Saturday, May 31, 2008

పాకిస్థాన్ ప్రధానికి ఐశ్వర్య రాయ్ చిత్రాలను బహుమతిగా అందించిన ప్రణబ్ ముఖర్జీ

ఇటీవల పాకిస్థాన్ పర్యటనకు వెళ్లిన భారత విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఆ దేశ ప్రధాని కోసం ఓ ప్రత్యేకమైన బహుమతి తీసుకెళ్లారు. ప్రముఖ బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ సినిమాలతో నింపిన బాక్సును పాకిస్థాన్ కొత్త ప్రధానమంత్రి యూసఫ్ రజా గిలానీకి ప్రణబ్ బహుమతిగా అందించారు. గిలానీ (55)కి బాలీవుడ్ నటులు ఐశ్వర్యారాయ్, షారుక్‌ఖాన్‌పై ఎంత అభిమానముందంటే, దీనికి సమాధానం ఆయన కూడా మాటల్లో చెప్పలేరు. ప్రణబ్ ముఖర్జీ ఇచ్చిన బహుమతిని చూసి ఆశ్చర్యపోయా. తనకు ఇచ్చిన బహుమతిలో పూర్తిగా ఐశ్వర్యారాయ్ నటించిన సినిమాల డీవీడీలు ఉన్నాయని గిలానీ చెప్పారు. గిలానీ అభిమాన నటి ఐశ్వర్యారాయ్ అని తెలుసుకున్న ముఖర్జీ తన పాక్ పర్యటనలో ఆయనను కలుసుకున్న సందర్భంగా ఈ డీవీడీలను బహుమతిగా ఇచ్చారు. ఐశ్వర్యారాయ్‌ అంటే తనకెంత అభిమానముందో అప్పుడప్పుడు గిలానీ చెబుతుంటారు. తాజాగా ఆమె సినిమా డీవీడీలు ఇచ్చి గిలానీ చేత ప్రణబ్ ముఖర్జీ మరోసారి ఐష్ నామజపం చేయించారు. ఐస్ చేసారు.

Friday, May 30, 2008

డా.రాజశేఖర్ ఇంట్లో సి డి ల దొంగతనం


సినీ నటుడు రాజశేఖర్ కార్యాలయంలో బుధవారం అర్ధరాత్రి దొంగతనం జరిగింది. జూబిలీహిల్స్ లోని ఫిల్మ్ నగరులో ఉన్న ఆయన కార్యాలయంలోకి దుండుగులు ప్రవేశించి పలు విలువైఅన్ సి డి లు ఎత్తుకెళ్ళారు. దుండగులు కంప్యూటరును కూడా ధ్వంసం చేశారు. పలు విలువైన సిడిలను, కీలక పత్రాలను ఎత్తుకెళ్లారు. ఈ విషయాన్ని రాజశేఖర్, జీవిత దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. "పథకం ప్రకారమే ఎవరో దొంగతనం చేయించారని, దొంగతనం కోసం వచ్చినవారికి కంప్యూటర్ ధ్వంసం చేయాల్సిన అవసరం ఏముంటుందని" రాజశేఖర్ భార్య జీవిత అన్నారు. బతుకు దెరువు కోసం దొంగతనం చేసేవారికి సిడీలు, పత్రాలతో పనేముంటుందని, ఇది కావాలనే ఎవరో చేయించారని ఆమె తన కంప్లైంట్ లో పేర్కొన్నారు.

హాలీవుడ్ మెగా ఆక్షన్ మూవీ "హక్-2" ట్రైలర్

Wednesday, May 28, 2008

విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు

తెలుగు నాట పరిచయం అక్కరలేని వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. భారత దేశం గర్వించదగ్గ గొప్ప నటుడు, దర్శకుడు, నిర్మాతగా ఆయనను ప్రపంచమే గుర్తించింది.ఎన్.టి.ఆర్ నటనను ఆస్వాదించని ఒక్క తెలుగు వాడుంటాడా అని చెప్పడం కష్టం. ఆంధ్ర రాష్ట్రంలో ఓ కథుంది. ఓ పేదవాడు తన కష్టాలను తీర్చమని ప్రతిరోజూ దేవాలయంలో మ్రొక్కుకునేవాడు. అతని కష్టాలను చూసిన దేవునికి అతనిపై జాలి కలిగి ఒకరోజు ఆ పేద భక్తునికి ప్రత్యక్షమై"భక్తా, నీ భక్తికి మెచ్చాను,ఏం కావాలో కోరుకో " అనగానే ఆ పేద భక్తుడు భగవంతునివైపు బాగా పరిశీలనగా చూసి "పో పోవయ్యా, పొద్దున్నే నీకు నేనే దొరికానా, భగవంతుడంటే ఎట్టా వుంటాడు మా ఎంటోడిలాగా(ఎన్.టి.ఆర్ లాగా) వుంటాడు, నేను ఎన్ని సినిమాలలో సూల్లేదు, కృష్నుడిగా, రాముడిగా, రావణాసురునిగా, దేవుడైనా, రాచ్చసుడైనా ఎట్టావుంటాదో మాతెలుగు సినిమాలు సూసే వాళ్ళకంతా ఎరికే, నీ పగటి యేషాలు నాదగ్గర చూయించకు, యెళ్ళు, యెళ్ళి మరెవరినైనా అడుక్కో కలో, గంజో పోస్తారు" అనగానే ఆ దేవుడికి సహితం దిమ్మతిరిగిపోతుందని ఆ కథ సారాంశం. తన నటనతో తెలుగు ప్రజానీకం హృదయాల్లో అంతగా స్థానం సంపాదించిన గొప్ప నటుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు.
తెలుగువారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే నందమూరి తారక రామారావు (1923 మే 28 - 1996 జనవరి 18) ఒక గొప్ప నటుడు, ప్రజానాయకుడు. రామారావు, ఎన్.టి.ఆర్, ఎన్.టి.రామారావు గా కూడా ప్రసిద్ధుడైన ఆయన, తెలుగు, తమిళం మరియు హిందీ భాషలలో కలిపి దాదాపుగా 302 చిత్రాలలో నటించాడు. తన ప్రతిభను కేవలం నటనకే పరిమితం చేయకుండా పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు. విశ్వ విఖ్యాత నటసార్వభౌముడుగా బిరుదాంకితుడైన ఆయన, అనేక జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించడమేగాక, రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగు వారి హృదయాలలో శాశ్వతంగా నిలచిపోయాడు. రామారావు 1982 లో తెలుగుదేశం పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించి రాజకీయ రంగప్రవేశం చేసాడు. పార్టీని స్థాపించిన కేవలం 9 నెలల్లోనే ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించుతూ అధికారాన్ని కైవసం చేసుకున్నాడు. ఆ తరువాత మూడు దఫాలుగా దాదాపు 8 సంవత్సరాల పాటు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి, అప్పటి వరకు అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా నిలచాడు.

బాల్యము, విద్యాభ్యాసము

నందమూరి తారక రామారావు 1923, మే 28 వ తేదీన, సాయంత్రం 4:32కి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా, పామర్రు మండలంలోని, నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య చౌదరి, వెంకట రామమ్మ దంపతులకు జన్మించాడు. మొదట కృష్ణ అని పేరుపెట్టాలని తల్లి అనుకున్నప్పటికీ, మేనమామ తారక రాముడయితే బాగుంటుంది అని చెప్పడంతో ఆ పేరే పెట్టారు. తరువాత అది కాస్తా తారక రామారావుగా మారింది. పాఠశాల విద్య విజయవాడ మునిసిపలు హైస్కూలులో చదివాడు. తరువాత విజయవాడ ఎస్.ఆర్.ఆర్. కాలేజీలో చేరాడు. ఇక్కడ విశ్వనాథ సత్యనారాయణ తెలుగు విభాగానికి అధిపతి. ఒకసారి రామారావును ఒక నాటకములో ఆడవేషం వేయమన్నాడు. అయితే రామారావు తన మీసాలు తీయటానికి 'ససేమిరా' అన్నాడు. మీసాలతోటే నటించడం వలన ఆయనకు "మీసాల నాగమ్మ" అనే పేరు తగిలించారు. 1942 మే నెలలో 20 ఏళ్ళ వయసులో మేనమామ కుమార్తె అయిన బసవ రామతారకంను పెళ్ళి చేసుకున్నాడు. వివాహో విద్యానాశాయ అన్నట్లు పెళ్ళయిన తరువాత పరీక్షల్లో రెండుసార్లు తప్పాడు. తర్వాత గుంటూరు ఆంధ్రా క్రిస్టియన్ కళాశాలలో చేరాడు. అక్కడకూడా నాటక సంఘాల కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనేవాడు. ఆ సమయంలోనే నేషనల్ ఆర్ట్ థియేటర్ గ్రూప్ (ణాట్) అనే నాటక సంస్థను స్థాపించి కొంగర జగ్గయ్య, ముక్కామల, నాగభూషణం, కె.వి.ఎస్.శర్మ తదితరులతో చేసిన పాపం వంటి ఎన్నో నాటకాలు ఆడాడు. తర్వాతి కాలంలో ఈ సంస్థ కొన్ని చిత్రాలను కూడా నిర్మించింది. ఎన్టీఆర్ మంచి చిత్రకారుడు కూడా. రాష్ట్రవ్యాప్త చిత్రలేఖన పోటీలలో ఆయనకు బహుమతి కూడా లభించింది. సుభాష్ చంద్రబోసు విజయవాడ వచ్చినప్పుడు ఎన్టీఆర్ బోసు బొమ్మను చిత్రించి ఆయనకు కానుకగా ఇచ్చాడు.
చలనచిత్ర జీవితం

రామారావు కాలేజీలో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు వారి ఆస్తి మొత్తం ఏవో కొన్నికారణాల వల్ల హరించుకుపోయింది. అప్పుడు యుక్తవయసులో ఉన్న రామారావు జీవనం కోసం అనేక పనులు చేసాడు. కొన్ని రోజులు పాల వ్యాపారం, తరువాత కిరాణా కొట్టు, ఆపై ఒక ముద్రణాలయాన్ని కూడా నడిపాడు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అప్పు చేసేవాడు కాదు.
రామారావు 1947లో పట్టభద్రుడయ్యాడు. తదనంతరం ఆయన మద్రాసు సర్వీసు కమీషను పరీక్ష రాసాడు. పరీక్ష రాసిన 1100 మంది నుండి ఎంపిక చేసిన ఏడుగురిలో ఒకడుగా నిలిచాడు. అప్పుడు ఆయనకు మంగళగిరిలో సబ్-రిజిస్ట్రారు ఉద్యోగం లభించింది. అయితే సినిమాలలో చేరాలనే ఆశయం కారణంగా ఆ ఉద్యోగంలో మూడు వారాలకంటే ఎక్కువ ఉండలేకపోయాడు.
ప్రముఖ నిర్మాత బి.ఏ.సుబ్బారావు ఎన్టీఆర్ ఫొటోను ఎల్వీ ప్రసాదు దగ్గర చూసి, వెంటనే ఆయనను మద్రాసు పిలిపించి పల్లెటూరి పిల్ల సినిమాలో కథానాయకుడిగా ఎంపిక చేసాడు. దీనికి గాను రామారావుకు వెయ్యి నూటపదహార్ల పారితోషికం లభించింది. వెంటనే ఆయన తన సబ్-రిజిస్ట్రారు ఉద్యోగానికి రాజీనామా చేసేసాడు. కానీ సినిమా నిర్మాణం వెంటనే మొదలవలేదు. ఈలోగా మనదేశం అనే సినిమాలో అవకాశం రావడంతో దానిలో నటించాడు. అంచేత ఆయన మొదటిసారి కెమేరా ముందు నటించిన సినిమా మనదేశం అయింది. 1949లో వచ్చిన ఆ సినిమాలో ఆయన ఒక పోలీసు ఇన్స్‌పెక్టర్‌ పాత్ర పోషించాడు. 1950లో పల్లెటూరి పిల్ల విడుదలైంది. అదే సంవత్సరం ఎల్వీ ప్రసాదు షావుకారు కూడా విడుదలైంది. ఈ రెండు సినిమాల తరువాత ఎన్టీఆర్ తన నివాసం మద్రాసుకు మార్చివేశాడు. థౌజండ్‌ లైట్స్‌ ప్రాంతంలో ఒక చిన్న గదిని అద్దెకు తీసుకొని అందులో ఉండేవాడు. ఆయనతో పాటు ఆ గదిలో యోగానంద్ (తరువాతి కాలంలో నిర్మాత అయ్యాడు) కూడా ఉండేవాడు.
1951లో కె.వి.రెడ్డి పాతాళభైరవి, దాని తరువాత అదే సంవత్సరం బి.ఎన్‌.రెడ్డి మల్లీశ్వరి, 1952లో ఎల్వీ ప్రసాదు పెళ్ళిచేసి చూడు, ఆ తరువాత వచ్చిన కమలాకర కామేశ్వరరావు చిత్రం చంద్ర హారం ఆయనకు నటుడిగా గొప్ప కీర్తిని సంపాదించి పెట్టాయి. ఈ సినిమాలన్నీ విజయావారివే. ప్రతీ సినిమాకు నెలకు 500 రూపాయిలు జీతం మరియు 5000 రూపాయిల పారితోషికమూ ఇచ్చారు. పాతాళభైరవి 34 కేంద్రాలలో 100 రోజులు ఆడి అప్పట్లో సంచలనం సృష్టించింది. తన ఉంగరాల జుట్టుతో, స్ఫురద్రూపంతో, వెలుగులు విరజిమ్మే నవ్వుతో ఆంధ్రదేశ ప్రజలను ఆకట్టుకుని వారి మనసుల్లో నిలిచిపోయాడు.
1956లో విడుదలైన మాయాబజార్‌లో ఆయన తీసుకున్న 7500 రూపాయల పారితోషికం అపట్లో అత్యధికం అని భావిస్తారు. 1959లో ఎవిఎమ్ వారు నిర్మించి, విడుదల చేసిన భూకైలాస్ చిత్రంలో రావణబ్రహ్మ పాత్రకు రామారావు ప్రాణప్రతిష్ఠ చేసాడు. 1960లో విడుదలయిన శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం భారీ విజయం సాధించింది. శ్రీమద్విరాటపర్వములో ఆయన ఐదు పాత్రలు పోషించాడు. ఆ విధంగా 1950లలో ఎన్టీఆర్ ఎంతో ప్రజాదరణ పొందిన నటుడిగా ఎదిగాడు. సంవత్సరానికి 10 సినిమాల చొప్పున నటిస్తూ ఉండేవాడు. 1963లో విడుదలైన లవకుశ అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఎన్టీఆర్ సినిమాల్లోకి వచ్చిన 22 సంవత్సరముల వరకు ఆయన పారితోషికం 4 లేదా 5 అంకెల్లోనే ఉండేది. 1972నుంచి ఆయన పారితోషికం లక్షల్లోకి చేరింది.
ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన మొదటి చిత్రం 1961లో విడుదలైన సీతారామ కళ్యాణం. ఈ చిత్రాన్ని తన సోదరుడు త్రివిక్రమరావు ఆధీనంలోని "నేషనల్ ఆర్టు ప్రొడక్షన్సు" పతాకంపై విడుదల చేసాడు. 1977లో విడుదలైన దాన వీర శూర కర్ణలో ఆయన మూడు పాత్రల్లో నటిస్తూ స్వయంగా దర్శకత్వం చేసాడు. 1978లో విడుదలైన శ్రీరామ పట్టాభిషేకం సినిమాకు కూడా ఆయన దర్శకత్వం వహించాడు. ఎన్టీఆర్ నటించిన సాంఘిక చిత్రాలు అడవిరాముడు, యమగోల గొప్ప బాక్సాఫీసు విజయం సాధించాయి. 1991 ఎన్నికల ప్రచారం కోసం ఆయన నటించి, దర్శకత్వం వహించిన బ్రహ్మర్షి విశ్వామిత్ర 1990లో విడుదలైంది.
ఎన్టీఆర్ క్రమశిక్షణలో చాలా కచ్చితంగా ఉండేవాడు. గంభీరమైన తన స్వరాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజూ మద్రాసు మెరీనా బీచిలో అభ్యాసం చేసేవాడు. నర్తనశాల సినిమా కోసం ఆయన వెంపటి చినసత్యం దగ్గర కూచిపూడి నేర్చుకున్నాడు. వృత్తిపట్ల ఆయన నిబద్ధత అటువంటిది. కెమెరా ముందు ఎన్టీఆర్ తడబడిన దాఖలాలు లేవని చెబుతూంటారు, ఎందుకంటే ఆయన డైలాగులను ముందుగానే కంఠతా పట్టేసేవాడు.
ఎన్టీఆర్ జాతీయ పురస్కారం

ఎన్టీఆర్ పేరిట సినిమా ప్రముఖులకు జీవిత కాలంలో చేసిన సేవకు గుర్తింపుగా ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 1996 లో నెలకొల్పింది. 2002 వరకు ఇస్తూ వచ్చిన ఈ అవార్డును ప్రభుత్వం తరువాత నిలిపివేసింది. ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా 2006 జనవరి 18 న ఈ పురస్కారాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Tuesday, May 27, 2008

జాస్: 5 -రిసర్ఫేస్ ట్రైలర్

తెర కెక్కనున్న టెన్నిస్ స్టార్ సానియా మీర్జా?

ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిని సానియా మీర్జా జీవితం తెరకెక్కనుందని బాలీవుడ్ భోగట్టా.సానియా మీర్జా జీవితంలోని పలు ముఖ్య సంఘటనల ఆధారంగా, కొంత కాల్పనికతను జోడించి ఈ చిత్రాన్ని నిర్మించాలని దర్శక, నిర్మాతల ఆలోచనగా తెలుస్తోంది. బాలీవుడ్ లో గత కొంత కాలంగా స్పోర్ట్స్ సినిమాల హవా కొనసాగుతోంది . ఇటీవల రియల్ లైఫ్ స్టోరీస్ అంటే ప్రేక్షకులు మరింత ఆసక్తిని కనబరుస్తున్నారు. తాజాగా ఈ రెండు అంశాలు కలసి వచ్చేలా ప్రముఖ టెన్నీస్ తార సానియా మీర్జా రియల్ లైఫ్ ఆధారంగా బాలీవుడ్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ చిత్రానికి "ఐ ఫర్ ఇండియా" అనె పేరును రిజిస్టర్ చేసారట. అంబ్లెళ్ళా ఫిలిమ్స్ అథినేత దీపక్ ఆర్ గాంధి ఈ సినిమాను డిస్టిన్ట్ హారిజని ఫిలిమ్స్ (లాస్ యాంజెల్స్) వారితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించడనికి ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నట్లు తాజా సమాచారం. హేమంత్ దాస్ దర్శకత్వంలో నిర్మించనున్న ఈ చిత్ర కథకోసం సానియా మీర్జా స్పోర్ట్స్ జీవితంలోని కొన్ని ముఖ్య ఘట్టాలకు తీసుకుని వాటికి కొంత డ్రామా జోడించి, స్క్రిఫ్టు రెడీ చేస్తున్నారట. ఈ కథ సానియా మీర్జా ఒక్కరిదే కాదు ఎదుగుదల కోరుకునే ప్రతీ ఆటగాడి కథగా దర్శక, నిర్మాతలు చెబుతున్నట్లు బాలీవుడ్ న్యూస్.

Monday, May 26, 2008

3500 థియేటర్లలో విడుదల కానున్న రజినీకాంత్ "సుల్తాన్ ది వారియర్"

సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ,ఆయన కుమార్తె సౌందర్య స్వీయ దర్శకత్వంలో రూపొందిన యానిమేషన్ చిత్రం "సుల్తాన్ ది వారియర్" చిత్రం ప్రపంచవ్యాప్తంగా 3500 థియేటర్లలో విడుదల కానుంది। ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమైంది. కాగా ఆ చిత్రం గురించి రజినీ కూతురు సౌందర్య పూర్తి సంతృప్తితో ఉన్నట్లు సమాచారం. దాంతో ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా 3500 థియేటర్లలో విడుదల చేయాలని నిశ్చయించినట్లు సమాచారం. రజని చిత్రాల లోనే కాక యానిమేషన్ చిత్రాలలోనూ ఇది ఒక సెన్సేషన్ గా రికార్డులు సృష్టించాలని ఆమె కోరుకుంటున్నారు. ప్రముఖ కార్పోరేట్ సంస్ధ యాడ్ ల్యాబ్స్ తో కలిసి తన యాచర్ స్టూడియో బ్యానరుపై సమ్యుక్తంగా నిర్మించిన ఈ చిత్రం రిలీజ్ డేట్ త్వరలోనే ప్రకటించనున్నట్లు సమాచారం.

హాలీవుడ్ చిత్రం "ఆస్ట్రేలియా" అఫిషియల్ ట్రైలర్

Saturday, May 24, 2008

ముస్తాబవుతున్న రవితేజ "బలాదూర్"

రవితేజ నటిస్తున్న కొత్త చిత్రం పేరు "బలాదూర్" గా ఖరారు చేశారు. మొదటినుంచీ డిఫరెంట్ టైటిల్స్ ఉన్న చిత్రాలలో నటించే రవితేజకిది మరో కొత్త టైటిల్. గతంలో "ఇడియట్", "ఖతర్నాక్","వీడే "అంటూ అల్లరి చిల్లరిగా ఉండే టైటిల్ చిత్రాలలో నటించిన రవితేజ కమర్షియల్ గా విజయాన్ని అందుకున్నాడు.ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ బానర్‌పై డి. సురేష్‌బాబు నిర్మిస్తున్న కొత్త సినిమాకు ఈ టైటిల్ పెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. "కలిసుందాం రా" ఫేమ్ ఉదయశంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనుష్క హీరోయిన్. "విక్రమార్కుడు" తర్వాత రవితేజ, అనుష్క జంటగా నటిస్తున్న సినిమా కావటంతో ట్రేడ్ లో ఇంట్రస్టుగా ఉంది. అంతేగాక సీనియర్ నటుడు కృష్ణ ఒక కీలక పాత్రలో నటిస్తూండటం మరో విశేషం. ఈ సినిమాకు కె.ఎం రాధాకృష్ణన్ సంగీతం సమకూరుస్తుండగా, మణిశర్మ రీ రికార్డింగ్ అందించనున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.

"ది మమ్మీ:టోంబ్ ఆఫ్ ది డ్రాగన్ ఎంపరర్" టీసర్

"సెక్స్ అండ్ ది సిటి" ట్రైలర్

Thursday, May 22, 2008

ఇంత మౌనమేల చిరంజీవా?!

బోధిసత్వుడిలా మౌన ముద్ర దాల్చిన చిరంజీవి మౌనం ఇప్పట్లో వీడేనా? చిరంజీవి ఆత్మీయులైన అల్లు అరవింద్ సహా మరెవరికైనా చిరంజీవి మౌనం వెనకున్న రహస్యం తెలుసా? చిరంజీవికి రాజకీయ పార్టీ పెట్టే ఉద్దేశ్యం అసలుందా? సరే రాజకీయ పార్టీ పెట్టే ఉద్దేశ్యం చిరంజీవికి లేదనుకుందాం, మరి అతని కొత్త చిత్రం ప్రారంభించడానికి ఇంత కాలం వేచి ఉండటం ఎందుకు, తెలుగు గడ్డేమైనా రచయితలకు, దర్శకులకు గొడ్డు బోయిందా? రాష్ట్రం మొత్తం చిరంజీవో రామచంద్రా అంటుంటే చిరంజీవి మాత్రం మౌనముద్ర దాల్చడం వెనుక ఉద్దేశ్యం ప్రజలలో, పాలకులలో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెంచి ఒక్క సారిగా రాష్ట్ర రాజకీయాలలోకి చొచ్చుకురావాలనే తలంపా? లేక చిరంజీవి నమ్ముకున్న "ఆ నలుగురిదీ" రాజకీయ ప్రణాళిక చేయలేని అసమర్దతా? .....ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు చిరంజీవి అభిమానులను, ప్రత్యర్ధులను తొలిచి వేస్తున్నాయి. ఎంత తరచి తరచి చూసినా ఈ ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదని అభిగ్న వర్గాల ఉవాచ. మరోవైపు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెంచడం వల్ల ఒక్కోసారి మంచికన్నా చెడే ఎక్కువ జరుగవచ్చనే భయాందోళనలూ అభిమానుల్లో చోటుచేసుకున్నాయి. "అంజి", "మృగరాజు", "యుద్ద భూమి" లాంటి చిత్రాలలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఏర్పడ్డ తర్వాత ఒక్కోసారి తుస్సుమనే అవకాశమూ లేకపోలేదనీ అభిమానులు భయపడుతున్నట్లు సమాచారం. వీటన్నింటికీ మించి ఈ మధ్యన చిరంజీవి బర్త్ డేరోజు పార్టీని ప్రకటిస్తారని ఒకవైపు, కాదు కొత్త సినిమా ప్రారంభిస్తారని మరోవైపూ ప్రచారం ఊపందుకుంది. మరి చివరికి ఎవరి మాట నెగ్గుతుంది. పోనీ కొత్త రాజకీయ ప్రధానమైన చిత్రం నిర్మించి ఆవెంటనే పార్టీని ప్రకటిస్తారనుకుంటే రాబోయే ఎలక్షన్లకు ఉన్న గడువు అతి కొద్ది కాలం మాత్రమే. ఆలోగా పురిటి బిడ్డలాంటి రాజకీయపార్టీతో పెద్ద పార్టీలను ఎదుర్కోగలడా? మరోవైపు చిరంజీవి బలం "యువత" అని ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు, మరి ఇతర వర్గాలను ఎలా ఆకట్టుకుంటారు. గతంలో ఎన్ టి రామారావు లా ప్రభంజనంలా రావాలని ఒకవేళ చిరంజీవి భావిస్తూండవచ్చు, కాని అప్పటి రాజకీయ పరిస్థితులు వేరు, ఇప్పటి రాజకీయ పరిస్థితులు వేరు. అప్పుడంటే రామారావు గారి ప్రజాబలం తెలియక కాంగ్రెస్ పార్టీ ఆయనను బహిరంగంగా రెచ్చగొట్టి అడ్రస్ లేకుండా పోయింది, గత అనుభవంతో ప్రస్తుతం కాంగ్రెస్ ఎక్కువశాతం చిరంజీవి విషయంలో మౌనంగా ఉండటానికే అధిక ప్రాధాన్యతను ఇస్తోంది. మరి ఇలాంటి సమయంలో చిరంజీవి నిర్ణయం కమల్ హాసన్ "దశావతారం" చిత్రంలా వాయిదా పడుతూ వస్తూండటం (గతంలో చిరంజీవి నటించిన "అంజి" చిత్రం కూడా వాయిదాలపై, వాయిదాలు వేస్తూ వచ్చి చివరికి బాక్స్ ఆఫీసు దగ్గర బోల్తా పడిందన్న విశయం చాలా మందికి గుర్తుండే ఉంటుంది) అంత మంచిదేనా? మరి చిరంజీవి తన మౌనాన్ని ఇప్పటికైనా వీడేనా లేక మాజీ ప్రధాని పి వి నరసిం హా రావు గారిలా మౌనాన్ని మరికొన్నాళ్ళు ఆశ్రయిస్తారా...!? చూద్దాం ఏం జరుగుతుందో.

రాబోయే బాలీవుడ్ చిత్రం "లవ్ స్టోరి - 2050" ట్రైలర్

Tuesday, May 20, 2008

హాలీవుడ్ పాప్ గాయని మరియా కేరీ "త్రూ ది రైన్" వీడియో

ఉదయ కిరణ్ "గుండె ఝల్లుమంది" గ్యాలరి








విజయ్ హీరోగా "కంత్రి" తమిళంలోకి

యంగ్ ఎన్టిఆర్, హన్సిక మోత్వానీ జంటగా మెహర్ రమేష్ దర్శకత్వంలో అశ్వినిదత్ నిర్మించిన "కంత్రి" సినిమాని తమిళంలోకి పునర్నిర్మిస్తున్నారని తాజా సమాచారం. ఈ సినిమా చూసిందగ్గర్నుంచి తను హీరోగా తమిళంలోకి రీమేక్ చేయాలని తమిళ క్రేజీ హీరో విజయ్ ముచ్చట పడుతున్నాడని తమిళనాట వార్త గుప్పుమంటోంది. రెగ్యులర్ గా విజయ్ దాదాపు ప్రతి క్రేజి తెలుగు సినిమా రిలీజుకి తప్పని సరిగా హైదరాబాద్ వచ్చి మార్నింగ్ షో చూసి సినిమా నచ్చితే తన నిర్మాతలని తమిళ రైట్స్ కోసం పంపుతూండటం విజయ్ కు ఆనవాయితీ. ఆ వరసలోనే మహేష్ బాబు "ఒక్కడు" సినిమాని "గిల్లి" పేరుతో రీమేక్ చేసి సంచలన విజయం సాధించారు. అలాగే "పోకిరి" సినిమాను "పోకిరి" పేరుతోనే తమిళ వెర్షన్ చేసి ఘన విజయాన్ని అందుకున్నాడు. సాధారణంగా విజయ్ కు తెలుగు సినిమాలపై ఆసక్తి ఎక్కువ.తమిళంలో అందరి హీరోల కన్నా ఎక్కువ తెలుగు రీమేక్ లు చేసిన ఘనత ఆయనకే దక్కింది. అందులోనూ "బొమ్మరిల్లు", "ఆడువారి మాటలకు అర్ధాలు వేరులే" చిత్రాలు తమిళంలోకి జయం రవి, ధనుష్ లతో రీమేకై హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో నడుస్తున్నాయి. దాంతో విజయ్ ప్రస్తుతం నటిస్తున్న "సింగం" చిత్రం తర్వాత తప్పకుండా మరో తెలుగు చిత్రం రీమేక్ లో నటించాలని విజయ్ ఆసక్తి కనబరుస్తున్న టైంలో "కంత్రి" సినిమా చూడటం, అది నచ్చడంతో వెంటనే ఈ చిత్ర రీమక్ చేయడం కోసం చిత్ర హక్కులను తీసుకోవడం జరిగిందని సమాచారం.

Monday, May 19, 2008

ఐశ్వర్య రాయ్ ఎక్స్ క్లూజివ్ క్లోజప్స్









22న రానున్న "బుజ్జిగాడు"

ప్రభాస్ హీరోగా దర్శకుడు పూరీ జగన్నాథ్ రూపొందించిన "బుజ్జిగాడు-మేడిన్ చెన్నై" 22న విడుదల కానుంది. త్రిష, సంజన హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కెఎస్ రామారావు నిర్మించారు. ప్రభాస్ సినిమాలన్నింటికంటే భారీ స్థాయిలో అత్యధిక ప్రింట్లతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయడానికి కె యెస్ రామారావు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో త్రిష అన్నగా, శివన్న అనే డాన్ పాత్రను మోహన్‌బాబు పోషించారు. ఆయన "డియర్" అనే డైలాగుతో కూడిన మేనరిజమ్ తో కనపడతారని సమాచారం. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు సందీప్ చౌతా అందించిన ప్రోమోలు ,పాటలు ఇప్పటికే ప్రేక్షకులలో ఆదరన చూరగొన్నాయి. ఇందులో రజనీకాంత్ వీరాభిమానిగా బుజ్జి అనే పాత్రలో ప్రభాస్ కనిపించనున్నాడు.ఇంతకు ముందు జగన్ డైరెక్ట్ చేసిన "పోకిరి", "దేశముదురు" వంటి సూపర్‌హిట్ సినిమాల రేంజిలో ఈ సినిమా కూడా వర్కవుట్ అవుతుందని ప్రభాస్ అభిమానులు ఆశిస్తున్నారు.

Saturday, May 17, 2008

హాలీవుడ్ గాయక - నటి మరియా కేరీ "నెవర్ టూ ఫార్ అవే" వీడియో సాంగ్

మహేష్ బాబుకు 8 కోట్లు, త్రివిక్రం కు 4.5 కోట్లు...?

యంగ్ హీరో మహేష్ బాబు ఒక సినిమాకు తీసుకునే రెమ్యునరేషన్ 8కోట్లు తీసుకుంటున్నట్లు టాలీవుడ్ లో వదంతులు వ్యాపించాయి. "వరుడు" సినిమాకు మహేష్ బాబు 8 కోట్ల రూపాయలను, ఆ చిత్ర దర్శకుడు త్రివిక్రం శ్రీనివాస్ 4.5 కోట్ల రూపాయలను రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నట్లు సమాచారం. త్రివిక్రమ్ దర్శకత్వంలో శింగమల రమేష్ నిర్మిస్తున్నక్రేజి చిత్రం "వరుడు" సినిమా కు గాను చిత్ర నిర్మాత రెమ్యునేషన్ నిమిత్తం మహేష్ బాబుకి 8 కోట్లు , త్రివిక్రమ్ కి 4.5 కోట్లు ఇచ్చారని అలాగే 30 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమా తెరకెక్కించబోతున్నరనేది ఆ వార్తల సారాంశం. ఇది విన్న కొందరు హీరోలు, దర్శకులు తమ రెమ్యునేషన్స్ పెంచాలని పి.ఆర్ లతో చర్చిస్తున్నారుట . మరో ప్రక్క ఈ వార్త నిర్మాతల గుండెల్లో రైళ్ళు పరుగెత్తిస్తోందిట. కొందరైతే ఇది నేషనల్, ఓవర్ సీస్ మార్కెట్ ఉన్న బాలీవుడా అని బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారుట. కాని ఇప్పుడున్న పరిస్ధితుల్లో డబ్బు గురించి ఆలోచిస్తే పెద్ద హీరోల డేట్స్ దొరకవు అలా స్పీడుగా ఉన్నాడు కాబట్టే శింగమల రమేష్ పవన్ తో "పులి", మహేష్ తో "వరుడు" యేక కాలంలో ప్రారంభించాడని మరికొందరు ఫిల్మ్ ఛాంబర్ పెద్దలు సమర్ధస్తున్నారట. యేది ఎలా ఉన్నా ఈ సినిమా పై మంచి హోప్స్ ఉన్నాయి. ఇక ఈ సినిమా మొత్తం ఫన్ కలిసిన రొమంటిక్ ఎడ్వంచర్స్ తో సాగుతుందిట. ఎలాగో త్రివిక్రమ్ తరహా పంచ్ లు ఉండనే ఉంటాయి. మహేష్ స్టైలిష్ యాక్షన్ తప్పనిసరి. అలాగే వీరి కాంబినేషన్లో గతంలో వచ్చి హిట్టైన "అతడు" సినిమాకి పూర్తి భిన్నంగా ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారుట. చూద్దాం ఏం జరుగుతుందో.

మోస్ట్ ఎక్స్పెక్టెడ్ హాలీవుడ్ ఫ్యాంటసీ ఫిలిం "ట్విలైట్" ట్రైలర్

ఫ్యూచరిస్టిక్ మెగా థియేటర్ (చైనా) -ఎక్స్ క్లూజివ్ గ్యాలరీ


మీరు చూస్తోంది ఆసియా ఖండంలోనే అత్యున్నతమైన టెక్నికల్లీ అడ్వాన్స్డ్ సినెమా థియేటర్.హాంగ్ కాంగ్ ఐస్లాండ్స్ లో ఉన్న క్వీన్ మేరీ జిల్లలో ఉన్న ఈ థియేటర్ పేరు "ఎ ఎం సి పసిఫిక్ ప్యాలెస్ సినెమా".