Friday, May 16, 2008

అమితాబ్ బచ్చన్ "సర్కార్ రాజ్" కథ

శివసేన అధినేత బాల్‌థాకరే జీవితానికి చాలా దగ్గరగా వున్న కథతో రాంగోపాల్‌ వర్మ చేసిన ప్రయోగం సర్కార్‌. బాలీవుడ్‌తో పాటు దేశ విదేశాల్లో ఈ సినిమా పెద్ద సంచలనం సృష్టించి కాసుల వర్షం కురిపించింది. దాంతో ఈ సక్సెస్‌ని వర్మ కంటిన్యూ చేయాలనుకున్నాడు. సర్కార్‌కు సీక్వెల్ గా సర్కార్‌ రాజ్‌ను తెరకెక్కిస్తున్నాడు. అంతేగాక అమితాబ్ ఫ్యామిలికి చెందిన ముగ్గురు నటులని ఒకే సారి చూపుతూ వారి చుట్టూ కథ అల్లాడు. దాంతో ఈ చిత్రం ప్రారంభం రోజు నుండే సంచలనం సృష్టించటం ప్రారంభించింది. అందులోనూ వివాహం తరువాత తొలిసారిగా ఐష్‌, అభిషేక్‌ బచ్చన్‌ జంటగా నటిస్తుండటంతో ఆ కెమిస్ట్రీ వేరంటూ అందరూ ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు బ్యాంకాక్‌లో నిర్వహించే ఐఐఎఫ్‌ఐ చిత్రోత్సవంలో ఫిల్మ్‌ ప్రీమియర్‌ షో నిర్వహించాలని అనుకుంటున్నాడు వర్మ. ఇక సర్కార్ రాజ్ కథ విషయానికొస్తే... ఐశ్వర్యారాయ్ ఓ అంతర్జాతీయ కంపెనీకి సీఈఓ. ఆమె మహారాష్ట్రలోని ఓ మారుమూల గ్రామంలో విద్యుత్‌ ప్లాంట్‌ నెలకొల్పాలనుకుంటుంది. అయితే అక్కడ ప్రాంతాలకు పెద్ద అయిన అమితాబ్‌ బచ్చన్‌ గట్టిగా వ్యతిరేకిస్తాడు. చివరగా ప్రాజెక్ట్‌ ఉపయోగాలు దాని వల్ల తమ గ్రామాలు బాగుపడే తీరు తెలుసుకుంటాడు. ఐష్ కి మద్దతు తెలుపుతాడు. సమస్య తీరిపోయిందనుకుని పనులు ప్రారంభించే సమయంలో అక్కడ రాజకీయాలు ప్రారంభమవుతాయి. దీంతో కథ అనుకోని మలుపు తిరిగి రసవత్తరంగా ముందుకు సాగుతుంది. చివరికి పవర్‌ ప్రాజెక్ట్‌ పరిస్థితి ఏమైంది అనేది ఉత్కంఠతో తీర్చిదిద్దారట వర్మ. దాంతో సర్కార్‌ తరహాలోనే ఈ చిత్రం కాసుల వర్షాన్ని కుర్పిస్తుందని భావిస్తూ జూన్‌ ఆరున చిత్రం రిలీజ్‌ చేయాలని భావిస్తున్నాడు.
(కర్టేసి: దట్స్ తెలుగు)

No comments: