"మెల్లోన కాసుల పేరు
తల్లోన పూవులసేరు
కల్లెత్తితే చాలు
కనకాభిషేకాలు..."
"నల్లవాడే గొల్ల పిల్లవాడే..."
"వడకవే వడకవే రాట్నమా..."
లాంటి పాటలతో, 1937లో వచ్చిన "మాలపిల్ల" చిత్రానిది ఓ సువర్ణాధ్యాయం. తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సాధించిన ఈ చిత్రాన్ని గూడవల్లి రామబ్రహ్మం చల్లపల్లి రాజా, వై.శివరామకృష్ణ ప్రసాద్ ల నిర్మాణత్వంలో "సారధి ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్" బ్యానరుపై నిర్మించాడు. స్వాతంత్రానికి పూర్వం నాటి సమాజ స్తితిగతులకు అద్దం పట్టిన ఈ చిత్రం ఆరోజుల్లో ఒక సంచలనం. మాలల గ్రామ బహిష్కరణ, అంటరానితనం నరనరానా జీర్నించుకున్న ఆ రోజుల్లో కులతత్వానికి వ్యతిరేకంగా వచ్చిన ఈ చిత్రాన్ని బహిష్కరించాలని ఆరోజుల్లో ఉద్యమాలే లేచాయంటే ఈ చిత్ర ప్రభావం ఏపాటిదో తెలుస్తోంది. 1937నాటి రోజులలో ఒకవైపు స్వాతంత్ర్య సంగ్రామం, మరోవైపు అంటరానితన నిర్మూలణ, హరిజన దేవాలయ ప్రవేశం తదితర ఉద్యమాలు మహాత్మా గాంధీ నేతృత్వంలో ఉధృతంగా జరుగుతున్న రోజులలో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. బూజుపట్టిన పాత సాంప్రదాయాలను పట్టుకుని ప్రాకులాడే సనాతనవాదులపై కత్తి ఝుళిపిస్తూ, అంటరానితనాన్ని తూర్పారబట్టి, ఒక సనాతన బ్రాహ్మనుడు ఒక మాలపిల్లను ప్రేమించి పెళ్ళి చేసుకోవడం ప్రధాన ఇతివృత్తం గా, విమర్షణాత్మక ధోరణిలో నిర్మించిన చిత్రం"మాలపిల్ల". డెబ్బై సంవత్సరాలక్రితం ఇంతటి సాహసానికి పూనుకున్న గూడవల్లి రామబ్రహ్మం స్వయానా ఒక బ్రాహ్మనుడు కావడం గమనార్హం. "ప్రజామిత్ర" దిన పత్రికలో ప్రధాన సంపాదకునిగా పనిచేస్తున్న రామబ్రహ్మం అప్పటి జాతీయోధ్యమాలతో సన్నిహిత సంబంధమేర్పడి, నాటి ఉధ్యమాలతో ప్రభావితుడై, సినిమాలు సంఘ సంస్కరణకు ఉపయోగపడాలని భీష్మించుకుని, హరిజనోద్యమ నేపద్యంలో ఈ చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఇందుకోసం గుడిపాటి వెంకటాచలం(చలం) కథనూ, బసవరాజు అప్పారావు పాటలను ఎన్నుకుని, బి.నరసింగారావు చేత సంగీతం సంకూర్చుకున్నారు. ఆప్పట్లో సరస్వతీ టాకీస్ లో భాగస్వామిగా ఉన్న రామబ్రహ్మం, అందులోంచి బయటకు వచ్చి చర్లపల్లి రాజా, వై.శివరామక్రిష్ణ ప్రసాద్ లతో కలిసి "సారధి ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్" సంస్థను స్థాపించి స్వీయ దర్శకత్వం లో ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఈ చిత్రం విడుదలైన తర్వాత సనాతన బ్రాహ్మనులు ఈ చిత్రాన్ని చూడకూడదని అఖిల భారత బ్రాహ్మనుల సమాఖ్య బెజవాడ (ఇప్పటి విజయవాడ)లో తీర్మాణించింది. అది తెలిసిన రామబ్రహ్మం శోత్రీయ బ్రాహమణులకందరికీ "మాలపిల్ల" చిత్రం ఫ్రీ ఫాసులు ఇవ్వబడతాయని కరపత్రాలు పంచిపెట్టి బ్రాహ్మణ తీర్మాణాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇంతటి సంచలనం సృస్టించిన "మాలపిల్ల" చిత్రాన్ని చూసిన చాలామంది ప్రేక్షకులు ఇంటికి రాగానే "స్నానం" చేసిగానీ ఇంట్లోకి వెళ్ళేవారు కాదంటే ఆరోజుల్లో అంటరానితనం ఎంతటి ప్రభావితం చూయిస్తూండేదో తెలుస్తోంది. అఖంఢ సంచలనానికి దారితీసి, తెలుగు సినీ సీమలో సువర్ణాధ్యాయం సృస్టించుకున్న ఈ చిత్రంలో మాలపిల్లగా కాంచనమాల, ఆమెను ప్రేమించే బ్రాహ్మణ యువకునిగా గాలి వెంకటేశ్వర రావు, అతని తండ్రి నిష్టాగరిష్టుడైన సుందరరామ శాస్త్రిగా గోవిందరాజుల సుబ్బారావు నటించారు. ఈ చిత్రంలో కొన్ని పాటలు, మాటలను ప్రముఖ రచయిత తాపీ ధర్మారావు గారు వ్రాశారు. ఈ చిత్రంలోని
"మెల్లోన కాసుల పేరుతల్లోన పూవులసేరుకల్లెత్తితే చాలుకనకాభిషేకాలు..."
"నల్లవాడే గొల్ల పిల్లవాడే...""వడకవే వడకవే రాట్నమా..."
పాటలు బహుళ జనాదరణ చూరగొన్నాయి. ఆ రోజులలో తిరువాంకూరు జమీందారు హరిజనులకు దేవాలయ ప్రవేశాన్ని కలిగించడంతో ఈ చిత్రాన్ని ఆయనకే అంకితం ఇచ్చారు దర్శకుడు గూడవల్లి రామబ్రహ్మం.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment