Monday, January 7, 2008
మరో మారు "గిన్నిస్" రికార్డుల్లోకెక్కిన రామానాయుడు
భారతదేశంలోని అన్ని భాషల్లోను సనిమాలు తీయాలనే తన జీవితాశయమని పలుమార్లు చెప్పిన డాక్టర్ డి. రామానాయుడు మరో మారు "గిన్నిస్ బుక్" రికార్డులలో తన పేరు నమోదు చేసుకున్నారు. భారత దేశంలోని అత్యధిక భాషా చిత్రాలలో చిత్రాలను నిర్మించడం తన లక్ష్యంగా పెట్టుకున్న ఆయన తన ఆశయాన్ని నెరవేర్చుకున్నారు. భారత దేశంలోని తొమ్మిది భాషల్లో సినిమాలు నిర్మించిన నిర్మాతగా 2008 "గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్"లో ఆయన పేరు నమోదైంది. గతంలో ఆయన 100 చిత్రాల నిర్మాతగా గతంలో గిన్నిస్ బుక్ రికార్డ్ ఎక్కారు. ఇది రెండో సారి. తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ, ఇంగ్లీషు, బెంగాలీ, ఒరియా, అస్సామీ భాషలలో చిత్రాలు నిర్మించిన ఆయన తాజాగా మరాఠీలో చిత్రాన్ని నిర్మించారు.సురేష్‌ప్రొడక్షన్స్ బేనర్‌లో వీటిని నిర్మించారు. తెలుగులో "ప్రేమించు' చిత్రాన్ని గతంలో నిర్మించిన రామానాయుడు ప్రస్తుతం మరాఠీలో "మాజీ ఆయి" చిత్ర టైటిల్ పెరుతో పునర్ నిర్మించారు. ఈ చిత్రానికి కాంచనాయక్ దర్శకత్వం వహించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment