
ఇటీవల పాకిస్థాన్ పర్యటనకు వెళ్లిన భారత విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఆ దేశ ప్రధాని కోసం ఓ ప్రత్యేకమైన బహుమతి తీసుకెళ్లారు. ప్రముఖ బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్
సి
నిమాలతో నింపిన బాక్సును పాకిస్థాన్ కొత్త ప్రధానమంత్రి యూసఫ్ రజా గిలానీకి ప్రణబ్ బహుమతిగా అందించారు. గిలానీ (55)కి బాలీవుడ్ నటులు ఐశ్వర్యారాయ్, షారుక్‌ఖాన్‌పై ఎంత అభిమానముందంటే, దీనికి సమాధానం ఆయన కూడా మాటల్లో చెప్పలేరు. ప్రణబ్
ము
ఖర్జీ ఇచ్చిన బహుమతిని చూసి ఆశ్చర్యపోయా. తనకు ఇచ్చిన బహుమతిలో పూర్తిగా ఐశ్వర్యారాయ్ నటించిన సినిమాల డీవీడీలు ఉన్నాయని గిలానీ చెప్పారు. గిలానీ అభిమాన నటి ఐశ్వర్యారాయ్ అని తెలుసుకున్న ముఖర్జీ తన పాక్ పర్యటనలో ఆయనను కలుసుకున్న సందర్భంగా ఈ డీవీడీలను బహుమతిగా ఇచ్చారు. ఐశ్వర్యారాయ్ అంటే తనకెంత అభిమానముందో అప్పుడప్పుడు గిలానీ చెబుతుంటారు. తాజాగా ఆమె సినిమా డీవీడీలు ఇచ్చి గిలానీ చేత ప్రణబ్ ముఖర్జీ మరోసారి ఐష్ నామజపం చేయించారు. ఐస్ చేసారు.
No comments:
Post a Comment