Wednesday, May 7, 2008
"కంత్రి" సినిమాలో టీడీపీకి ప్రచారం
యంగ్ ఎన్ టీ ఆర్ తన లేటెస్ట్ చిత్రం "కంత్రి" ద్వారా తెలుగు దేశం పార్టీకి ప్రచారం చేస్తున్నారనే వదంతి టాలీవుడ్ లో గుప్పుమంటోంది. వేసవిలో విడుదలవనున్న హాట్ ఫెవరేట్ చిత్రం "కంత్రి" మీదే అందరి దృస్టీ కేంద్రీకృతం అవడంతో ఈ రూమర్ కు అధిక ప్రాధాన్యత సంతరించుకుంది. టాలీవుడ్ లో ఎక్కడ విన్నా ఆ విశేషాలే వినిపిస్తున్నాయి. చిత్రంలో టి.డి.పి ని సపోర్టు చేస్తూ నేటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కొన్ని పొలిటికల్ డైలాగులు, సన్నివేశాలు సినిమాలో ఉన్నాయనే వార్త అభిమానులను మరీ ఊరిస్తోంది. అసలు సినిమా ప్రారంభం లోనే ఎన్టీఆర్ సైకిల్ తో కనపడి కొన్ని పార్టీకి ఊపు నిచ్చే డైలాగులు కొడతాడని రూమర్లు వినిపిస్తున్నాయి. అలాగే తన తాతగారైన ఎన్టీఆర్ గురించి ఆరాధన భావంతో మాట్లాడుతూ సైకిలుకి పూర్తి స్ధాయిలో తన అండదండలు ఉంటాయని చెపుతాడుట.ఇవి నిజమైతే "కంత్రి" ద్వారా తన వంతు సాయం తమ పార్టీకి చేస్తున్నాడన్నమాట. అయితే దీన్ని యంగ్ ఎన్టీఆర్ ఖండిస్తున్నాడు. "ప్రత్యేకంగా ఓ పార్టీ గురించో, మరొకరి గురించో ప్రస్తావించే రాజకీయ సంభాషణలు కంత్రీ లో లేవు. కథానుగుణంగా సామాజిక శ్రేయస్సు దృష్ట్యా కొన్ని మాటలున్నా వాటికి రాజకీయాలతో ముడిపెట్టలేం" అని అతను చెపుతున్నట్లు సమాచారం. నిజం ఈ తొమ్మిదవ తేదీకే తెలుస్తుంది. కాదంటారా...?
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment