Thursday, January 31, 2008
కత్రినా కైఫ్ లవ్ స్టోరీ

కండల హీరో సల్మాన్ ఖాన్ ప్రేమ కథ మరోసారి విషాదాంతం కానున్నట్లు సమాచారం. ఇప్పటికే పలుమార్లు సల్మాన్ ఖాన్ ప్రేమ విషాదాంతంగా ముగిసింది. తాజాగా అతన్ని కత్రీనా కైఫ్ కూడా వదిలేసేటట్లు ఉందనే ప్రచారం బాలీవుడ్ లో ఊపందకుంది. ఇటీవలి కాలంలో కత్రీనా, సల్మాన్ ఖాన్ లేకుండా హాజరైన పార్టీలు లేవనే చెప్పాలి. అయితే తాజాగా ఆమె "సావరియా" సినిమా హీరో రణబీర్ కపూర్ తో లేట్ నైట్ పార్టీలో కనిపించి చాలా మందిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. వీరిద్దరు ఇటీవల రెగ్యులర్ గా కలుసుకుంటూ కబుర్లలో మునిగితేలుతున్నట్లు సమాచార. కత్రీనా చివరికి సల్మాన్ ఖాన్ ను వదులుకుంటుందా, లేదంటే రణబీర్ కు గుడ్ బై చెబుతుందా అనేది ప్రశ్న. ఇప్పుడు ఎవరి ప్రమ కథ సుఖాంతమౌతుందో, లేక మరెవరి ప్రేమకథ విషాదాంతమవుతుందో అనే చర్చ బాలీవుడ్ లో రాజ్యమేలుతోంది. ఇప్పుడు కత్రినా ప్రేమను కోల్పోయినవారికి శుభాకాంక్షలు చెప్పి, గెలిచిన వారి పట్ల జాలి చూపిద్దామా...??? లేక రివర్సా...మీరే ఆలోచించండి.
Wednesday, January 30, 2008
రెడ్ కార్పెట్ ఫిలిం రేటింగ్స్ (30-01-2008)
(Courtesy:Motion Picture Association of America, Inc)
(Ratings for Movies Debuting in Theaters This Week)
CARAMEL
CARAMEL
Ratings-PG
(for thematic elements involving sexuality, language and some smoking)
(for thematic elements involving sexuality, language and some smoking)
THE EYE Ratings-PG-13
(for violence/terror and disturbing content)
(for violence/terror and disturbing content)
HANNAH MONTANA & MILEY CYRUS: BEST OF BOTH WORLDS CONCERT TOURRatings- G
(all ages admitted)
OVER HER DEAD BODYRatings-PG-13
(for sexual content and language)
RATINGS GUIDEG
GENERAL AUDIENCES (All Ages Admitted)
PG
PARENTAL GUIDANCE SUGGESTED (Some Material May Not Be Suitable for Children)
PG-13
PARENTS STRONGLY CAUTIONED (Some Material May Be Inappropriate for Children Under 13)
R
RESTRICTED (Under 17 Requires Accompanying Parent or Adult Guardian)
NC-17
NO ONE 17 AND UNDER ADMITTED
Tuesday, January 29, 2008
రాజశేఖర్ పై దాడికేసు: నిందితుల లొంగుబాటు

సినీ నటుడు రాజశేఖర్ పై దాడి కేసులో పది మంది మంగళవారంనాడు హైదరాబాదులోని పంజగుట్ల పోలీసు స్టేషనులో లొంగిపోయారు. రాయపురెడ్డి సూరిబాబు అలియాస్ రాజా నాయకత్వంలో తాము రాజశేఖర్ ను వెంబడించామని నిందితులు చెప్పారు. తాము రాజశేఖర్ పై దాడి చేయలేదని, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయడానికి రాజశేఖర్ కారును వెంబడించామని వారు చెప్పారు. తమను చూసి రాజశేఖర్ భయానికి గురై లారీని, శాంత్రో కారును ఢీకొట్టారని, దాడి చేసే ఉద్దేశం తమకు లేదని వారు చెప్పారు.
నగేష్ బాబు, రాజు, నాయుడు, నగేష్ బాబు, విష్ణు, పల్లంరాజు, గణేష్, కళ్యాణ్, షేక్ సలీం అలీ, రాంమోహన్ అనేవారిని రాజశేఖర్ పై దాడి కేసులో నిందితులుగా గుర్తించారు. తాము పదిమందిమి ముందు నాంపల్లి స్టేషనుకు వెళ్లామని, ఆ తర్వాత సికింద్రాబాదు రైల్వే స్టేషనుకు వెళ్లి రాజశేఖర్ కారును వెంబడించామని వారు చెప్పారు. నిందితులను పోలీసులు విచారించారు
నగేష్ బాబు, రాజు, నాయుడు, నగేష్ బాబు, విష్ణు, పల్లంరాజు, గణేష్, కళ్యాణ్, షేక్ సలీం అలీ, రాంమోహన్ అనేవారిని రాజశేఖర్ పై దాడి కేసులో నిందితులుగా గుర్తించారు. తాము పదిమందిమి ముందు నాంపల్లి స్టేషనుకు వెళ్లామని, ఆ తర్వాత సికింద్రాబాదు రైల్వే స్టేషనుకు వెళ్లి రాజశేఖర్ కారును వెంబడించామని వారు చెప్పారు. నిందితులను పోలీసులు విచారించారు
బాలకృష్ణ హీరోగా నటించనున్న తదుపరి చిత్రం "చౌదరి"

బాలకృష్ణ హీరోగా "చౌదరి" అనే సినిమా రాబోతున్నట్లు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. బాలకృష్ణతో "వీరభద్ర" అనే సినిమాను చేసిన రవికుమార్ చౌదరి సినిమాకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. "వీరభద్ర" సినిమా సరిగా ఆడకపోయినప్పటికీ రవికుమార్ పనితనం బాలకృష్ణకు నచ్చిందట. దాంతో "చౌదరి" సినిమా చేయడానికి ఆయన అంగీకరించారని వినికిడి. ప్రస్తుతం రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందుతున్న "పాండురంగ" చిత్రంతో బిజీగా ఉన్నారు. దీని తర్వాత గుణశేఖర్ దర్శకత్వంలో "సాధు" సినిమా చేయడానికి బాలకృష్ణ అంగీకరించారు. రవికుమార్ దర్శకత్వం వహించే "చౌదరి" సినిమా "సాధు" కన్నా ముందు ఉంటుందా, తర్వాత ఉంటుందా అనేది తెలియడం లేదు.
Monday, January 28, 2008
రాజశేఖర్ పై "చిరు ఫ్యాన్స్" దాడి :మెగాస్టార్ క్షమాపణ (Photos)
సినీ నటుడు రాజశేఖర్ పై మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఈరోజు ఉదయం దాడి చేశారు. చిరంజీవికి రాజకీయానుభవం లేదని, చిరంజీవి పార్టీ పెడితే తాను అందులో చేరబోనని రాజశేఖర్ ఆదివారంనాడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అన్నారు. దీనిపై చిరంజీవి అభిమానులు తీవ్రంగా ఆగ్రహించారు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రాజశేఖర్ సోమవారం ఉదయం హైదరాబాదులోని నాంపల్లికి రైలులో వచ్చారు.రైలు నుంచి దిగగానే రాజశేఖర్ పశ్చిమ గోదావరి జిల్లాలో చేసిన ప్రకటననే మళ్లీ మీడియా ప్రతినిధుల వద్ద చేశారు. అక్కడి నుంచి ఇంటికి బయలుదేరిన రాజశేఖర్ కారును చిరంజీవి అభిమానులు కొన్ని
కార్లలో వెంబడించారు. పంజగుట్ట వద్దకు రాగానే రాజశేఖర్ పై దాడి చేశారు. ఈ దాడిలో రాజశేఖర్ కూతురు శివాని గాయపడింది. రాజశేఖర్, జీవిత దంపతులతో పాటు పిల్లలు కూడా ఆ దాడి జరిగిన సమయంలో ఉన్నారు. దీంతో భీతిల్లిన రాజశేఖర్ కుటుంబ సభ్యులు ఒక ప్రైవేట్ టీవీ చానెల్ కార్యాలయానికి వెళ్లారు. ఈ దాడికి సంబంధించి పోలీసు స్టేషనులో కేసులు న
మోదయ్యాయి.మెగాస్టార్ క్షమాపణ : హర్షించిన రాజశేఖర్
తన అభిమానుల దాడిలో గాయపడిన సినీనటుడు రాజశేఖర్‌కు మెగాస్టార్ చిరంజీవి ఈరోజు మద్యాహ్నం క్షమాపణ చెప్పారు. అభిమానులు విధ్వంసక చర్యలకు పాల్పడకుండా సంయమనం పాటించాలని మెగాస్టార్ పిలుపునిచ్చారు. చిరంజీవి క్షమాపణ పట్ల గాయపడిన రాజశేఖర్ హర్షం వ్యక్తం చేశారు. దాడి చాలా భయంకరమైందిగా రాజశేఖర సతీమణి జీవిత పేర్కొన్నారు. రాజశేఖర్
నివాసానికి స్వయంగా వెళ్లిన మెగాస్టార్ ఆయన్ను ఆప్యాయంగా హత్తుకుని ఈ సందర్భంగా అభిమానులు సంయమనం పాటించాలని ఇద్దరు హీరోలు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో దాడుల సంస్కృతి మంచిదికాదని హితపుపలికారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ భావవ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంటుందని పేర్కొన్న చిరంజీవి రాజశేఖర్ తనపై చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనప్పటికీ, తన అభిమానుల మనోభావాలను దెబ్బతీశాయ
ని పేర్కొన్నారు. రాజశేఖర్ నా సోదరుడులాంటివాడని, తెలుగు చిత్ర పరిశ్రమ కుటుంబంలో ఒక సభ్యుడని చిరంజీవి పేర్కొన్నారు.కాగా తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్ర బాబు నాయుడుతో సహా, పలువురు రాజకీయ, సినీ నటులు రాజశేఖర్ కుటింబీకులను పరామర్షించారు.
నివాసానికి స్వయంగా వెళ్లిన మెగాస్టార్ ఆయన్ను ఆప్యాయంగా హత్తుకుని ఈ సందర్భంగా అభిమానులు సంయమనం పాటించాలని ఇద్దరు హీరోలు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో దాడుల సంస్కృతి మంచిదికాదని హితపుపలికారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ భావవ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంటుందని పేర్కొన్న చిరంజీవి రాజశేఖర్ తనపై చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనప్పటికీ, తన అభిమానుల మనోభావాలను దెబ్బతీశాయ
ని పేర్కొన్నారు. రాజశేఖర్ నా సోదరుడులాంటివాడని, తెలుగు చిత్ర పరిశ్రమ కుటుంబంలో ఒక సభ్యుడని చిరంజీవి పేర్కొన్నారు.కాగా తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్ర బాబు నాయుడుతో సహా, పలువురు రాజకీయ, సినీ నటులు రాజశేఖర్ కుటింబీకులను పరామర్షించారు. బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ కు "ఫ్రాన్స్" పురస్కారం

సాంస్కృతిక రంగంలో విశేషంగా రాణిస్తూ సేవలు అందించే వారికి ఫ్రాన్స్ ప్రభుత్వం ప్రధానం చేసే అత్యున్నత పురస్కారం "ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్" అవార్డు బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్‌ను వరించింది. ఈ బాలీవుడ్ బాద్ షా తన నటనా పటిమతో కళారంగానికి చేసిన విశేష సేవ, కృషికి గానూ ఈ అవార్డును ప్రధానం చేయనున్నట్లు ఫ్రాన్స్ ప్రభుత్వం పేర్కొంది. ఫ్రాన్స్ ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించడం పట్ల, షారుక్‌ఖాన్‌తో పాటు ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.
Friday, January 25, 2008
"అరోనా టెక్నాలజీస్" కైవసం చేసుకున్న "పిరమిడ్ సాయిమిరా గ్రూప్"
Thursday, January 24, 2008
Wednesday, January 23, 2008
చిరంజీవి 149వ చిత్రం "వందేమాతరం"

బ్రిటీషు వారికి నిద్దురలేకుండా చేసిన "వందేమాతరం" నినాదమే పేరుగా చిరంజీవి నటించనున్న 149వ చిత్రం రూపొందనుంది. 1931లో తెలుగు సినిమా ప్రారంభమైనప్పటినుంచి ఇప్పటిదాకా "వందేమాతరం" పేరుతో మూడు చిత్రాలు నిర్మాణమయ్యాయి. ప్రస్తుతం ఇదే పేరుతో చిరంజీవి తన చిత్రాన్ని నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిసింది. చిరంజీవి రాజకీయ నేపద్యం గురించి విస్తృతంగా చర్చలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో తన చిత్రానికి "వందేమాతరం" పేరును నిర్ణయించడంతో ఈ చిత్రానికి మరింత ప్రాధాన్యత చేకూరింది.తెలిసిన సమాచారం ప్రకారం వి వి వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఉంది. అయితే గతంలో దర్శకుడు కృష్ణవంశీ చిరంజీవితో తాను "వందేమాతరం" చిత్రాన్ని నిర్మిస్తున్నానై పత్రికలవారికి తెలియజేయడం తెలిసిందే. దాంతో ఈ చిత్రానికి ఈ ఇద్దరు దర్శకులలో ఒకరు దర్శకత్వం వహించవచ్చునని తెలుస్తోంది. అయితే వి వి వినాయక్ ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా చెన్నైలో సిట్టింగ్ లను కూడా నిర్వహించడం చూస్తుంటే ఇదమిద్దంగా ఈ చిత్రానికి దర్శకుడు ఎవరో చెప్పడం సందిగ్దంగా మారింది. ప్రస్తుత నేపథ్యంలో ఈ చిత్రం ఎలాంటి సన్నివేశాలతో రూపొందనుందన్న ఆసక్తి రాజకీయ పార్టీ నేతలలో నెలకొంది. ఇటీవల తెలంగాణా ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఓ విలేకరితో చిరు రాజకీయ ప్రవేశం గురించి వ్యాఖ్యానిస్తూ "ముందు ఆయన రాజకీయ ప్రవేశం సంగతి ఏమోగానీ, దానికి పునాది వేసే ఈ 149వ చిత్రం మటుకు తప్పనిసరిగా రాజకీయాలపై ఎక్కుపెట్టే అస్త్రం" కావచ్చునని అన్నారు. ఏదేమైనా ఈ చిత్రం మార్చి 18న షూటింగ్ ప్రారంభం కావచ్చని ఫిలింనగర్ వాసుల కథనం.
Tuesday, January 22, 2008
మెగా స్టార్ మెగా "రేర్" ఫొటో గ్యాలరీ (Exclusive Collection)
కరీనా కపూర్ సెక్సీయెస్ట్ లుక్స్ & గరం గరం డ్రెస్సెస్


ధూమ్- 2లో సెక్సీతార బిపాసా బసు, అందాల సుందరి ఐశ్వర్యారాయ్ బిగుతైన దుస్తులు ధరించి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. మరోసారి వారి దారిలోనే రెచ్చగొట్టే దుస్తులలో దర్శనమివ్వటానికి కరీనా కపూర్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. తన బాయ్‌ఫ్రెండ్ సైఫ్ అలీ ఖాన్‌తో నటిస్తున్న చిత్రంలో ఈ సెక్సీతార బికినీతో ఈత కొలనులో చక్కెర్లు కొట్టే సన్నివేశాన్ని చేసినట్లు తెలిసింది. అంతేకాదు ఈ బికినీ సన్నివేశంలో మరింత అందంగా కనబడేందుకు కరీనా చాలా కసరత్తు చేసిందట. అత్యంత సెక్సీగా నటించడం కోసం ఆహారపు అలవాట్లతో సహా, యోగా, ఫిజికల్ ట్రైనింగ్, జాగింగ్,ఫేషియల్ తోబాటు ఈ సన్నివేశాలకోసం ప్రత్యేకంగా దుస్తులను డిజైన్ చేయించుకుని మరీ ఈ అమ్మడు నటించిందట. ఈ దెబ్బకు భారతావనిలోని అత్యధిక కుర్రకారుకు లంకెలు వేయడం, వారిచత కరీనా జపం చేయించడం కరీనా లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు సమాచారం.
Monday, January 21, 2008
కమల్ హాసన్ "మర్మయోగి" చిత్రం బడ్జెట్ రూ. 120 కోట్లు

నటుడు కమల్ హాసన్ నటించనున్న "మర్మయోగి" సినిమా ఖర్చు అక్షరాలా ఒక కోటీ ఇరవై కోట్ల రూపాయలని కోలీవుడ్ సమాచారం. వాల్ట్ డిస్నీ ప్రొడక్షన్ పతాకంపై నిర్మించనున్న ఈ చిత్రం ప్రముఖ కధానాయకుడు రజనీకాంత్ హీరోగా నటించనున్న "రోబోట్" చిత్రానికి పోటీగా మారనుందని కోలీవుడ్ భోగట్టా. రజినీ"రోబోట్" చిత్రానికి భారీ బడ్జెట్‌ను వినియోగించనున్నట్లు వార్తలు వస్తున్న నేపధ్యంలో కమల్ హాసన్ తన "మర్మయోగి" చిత్రం కోసం భారీ స్థాయిలో ఖర్చు పెట్టనుండటం గమనార్హం. విశ్వసనీయ వర్గాలు సమాచారం మేరకు కమల్ తన మర్మయోగి చిత్రానికి రూ. 120 కోట్లు వెచ్చించనున్నట్లు తెలిసింది. ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలను కూడా కమల్ నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల భోగట్టా.
Wednesday, January 16, 2008
సిల్వెస్టర్ స్టాలోన్ లేటెస్ట్ సెన్సేషన్ "రాంబో-4" (Exclusive Gallery)
"రాంబో" పాత్రతో ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన సిల్వెస్టర్ స్టాలోన్ లేటెస్ట్ చిత్రం "రాంబో-4" ఈ జనవరికి విడుదలకాబోతోంది.థాయ్‌లాండ్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగానే కాకుండా తెలుగులో సైతం జనవరి 25న విడుదలకానుండటం గమనార్హం. రాంబో అద్భుత నటన, ఉత్కంట గొలిపే విభిన్నమైన ఫైట్ల్తోపాటు జూలీ బెంజ్, మాథ్యూ మార్స్ డెన్, గ్రహమ్ మెక్ తవిష్ తదితరుల నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని సినీ పరిశ్రమలో టాక్ వినిపిస్తోంది.
Monday, January 14, 2008
Saturday, January 12, 2008
యంగ్ ఎన్ టీ ఆర్ లవ్ లో పడ్డాడోచ్చ్...!?


హమ్మయ్య యంగ్ ఎన్ టీ ఆర్ విషయంలో ఓ అడుగు ముందుకు పడ్డట్లే అనిపిస్తోంది. ముందే బిడియస్తుడు, సిగ్గరి అయిన ఎన్ టి ఆర్ కూడా లవ్ లో పడగలడని "కంత్రీ" యూనిట్ ఒకటే సంబరపడిపోతున్నట్లు టాలీవుడ్ కోడై కూస్తోంది. ఇది సినిమాలో కాదు, నిజంగానే అంటూ నిజంగానే ఆ యూనిట్ తో సహా తెలుగు సినీ పరిశ్రమకూడా కాస్తంత ఆశ్చర్యానికి గురౌతూనే ఉన్నట్లు సమాచారం. అసలు విషయం ఏమిటంటే, జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం "కంత్రీ". ఈ సినిమాలో దేశముదురు (ఇది సినిమా పేరు కాదు లెండి, హాన్సికా నిజంగానే దేశముదురని లోగుట్టు)"హన్సికా మొత్వానీ" హీరోయిన్ గా చేస్తోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమాకు సంబంధించిన పాటొకటి చిత్రీకరిస్తున్నారు. ఇదంతా మామూలే, కానీ ఎన్టీఆర్, హన్సికాల మధ్య "సమ్ థింగ్..సమ్ థింగ్" ప్రారంభమైందని రూమర్లు వినిపిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ కే హాన్సికాపై రోజురోజుకు ఇష్టం పెరుగుతోందట.దాంతో ఎప్పుడు చూసినా ఒకటే ముచ్చట్లు, ఇకైకలు, పకపకలు. దీనితో సరిపుచ్చుకోకుండా పర్సనల్ కంప్యూటర్లలో కూడా వీరి "సంథింగ్...సంథింగ్" చోటు చేసుకోవడంతో, ఇద్దరూ వారి వారి పర్సనల్ కంప్యూటర్లతో సహా షూటింగ్ కు హాజరై ఎంజాయ్ చేస్తున్నారని, ఎప్పుడూ ఆడవారికి ఆమడ దూరంలో ఉండే యంగ్ ఎన్ టీ ఆర్ ఏకంగా హాన్సికతో నిర్వహిస్తున్న ఛాటింగ్ లు ముదిరి డేటింగ్ లకు రావు కదా అని యూనిట్ ఒకటే ఇదై పోతోందని తాజా సమాచారం. ఈ విషయాన్ని తమ మిత్రులకు కూడా చెబుతున్న ఎన్టీఆర్, చూడబోతే త్వరలోనే ఓ ఇంటి వాడయ్యే సూచనలు పక్కాగా కనిపిస్తున్నాయి. మరి మనమూ బెస్ట్ ఆఫ్ లక్ చెబుదామా...!!!?
Friday, January 11, 2008
సూపర్ స్టార్ "కృష్ణ", సినీ రచయిత "జాలాది" లను వరించిన ఆంద్ర వర్శిటీ గౌరవ డాక్టరేట్
తెలుగు సుప్రసిద్ధ సినీ నటుడు ఘట్టమనేని కృష్ణకు ఆంధ్రా విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రధానం చేయనుంది. ఈనెల 16వ తేదీన జరిగే వర్శిటీ ప్లాటినం జూబ్లీ స్నాతకోత్సవంలో కృష్ణతో పాటు మరో ఐదుగురు ప్రముఖులకు ఈ అవార్డులను ప్రధానం చేయనుంది. మిగిలిన వారిలో ప్రేమ ఆస్పత్రి డైరక్టర్ డాక్టర్ సుంకర వెంకట ఆదినారాయణ, జాతీయ నాలెడ్జి కమిషన్ ఛైర్మన్ డాక్టర్ శ్యాంపిట్రోడా, తెలుగు సినీ రచయిత జాలాది, కావలికి చెందిన సంఘ సేవకుడు రామచంద్రార్డెడిలు ఉన్నారు. ఈ మేరకు విశ్వవిద్యాలయ ఉపకులపతి ఎల్.వేణుగోపాల్‌రెడ్డి పంపిన ప్రతిపాదనలకు విశ్వవిద్యాలయం ఛాన్సలర్, రాష్ట్ర గవర్నర్ ఎన్డీ.తివారీ గురువారం ఆమోదముద్ర వేశారు. దేశ కమ్యూనికేషన్ రంగంలో విప్లవం తీసుకువచ్చిన శ్యాంపిట్రోడా ప్లాటినమ్ జూబ్లీ స్నాతకోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరుకానుండటం గమనార్హం. పోలియో వ్యాధితో బాధపడుతున్న సుమారు మూడు లక్షల మందికి ఆపరేషన్లు చేసిన ఎస్వీ.ఆదినారాయణ దేశంలోనే ప్రేమ ఆస్పత్రి ఆదినారాయణ పేరుగాంచారు. తెలుగు సినీరంగంలో జానపద పాటల రచయితగా జాలాది సుప్రసిద్ధుడు.
Thursday, January 10, 2008
అంటరానితనంపై ఎక్కుపెట్టిన అస్త్రం: మాలపిల్ల(1938)
"మెల్లోన కాసుల పేరు
తల్లోన పూవులసేరు
కల్లెత్తితే చాలు
కనకాభిషేకాలు..."
"నల్లవాడే గొల్ల పిల్లవాడే..."
"వడకవే వడకవే రాట్నమా..."
లాంటి పాటలతో, 1937లో వచ్చిన "మాలపిల్ల" చిత్రానిది ఓ సువర్ణాధ్యాయం. తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సాధించిన ఈ చిత్రాన్ని గూడవల్లి రామబ్రహ్మం చల్లపల్లి రాజా, వై.శివరామకృష్ణ ప్రసాద్ ల నిర్మాణత్వంలో "సారధి ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్" బ్యానరుపై నిర్మించాడు. స్వాతంత్రానికి పూర్వం నాటి సమాజ స్తితిగతులకు అద్దం పట్టిన ఈ చిత్రం ఆరోజుల్లో ఒక సంచలనం. మాలల గ్రామ బహిష్కరణ, అంటరానితనం నరనరానా జీర్నించుకున్న ఆ రోజుల్లో కులతత్వానికి వ్యతిరేకంగా వచ్చిన ఈ చిత్రాన్ని బహిష్కరించాలని ఆరోజుల్లో ఉద్యమాలే లేచాయంటే ఈ చిత్ర ప్రభావం ఏపాటిదో తెలుస్తోంది. 1937నాటి రోజులలో ఒకవైపు స్వాతంత్ర్య సంగ్రామం, మరోవైపు అంటరానితన నిర్మూలణ, హరిజన దేవాలయ ప్రవేశం తదితర ఉద్యమాలు మహాత్మా గాంధీ నేతృత్వంలో ఉధృతంగా జరుగుతున్న రోజులలో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. బూజుపట్టిన పాత సాంప్రదాయాలను పట్టుకుని ప్రాకులాడే సనాతనవాదులపై కత్తి ఝుళిపిస్తూ, అంటరానితనాన్ని తూర్పారబట్టి, ఒక సనాతన బ్రాహ్మనుడు ఒక మాలపిల్లను ప్రేమించి పెళ్ళి చేసుకోవడం ప్రధాన ఇతివృత్తం గా, విమర్షణాత్మక ధోరణిలో నిర్మించిన చిత్రం"మాలపిల్ల". డెబ్బై సంవత్సరాలక్రితం ఇంతటి సాహసానికి పూనుకున్న గూడవల్లి రామబ్రహ్మం స్వయానా ఒక బ్రాహ్మనుడు కావడం గమనార్హం. "ప్రజామిత్ర" దిన పత్రికలో ప్రధాన సంపాదకునిగా పనిచేస్తున్న రామబ్రహ్మం అప్పటి జాతీయోధ్యమాలతో సన్నిహిత సంబంధమేర్పడి, నాటి ఉధ్యమాలతో ప్రభావితుడై, సినిమాలు సంఘ సంస్కరణకు ఉపయోగపడాలని భీష్మించుకుని, హరిజనోద్యమ నేపద్యంలో ఈ చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఇందుకోసం గుడిపాటి వెంకటాచలం(చలం) కథనూ, బసవరాజు అప్పారావు పాటలను ఎన్నుకుని, బి.నరసింగారావు చేత సంగీతం సంకూర్చుకున్నారు. ఆప్పట్లో సరస్వతీ టాకీస్ లో భాగస్వామిగా ఉన్న రామబ్రహ్మం, అందులోంచి బయటకు వచ్చి చర్లపల్లి రాజా, వై.శివరామక్రిష్ణ ప్రసాద్ లతో కలిసి "సారధి ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్" సంస్థను స్థాపించి స్వీయ దర్శకత్వం లో ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఈ చిత్రం విడుదలైన తర్వాత సనాతన బ్రాహ్మనులు ఈ చిత్రాన్ని చూడకూడదని అఖిల భారత బ్రాహ్మనుల సమాఖ్య బెజవాడ (ఇప్పటి విజయవాడ)లో తీర్మాణించింది. అది తెలిసిన రామబ్రహ్మం శోత్రీయ బ్రాహమణులకందరికీ "మాలపిల్ల" చిత్రం ఫ్రీ ఫాసులు ఇవ్వబడతాయని కరపత్రాలు పంచిపెట్టి బ్రాహ్మణ తీర్మాణాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇంతటి సంచలనం సృస్టించిన "మాలపిల్ల" చిత్రాన్ని చూసిన చాలామంది ప్రేక్షకులు ఇంటికి రాగానే "స్నానం" చేసిగానీ ఇంట్లోకి వెళ్ళేవారు కాదంటే ఆరోజుల్లో అంటరానితనం ఎంతటి ప్రభావితం చూయిస్తూండేదో తెలుస్తోంది. అఖంఢ సంచలనానికి దారితీసి, తెలుగు సినీ సీమలో సువర్ణాధ్యాయం సృస్టించుకున్న ఈ చిత్రంలో మాలపిల్లగా కాంచనమాల, ఆమెను ప్రేమించే బ్రాహ్మణ యువకునిగా గాలి వెంకటేశ్వర రావు, అతని తండ్రి నిష్టాగరిష్టుడైన సుందరరామ శాస్త్రిగా గోవిందరాజుల సుబ్బారావు నటించారు. ఈ చిత్రంలో కొన్ని పాటలు, మాటలను ప్రముఖ రచయిత తాపీ ధర్మారావు గారు వ్రాశారు. ఈ చిత్రంలోని
"మెల్లోన కాసుల పేరుతల్లోన పూవులసేరుకల్లెత్తితే చాలుకనకాభిషేకాలు..."
"నల్లవాడే గొల్ల పిల్లవాడే...""వడకవే వడకవే రాట్నమా..."
పాటలు బహుళ జనాదరణ చూరగొన్నాయి. ఆ రోజులలో తిరువాంకూరు జమీందారు హరిజనులకు దేవాలయ ప్రవేశాన్ని కలిగించడంతో ఈ చిత్రాన్ని ఆయనకే అంకితం ఇచ్చారు దర్శకుడు గూడవల్లి రామబ్రహ్మం.
తల్లోన పూవులసేరు
కల్లెత్తితే చాలు
కనకాభిషేకాలు..."
"నల్లవాడే గొల్ల పిల్లవాడే..."
"వడకవే వడకవే రాట్నమా..."
లాంటి పాటలతో, 1937లో వచ్చిన "మాలపిల్ల" చిత్రానిది ఓ సువర్ణాధ్యాయం. తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సాధించిన ఈ చిత్రాన్ని గూడవల్లి రామబ్రహ్మం చల్లపల్లి రాజా, వై.శివరామకృష్ణ ప్రసాద్ ల నిర్మాణత్వంలో "సారధి ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్" బ్యానరుపై నిర్మించాడు. స్వాతంత్రానికి పూర్వం నాటి సమాజ స్తితిగతులకు అద్దం పట్టిన ఈ చిత్రం ఆరోజుల్లో ఒక సంచలనం. మాలల గ్రామ బహిష్కరణ, అంటరానితనం నరనరానా జీర్నించుకున్న ఆ రోజుల్లో కులతత్వానికి వ్యతిరేకంగా వచ్చిన ఈ చిత్రాన్ని బహిష్కరించాలని ఆరోజుల్లో ఉద్యమాలే లేచాయంటే ఈ చిత్ర ప్రభావం ఏపాటిదో తెలుస్తోంది. 1937నాటి రోజులలో ఒకవైపు స్వాతంత్ర్య సంగ్రామం, మరోవైపు అంటరానితన నిర్మూలణ, హరిజన దేవాలయ ప్రవేశం తదితర ఉద్యమాలు మహాత్మా గాంధీ నేతృత్వంలో ఉధృతంగా జరుగుతున్న రోజులలో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. బూజుపట్టిన పాత సాంప్రదాయాలను పట్టుకుని ప్రాకులాడే సనాతనవాదులపై కత్తి ఝుళిపిస్తూ, అంటరానితనాన్ని తూర్పారబట్టి, ఒక సనాతన బ్రాహ్మనుడు ఒక మాలపిల్లను ప్రేమించి పెళ్ళి చేసుకోవడం ప్రధాన ఇతివృత్తం గా, విమర్షణాత్మక ధోరణిలో నిర్మించిన చిత్రం"మాలపిల్ల". డెబ్బై సంవత్సరాలక్రితం ఇంతటి సాహసానికి పూనుకున్న గూడవల్లి రామబ్రహ్మం స్వయానా ఒక బ్రాహ్మనుడు కావడం గమనార్హం. "ప్రజామిత్ర" దిన పత్రికలో ప్రధాన సంపాదకునిగా పనిచేస్తున్న రామబ్రహ్మం అప్పటి జాతీయోధ్యమాలతో సన్నిహిత సంబంధమేర్పడి, నాటి ఉధ్యమాలతో ప్రభావితుడై, సినిమాలు సంఘ సంస్కరణకు ఉపయోగపడాలని భీష్మించుకుని, హరిజనోద్యమ నేపద్యంలో ఈ చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఇందుకోసం గుడిపాటి వెంకటాచలం(చలం) కథనూ, బసవరాజు అప్పారావు పాటలను ఎన్నుకుని, బి.నరసింగారావు చేత సంగీతం సంకూర్చుకున్నారు. ఆప్పట్లో సరస్వతీ టాకీస్ లో భాగస్వామిగా ఉన్న రామబ్రహ్మం, అందులోంచి బయటకు వచ్చి చర్లపల్లి రాజా, వై.శివరామక్రిష్ణ ప్రసాద్ లతో కలిసి "సారధి ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్" సంస్థను స్థాపించి స్వీయ దర్శకత్వం లో ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఈ చిత్రం విడుదలైన తర్వాత సనాతన బ్రాహ్మనులు ఈ చిత్రాన్ని చూడకూడదని అఖిల భారత బ్రాహ్మనుల సమాఖ్య బెజవాడ (ఇప్పటి విజయవాడ)లో తీర్మాణించింది. అది తెలిసిన రామబ్రహ్మం శోత్రీయ బ్రాహమణులకందరికీ "మాలపిల్ల" చిత్రం ఫ్రీ ఫాసులు ఇవ్వబడతాయని కరపత్రాలు పంచిపెట్టి బ్రాహ్మణ తీర్మాణాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇంతటి సంచలనం సృస్టించిన "మాలపిల్ల" చిత్రాన్ని చూసిన చాలామంది ప్రేక్షకులు ఇంటికి రాగానే "స్నానం" చేసిగానీ ఇంట్లోకి వెళ్ళేవారు కాదంటే ఆరోజుల్లో అంటరానితనం ఎంతటి ప్రభావితం చూయిస్తూండేదో తెలుస్తోంది. అఖంఢ సంచలనానికి దారితీసి, తెలుగు సినీ సీమలో సువర్ణాధ్యాయం సృస్టించుకున్న ఈ చిత్రంలో మాలపిల్లగా కాంచనమాల, ఆమెను ప్రేమించే బ్రాహ్మణ యువకునిగా గాలి వెంకటేశ్వర రావు, అతని తండ్రి నిష్టాగరిష్టుడైన సుందరరామ శాస్త్రిగా గోవిందరాజుల సుబ్బారావు నటించారు. ఈ చిత్రంలో కొన్ని పాటలు, మాటలను ప్రముఖ రచయిత తాపీ ధర్మారావు గారు వ్రాశారు. ఈ చిత్రంలోని
"మెల్లోన కాసుల పేరుతల్లోన పూవులసేరుకల్లెత్తితే చాలుకనకాభిషేకాలు..."
"నల్లవాడే గొల్ల పిల్లవాడే...""వడకవే వడకవే రాట్నమా..."
పాటలు బహుళ జనాదరణ చూరగొన్నాయి. ఆ రోజులలో తిరువాంకూరు జమీందారు హరిజనులకు దేవాలయ ప్రవేశాన్ని కలిగించడంతో ఈ చిత్రాన్ని ఆయనకే అంకితం ఇచ్చారు దర్శకుడు గూడవల్లి రామబ్రహ్మం.
మాయావతి తెలుగు సినీ పరిశ్రమకు క్షమాపణ చెప్పాలి
బి.ఎస్.పి మహాసభలో నాయకురాలు మాయావతి సినిమారంగంపై వెల్లడించిన అభిప్రాయాలను చిన్న నిర్మాతల మండలి తీవ్రంగా ఖండించింది. మంగళవారం నాడు ఫిలిమ్ ఛాంబర్‌లో మండలి అధ్యక్షుడు నట్టికుమార్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటయింది. ఈ సందర్భంగా నట్టికుమార్ మాట్లాడుతూ, సినిమావాళ్ల మాయలో పడొద్దు. వాళ్లు ఆటపాటలకే తప్ప, రాజకీయాల్లోకి పనికిరారు అని మాయావతి అనటం పట్ల తీవ్ర అభ్యంతరం తెలియజేశారు. గతంలో ఎంతో మంది నటీనటులు రాజకీయాల్లోకి వచ్చి సేవ చేసిన దాఖలాలు ఉన్నాయి. ఎం.జి.ఆర్, జయలలిత, ఎన్.టి.రామారావు, దాసరి నారాయణరావు, డి.రామానాయుడు, శరత్ కుమార్, విజయ్ కాంత్, ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి, శత్రుఘ్న సిన్హా, రాజేష్ ఖన్నా ఇలా ఎందరో సినిమా రంగం నుంచి రాజకీయాల్లో ప్రవేశించి ప్రజలకు సేవ చేశారు. ఈ విషయాలన్నీ ఆమెకు తెలియవా? అసలు ఏం తెలుసని ఆమె అలా మాట్లాడారు. వెంటనే ఆమె చేసిన వ్యాఖ్యలను రెండురోజుల్లో ఉపసహరించుకుని క్షమాపణ చెప్పాలి. లేదంటే బి.ఎస్.పి కార్యకర్తలముందు నిరసన వ్యక్తం చేస్తాం అన్నారు. " సినిమావాళ్లు బయటకు వస్తే అభిమానంతో ప్రజలు వస్తారు. కానీ ఆమె ఏర్పాటు చేసిన సభకు డబ్బులిస్తేనే జనం వస్తారనీ, ఈ విషయాన్ని ఆమె గ్రహించాల"నీ మండలి ఉపాధ్యక్షుడు సత్యారెడ్డి విమర్శించారు. ఆమె ఎవరిని ఉద్దేశించి ఈ మాటలను అన్నదో తెలియదు కానీ, యావత్ సినీ ప్రపంచాన్ని అనటం సముచితం కాదని మండలి కార్యదర్శి ఇ.వి.ఎన్.చారి పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో మోహన్ గౌడ్, ఎస్.వి.రావు తదితరులు పాల్గొన్నారు.
Wednesday, January 9, 2008
రెడ్ కార్పెట్ ఫిలిం రేటింగ్స్ (09-01-2008)
(ఈ వారం అమెరికాలో విడుదల కానున్న చిత్రాలకు ప్రతిష్టాత్మక "మోషన్ పిక్చర్స్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా" సంస్థ ఇచ్చిన రెడ్ కార్పెట్ ఫిలిం రేటింగ్స్ వివరాలు ఈ క్రింది విధంగా వున్నాయి)
FIRST SUNDAY : Rating-PG-13
(for language, some sexual humor, and brief drug references)
IN THE NAME OF THE KING: A DUNGEON SIEGE TALE : Rating-PG-13
(for intense battle sequence)
THE PIRATES WHO DON'T DO ANYTHING: A VEGGIETALES MOVIE : Rating-G
(all ages admitted)
ONE MISSED CALL : Rating-PG-13
(for intense sequences of violence and terror, frightening images, some sexual material and thematic elements)
FIRST SUNDAY : Rating-PG-13
(for language, some sexual humor, and brief drug references)
IN THE NAME OF THE KING: A DUNGEON SIEGE TALE : Rating-PG-13(for intense battle sequence)
THE PIRATES WHO DON'T DO ANYTHING: A VEGGIETALES MOVIE : Rating-G(all ages admitted)
ONE MISSED CALL : Rating-PG-13(for intense sequences of violence and terror, frightening images, some sexual material and thematic elements)
RATINGS GUIDE
G : GENERAL AUDIENCES (All Ages Admitted)
PG : PARENTAL GUIDANCE SUGGESTED (Some Material May Not Be Suitable for Children)
PG-13 : PARENTS STRONGLY CAUTIONED (Some Material May Be Inappropriate for Children Under 13)
R : NO ONE 17 AND UNDER ADMITTED RESTRICTED (Under 17 Requires Accompanying Parent or Adult Guardian)
NC-17 : NO ONE 17 AND UNDER ADMITTED
శ్రీవెంకట్ బులెమోని
శ్రీవెంకట్ బులెమోని
తొలి తెలుగు చిత్రం:భక్త ప్రహ్లాద భక్తప్రహ్లాద
తొలి తెలుగు టాకీ చిత్రం. హెచ్.ఎం.రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 15, 1931న విడుదలైనది. హిందీలో తొలి టాకీ ‘ఆలం ఆరా’ను అర్దేషిర్.ఎం.ఇరానీ ఇంపీరియల్ ఫిలిం కంపనీ పతాకంపై నిర్మించాడు. ఆయనకి తెలుగులోనూ, తమిళంలోనూ కూడా చిత్రాలు నిర్మించాలనిపించి తన దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేస్తున్న హెచ్.ఎమ్.రెడ్డి తెలుగు, తమిళం తెలిసిన తెలుగువాడు గనక తెలుగు ‘భక్తప్రహ్లాద’ని , తమిళ 'కాళిదాసు'ని ఆయనకు అప్పజెప్పారు. ఇందులో మునిపల్లె వెంకట సుబ్బయ్య హిహణ్యాక్షుడిగా, సురభి కమలా భాయి లీలావతిగా,సింధే కృష్ణాజీ రావు ప్రహ్లాదునిగా,చండా మార్కుల వారి శిశ్యుడిగా ఎల్.వి.ప్రసాద్ తదితరులు నటించారు. అప్పట్లో ధర్మవరం రామకృష్ణమాచార్యులు రచించిన "భక్త ప్రహ్లాద" నాటకాన్ని సురభి నాటక సమాజం వారు వేస్తుండేవారు. ఆ నాటకసమాజం వారిని బొంబాయి పిలిపించి, వారితో చర్చించి, సినిమా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఈ చిత్రాన్ని బొంబాయిలోని కృష్ణామూవీటోన్ స్టూడియోలో నిర్మించారు. అప్పుడు ఈ చిత్ర నిర్మాణ వ్యయం 20వేల రూపాయలు. చిత్రం బాగా విజయవంతమయ్యింది.ఈ చిత్రంలోని
"పరితాప భారంబు భరియింప తరమా..."
పాట ఆరోజుల్లో బహుళ జనాదరన చూరగొంది.ఇక్కడో విషయం మనం చెప్పుకోవాలి. చిత్ర దర్శకుడు హెచ్.ఎం.రెడ్డి మొదట పోలీసు శాఖలో ఇన్స్పెక్టర్ గా పనిచేస్తుండేవాడు. సినీ పరిశ్రమపై ఉన్న మక్కువ కారనంగా తన ఉద్యోగానికి రాజీనామాచేసి ఇంపీరీల్ ఫిలిం కంపనీలో లైట్ బాయ్ గా చేరాడు. ఇరానీ దగ్గర సహాయకుడిగా పని చేసిన హెచ్.ఎం.రెడ్డి మొదట "రాజ్ కుమార్" అనే మూకీ చిత్రానికి దర్శకత్వం వహించాడు.ఆ తర్వాత "ఆలం ఆరా" చిత్రానికి పనిచేసింతర్వాత తొలి తెలుగు చిత్రం "భక్త ప్రహ్లాద" ప్రారంభించాడు. అయితే ఇక్కడొక విషయం. హెచ్.ఎం.రెడ్డి తెలుగు కన్నా ముందు తమిళ చిత్రాన్ని ప్రారంభించాడు. ముందు "కాళిదాసు" చిత్రాన్ని తెలుగులో నిర్మించాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించినా, కాళిదాసు కథను తెలుగువారు ఎంతవరకు ఆదరిస్తారో అనే అనుమానంతో దీనిని తమిళ చిత్రంగా నిర్మించారు. అయితే అప్పటికే పాటల చిత్రీకరణ పూర్తవడంతో ఈ తమిళ చిత్రంలో తెలుగు పాటలను అలాగే ఉంచి చిత్రాన్ని విడుదల చేసారు.అప్పటి సమైఖ్యాంధ్రలో తమిళం మాట్లాడేవారికి తెలుగు కూడా రావడం వల్ల ఈ చిత్రాన్ని తమిళ ప్రజలు ఆదరించారు.ఆ తర్వాత "భక్త ప్రహ్లాద" చిత్రాన్ని ప్రారంభించారు.ఈ చిత్రంలో లీలావతిగా నటించిన సురభి కమలాబాయికి మొదట 500 రూపాయలు పారితోషికంగా నిర్ణయించారు. కాని ఆమె నటనను హర్షించి నిర్మాత వెయ్యినూటపదహార్లు బహూకరించి రైలు ఖర్చులు కూడా ఇచ్చారు. ఇందులో ప్రహ్లాదుని పాత్ర పోషించిన కృష్ణాజీ రావుకు 400 రూపాయలు పారితోషికం. ఈ తెలుగు టాకీ హీరో అప్పటి వయసు 9 సంవత్సరాలు. తరువాత ఈయన కిరాణా కొట్టు నడుపుకున్నాడు. ఆర్ధికంగా చాలా ఇబ్బందులు పడ్డాడు. 2001లో సినీ ఆర్టిస్టుల సంఘం ఈయనను సన్మానించి కొంత ఆర్ధిక సహాయం అందజేశారు.
శ్రీవెంకట్ బులెమోని
Tuesday, January 8, 2008
నగ్నంగా కనిపించనున్న శ్రియా సరన్...!?

నిజంగానే శ్రియా సరన్ నగ్నంగా కనిపించనుందని హాలీవుడ్ టాక్. ఆమె నటిస్తున్న హాలీవుడ్ సినిమా "ది అదర్ ఎండ్ ఆఫ్ ద లైన్" లో సెమీ న్యూడ్ గా శ్రియా సరన్ కనిపించనున్నదని అక్కడి సమాచారం. అలాంటిదేమీ లేదని ఆ సీన్ లో నటించడానికి శ్రియా ససేమిరా అనడంతో ఆమె బదులు డూప్ నటించినట్టు మరోవర్గం కథనం.అయితే యెదపొంగులు పొంగేలా సిలికాన్ ఇంప్లాంటేషన్ చేయించుకుని మరీ శ్రియ ఈ చిత్ర దృష్యాలకు సుముఖత చూయించిందని హాలీవుడ్ పత్రికలు చెబుతున్నాయి. సిలికాన్ ఇంప్లాంటేషన్ చేయించుకున్న మాట నిజమే కానీ, అది చిత్రంలో మరింత అందంగా కనిపించడానికే గాని, నగ్నంగా కనిపించడానికి కాదని కోలీవుడ్ సమాచారం. అయినా చూడబోతూ...అన్నట్లు ముందుముందు ఏం జరుగుతుందో కొద్ది రోజుల్లో తెలుస్తుందిగా అంతవరకు ఓపిక పడితే సరి అని మధ్యే మార్గం వారి సూచనలు.
వేలానికి రానున్న నయనతార బికినీ!!!!

బికినీ వేసుకుని తమిళ "బిల్లా" సినిమాలో హల్ చల్ చేసిన నయనతార తమిళనాట టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. బికినీలో ఎంత అందంగా ఉంది అని నోళ్లు వెల్లబెట్టుకునేలా చేసింది. ఇపుడు నయనతార వేసుకున్న బికినీకి వార్తల్లో నిలవబోతోంది. ఎందుకంటారా నయనతార అందాలను బిగపట్టిన ఆ బికినీని ఇపుడు వేలం వేయబోతున్నట్లు సమాచారం. తేదీ, రేటు, స్థలం ఇంకా తెలియలేదు కానీ నయనతార ఆరాధకులకు ఇది అద్భుత అవకాశం అని తమిళనాట చెప్పుయ్కుంటున్నట్లు సమాచారం.
"కేప్టెన్సీ" కోల్పోయి "దీపికాను" దక్కించుకున్న యువరాజ్

భారత క్రికెట్ వన్డే జట్టు కెప్టెన్సీని పొందలేకపోయినా యువరాజ్ సింగ్ దీపికా పదుకొనే ప్రేమను సాధించి "ప్రేమ" విషయంలో తనదే పైచేయి అని నిరూపించుకున్నాడు. భారత క్రికెట్ వన్డే జట్టు కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోనీ, క్రికెటర్ యువరాజ్ సింగ్ లు "ఓం శాంతి ఓం" సినిమా హీరోయిన్ దీపికా పడుకొనే ను ప్రేమించారు. ముందుగా మహేంద్ర సింగ్ ధోనితో దోస్తి కట్టిన దీపికా ఇప్పుడు యువరాజ్ తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. కెప్టెన్ పదవిని దక్కించుకోలేక పోయిన యువరాజ్ సింగ్ దీపికకు దగ్గరవడంలో మాత్రం విజయం సాధించాడు. ధోని కూడా దీపకతో దోస్తి చేసినప్పటికీ ఆమె మాత్రం ఇపుడు యువరాజ్ అంటేనే మక్కువ చూపుతోంది.యష్ రాజ్ ఫిల్మ్స్ సినిమా షూటింగ్ కోసం షెడ్యూల్ కన్నా రెండు రోజుల ముందే సిడ్నీ చేరుకున్న దీపికా తన 22వ జన్మదినోత్సవాన్ని యువరాజ్ సమక్షంలో జరుపుకుంది. తాజా సమాచారం ఏమంటే యువరాజ్ సింగ్, దీపికా పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. చక్కగా కలిసిపోతున్న వీరిద్దరూ పెళ్లి చేసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని వారి సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు. లేట్ నైట్ రెస్టారెంట్లలో గడపడం మూలంగానే దాని ప్రభావం యువరాజ్ సింగ్ పై పడినట్టు విమర్శలు కూడా వచ్చాయి. ఇంకో విషయం ఏమంటే యువరాజ్ సింగ్ కు సినీ తారలతో తిరగడం కొత్తేం కాదు. కొన్నాళ్లు కిమ్ శర్మతో తిరిగిన యువరాజ్ ఇపుడు దీపిక ప్రేమలో పడ్డాడు. దీపికా పదుకొనే కూడా తక్కవేం తినలేదు, ఆమె కూడా గతంలో రణబీర్ కపూర్ తో చెట్టాపట్టాలేసుకు తిరిగింది. అంతకుముందు కూడా దీపిక సినిమా పరిశ్రమకు చెందని వ్యక్తితో కూడా ప్రేమాయణం నడిపింది. అనుభవం విషయంలో ఇద్దరూ ముదుర్లే.
Monday, January 7, 2008
రజినీకాంత్ నటించిన "శివాజీ" చిత్రంపై పుస్తకం

తమిళ సినీ రంగంలో పలు రికార్డులు సృస్టించిన "శివాజీ" చిత్ర పై ప్రత్యేకంగా ఒక పుస్తకం రూపుదిద్దుకుంది. సినీ జర్నలిస్టు రాణీ మైందన్ రాశారు. "శివాజీ' చిత్రం ప్రారంభం మొదలుకుని అన్ని రకాల విశేషాలు, పరత్యేకతలతో రూపొందిన ఈ "శివాజీ-ది బాస్" పుస్తకాన్ని చిత్ర హీరో రజినీకాంత్ తన రాఘవేంద్ర కళ్యాన మండపంలో విడుదల చేశారు. ఈ కార్య క్రమానికి చిత్ర నిర్మాత శరవణన్ తో సహా పలువురు చిత్ర సంబంధీకులు పాల్గొన్నారు.తమిళంలో ఒప్క చిత్రం ప్రత్యేకంగా పుస్తకం వెలువడటం ఇదే మొదలని ఈ సందర్భంగా చిత్ర హీరో రజినీకాంత్ పేర్కొన్నారు. మరో మారు "గిన్నిస్" రికార్డుల్లోకెక్కిన రామానాయుడు
భారతదేశంలోని అన్ని భాషల్లోను సనిమాలు తీయాలనే తన జీవితాశయమని పలుమార్లు చెప్పిన డాక్టర్ డి. రామానాయుడు మరో మారు "గిన్నిస్ బుక్" రికార్డులలో తన పేరు నమోదు చేసుకున్నారు. భారత దేశంలోని అత్యధిక భాషా చిత్రాలలో చిత్రాలను నిర్మించడం తన లక్ష్యంగా పెట్టుకున్న ఆయన తన ఆశయాన్ని నెరవేర్చుకున్నారు. భారత దేశంలోని తొమ్మిది భాషల్లో సినిమాలు నిర్మించిన నిర్మాతగా 2008 "గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్"లో ఆయన పేరు నమోదైంది. గతంలో ఆయన 100 చిత్రాల నిర్మాతగా గతంలో గిన్నిస్ బుక్ రికార్డ్ ఎక్కారు. ఇది రెండో సారి. తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ, ఇంగ్లీషు, బెంగాలీ, ఒరియా, అస్సామీ భాషలలో చిత్రాలు నిర్మించిన ఆయన తాజాగా మరాఠీలో చిత్రాన్ని నిర్మించారు.సురేష్‌ప్రొడక్షన్స్ బేనర్‌లో వీటిని నిర్మించారు. తెలుగులో "ప్రేమించు' చిత్రాన్ని గతంలో నిర్మించిన రామానాయుడు ప్రస్తుతం మరాఠీలో "మాజీ ఆయి" చిత్ర టైటిల్ పెరుతో పునర్ నిర్మించారు. ఈ చిత్రానికి కాంచనాయక్ దర్శకత్వం వహించారు.
Friday, January 4, 2008
ప్రిన్స్ మహేష్ బాబుతో త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రం ఖరారు

మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. ఇటీవల వీరిద్దరూ రెండు మూడు విడతలుగా కలుసుకున్నప్పుడే ఈ విషయం పై వదంతులు వినిపించినా, ఈ చిత్రం దదాపు ఖరారయినట్లు కొత్తగా పద్మాలయా స్టూడియోలో జరుగుతున్న అంతర్గత చర్చలవల్ల తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్ బాబు భార్య నమ్రత, కుమారుడు గౌతమ్ కృష్ణలతో కలిసి గోవాలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ హీరోగా "జల్సా" సినిమాను రూపొందిస్తున్నాడు. గతంలో మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన "అతడు" సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. కాగా తాజాగా తలపెట్టిన ప్రాజెక్టు ఏప్రిల్ లో ప్రారంభం కానున్నట్లు సమాచారం.
Thursday, January 3, 2008
చిన్న నిర్మాతలకు "పిరమిడ్ గ్రూప్" చేయూత
పిరమిడ్ సాయిమిరా థియేటర్ లిమిటెడ్ చిత్ర నిర్మాణ, పంపిణీ సంస్థ చిన్న నిర్మాతలకు చేయూతనందించడానికి పూనుకుంది. ప్రతి సంవత్సరం 24మంది చిన్న నిర్మాతలను ఎన్నిక చేసి, ఒక్కో నిర్మాతకు ఒక్కో చిత్రాన్ని నిమించి ఇవ్వబోతోంది. తొలి విడతగా రానున్న సంక్రాంతి పర్వదినోత్సవమ్రోజు తొలి 12 మంది చిత్ర నిర్మాతల జాబితాను విడుదల చేయనుంది. ముందుగా తమిళంలో ప్రారంభించనున్న ఈ ప్రక్రియను అతి త్వరలోనే దేశవ్యాప్తంగా విస్తరించడం తన లక్ష్యంగా పెట్టుకుంది.దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమలో కొన్ని సంవత్సరాలుగా చిత్ర పరిశ్రమకు తమ జీవితాన్ని అంకితం చేసిన ఎందరో చిన్న నిర్మాతలు, సరైన ప్రోత్సాహం లేక మరుగున పడిపోతున్నారు. అలాంటి చిత్ర నిర్మాతలలో కొందరిని ఎన్నిక చేసి వారితో కొత్త చిత్రాలను నిర్మించడానికి పిరమిడ్ సాయిమిరా గ్రూప్ పూనుకుంది. ఇందులో భాగంగా ఆయా చిత్రానికయ్యే ఖర్చు మొత్త పిరమిడ్ గ్రూప్ భరిస్తుంది. ఆ చిత్రం పూర్తయిన తరువాత ఆ చిత్రాన్ని విడుదల చేయడానికి పిరమిడ్ సంస్థ సహకరిస్తుంది. ఆ చిత్రానికి వచ్చిన లాభాన్ని ఆయా చిత్ర నిర్మాతకు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగా ప్రతి చిత్రం భడ్జెట్ ను రెండు కోట్ల రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. కథను బట్టి ఇది మారుతుంది. ఈ బడ్జెట్ లో పెద్ద తారలతో చిత్రాలను నిర్మించడం సాధ్యం కాదు కాబట్టి అధిక శాతం కొత్త వారికి అవకాశం ఇవ్వడం పైనే పిరమిడ్ తన దృష్టిని సారించింది. తద్వారా సినీ రంగాన్ని నమ్ముకున్న కొన్ని వేల మందికి ఉపాధి దొరకడంతోబాటు, కొత్త కళాకారులు చిత్ర పరిశరమకు దొరుకుతారు.ఆయా చిత్రాల నిర్మాణం విశయంలో, కథ, దర్శకుడు, నటీనటులు, టెక్నీషియన్లు తదితరులను ఎన్నుకునే పూర్తి స్వేచ్చ చిన్న చిత్రాల నిర్మాతలకు పూర్తిగా ఉంటుంది.
Wednesday, January 2, 2008
తెలుగు టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టిన "పిరమిడ్ గ్రూప్"
Subscribe to:
Posts (Atom)


















































































































































































































