
నటుడు కమల్ హాసన్ నటించనున్న "మర్మయోగి" సినిమా ఖర్చు అక్షరాలా ఒక కోటీ ఇరవై కోట్ల రూపాయలని కోలీవుడ్ సమాచారం. వాల్ట్ డిస్నీ ప్రొడక్షన్ పతాకంపై నిర్మించనున్న ఈ చిత్రం ప్రముఖ కధానాయకుడు రజనీకాంత్ హీరోగా నటించనున్న "రోబోట్" చిత్రానికి పోటీగా మారనుందని కోలీవుడ్ భోగట్టా. రజినీ"రోబోట్" చిత్రానికి భారీ బడ్జెట్‌ను వినియోగించనున్నట్లు వార్తలు వస్తున్న నేపధ్యంలో కమల్ హాసన్ తన "మర్మయోగి" చిత్రం కోసం భారీ స్థాయిలో ఖర్చు పెట్టనుండటం గమనార్హం. విశ్వసనీయ వర్గాలు సమాచారం మేరకు కమల్ తన మర్మయోగి చిత్రానికి రూ. 120 కోట్లు వెచ్చించనున్నట్లు తెలిసింది. ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలను కూడా కమల్ నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల భోగట్టా.
No comments:
Post a Comment