Tuesday, May 20, 2008
విజయ్ హీరోగా "కంత్రి" తమిళంలోకి
యంగ్ ఎన్టిఆర్, హన్సిక మోత్వానీ జంటగా మెహర్ రమేష్ దర్శకత్వంలో అశ్వినిదత్ నిర్మించిన "కంత్రి" సినిమాని తమిళంలోకి పునర్నిర్మిస్తున్నారని తాజా సమాచారం. ఈ సినిమా చూసిందగ్గర్నుంచి తను హీరోగా తమిళంలోకి రీమేక్ చేయాలని తమిళ క్రేజీ హీరో విజయ్ ముచ్చట పడుతున్నాడని తమిళనాట వార్త గుప్పుమంటోంది. రెగ్యులర్ గా విజయ్ దాదాపు ప్రతి క్రేజి తెలుగు సినిమా రిలీజుకి తప్పని సరిగా హైదరాబాద్ వచ్చి మార్నింగ్ షో చూసి సినిమా నచ్చితే తన నిర్మాతలని తమిళ రైట్స్ కోసం పంపుతూండటం విజయ్ కు ఆనవాయితీ. ఆ వరసలోనే మహేష్ బాబు "ఒక్కడు" సినిమాని "గిల్లి" పేరుతో రీమేక్ చేసి సంచలన విజయం సాధించారు. అలాగే "పోకిరి" సినిమాను "పోకిరి" పేరుతోనే తమిళ వెర్షన్ చేసి ఘన విజయాన్ని అందుకున్నాడు. సాధారణంగా విజయ్ కు తెలుగు సినిమాలపై ఆసక్తి ఎక్కువ.తమిళంలో అందరి హీరోల కన్నా ఎక్కువ తెలుగు రీమేక్ లు చేసిన ఘనత ఆయనకే దక్కింది. అందులోనూ "బొమ్మరిల్లు", "ఆడువారి మాటలకు అర్ధాలు వేరులే" చిత్రాలు తమిళంలోకి జయం రవి, ధనుష్ లతో రీమేకై హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో నడుస్తున్నాయి. దాంతో విజయ్ ప్రస్తుతం నటిస్తున్న "సింగం" చిత్రం తర్వాత తప్పకుండా మరో తెలుగు చిత్రం రీమేక్ లో నటించాలని విజయ్ ఆసక్తి కనబరుస్తున్న టైంలో "కంత్రి" సినిమా చూడటం, అది నచ్చడంతో వెంటనే ఈ చిత్ర రీమక్ చేయడం కోసం చిత్ర హక్కులను తీసుకోవడం జరిగిందని సమాచారం.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment