించిన "రేఖ-ఐ.పి.యెస్" సీరియల్ తమిళ టెలివిజన్ రంగంలో సంచలనం సృస్టించి తాజాగా "కరన్ టి వి" జరిపిన సర్వే ప్రకారం ప్రధమ స్థానాన్ని కైవసం చేసుకుంది.కాగా ఈ సీరియల్ తనిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధికి చెందిన "కలైగ్నర్ టి వి"లో ప్రసారం అవుతోంది.