Saturday, May 31, 2008

పాకిస్థాన్ ప్రధానికి ఐశ్వర్య రాయ్ చిత్రాలను బహుమతిగా అందించిన ప్రణబ్ ముఖర్జీ

ఇటీవల పాకిస్థాన్ పర్యటనకు వెళ్లిన భారత విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఆ దేశ ప్రధాని కోసం ఓ ప్రత్యేకమైన బహుమతి తీసుకెళ్లారు. ప్రముఖ బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ సినిమాలతో నింపిన బాక్సును పాకిస్థాన్ కొత్త ప్రధానమంత్రి యూసఫ్ రజా గిలానీకి ప్రణబ్ బహుమతిగా అందించారు. గిలానీ (55)కి బాలీవుడ్ నటులు ఐశ్వర్యారాయ్, షారుక్‌ఖాన్‌పై ఎంత అభిమానముందంటే, దీనికి సమాధానం ఆయన కూడా మాటల్లో చెప్పలేరు. ప్రణబ్ ముఖర్జీ ఇచ్చిన బహుమతిని చూసి ఆశ్చర్యపోయా. తనకు ఇచ్చిన బహుమతిలో పూర్తిగా ఐశ్వర్యారాయ్ నటించిన సినిమాల డీవీడీలు ఉన్నాయని గిలానీ చెప్పారు. గిలానీ అభిమాన నటి ఐశ్వర్యారాయ్ అని తెలుసుకున్న ముఖర్జీ తన పాక్ పర్యటనలో ఆయనను కలుసుకున్న సందర్భంగా ఈ డీవీడీలను బహుమతిగా ఇచ్చారు. ఐశ్వర్యారాయ్‌ అంటే తనకెంత అభిమానముందో అప్పుడప్పుడు గిలానీ చెబుతుంటారు. తాజాగా ఆమె సినిమా డీవీడీలు ఇచ్చి గిలానీ చేత ప్రణబ్ ముఖర్జీ మరోసారి ఐష్ నామజపం చేయించారు. ఐస్ చేసారు.

Friday, May 30, 2008

డా.రాజశేఖర్ ఇంట్లో సి డి ల దొంగతనం


సినీ నటుడు రాజశేఖర్ కార్యాలయంలో బుధవారం అర్ధరాత్రి దొంగతనం జరిగింది. జూబిలీహిల్స్ లోని ఫిల్మ్ నగరులో ఉన్న ఆయన కార్యాలయంలోకి దుండుగులు ప్రవేశించి పలు విలువైఅన్ సి డి లు ఎత్తుకెళ్ళారు. దుండగులు కంప్యూటరును కూడా ధ్వంసం చేశారు. పలు విలువైన సిడిలను, కీలక పత్రాలను ఎత్తుకెళ్లారు. ఈ విషయాన్ని రాజశేఖర్, జీవిత దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. "పథకం ప్రకారమే ఎవరో దొంగతనం చేయించారని, దొంగతనం కోసం వచ్చినవారికి కంప్యూటర్ ధ్వంసం చేయాల్సిన అవసరం ఏముంటుందని" రాజశేఖర్ భార్య జీవిత అన్నారు. బతుకు దెరువు కోసం దొంగతనం చేసేవారికి సిడీలు, పత్రాలతో పనేముంటుందని, ఇది కావాలనే ఎవరో చేయించారని ఆమె తన కంప్లైంట్ లో పేర్కొన్నారు.

హాలీవుడ్ మెగా ఆక్షన్ మూవీ "హక్-2" ట్రైలర్

video

Thursday, May 29, 2008

విల్ స్మిత్ కొత్త చిత్రం "హ్యంకాక్" స్టిల్స్






శ్రీకృష్ణ విశ్వరూపం ప్రదర్శిస్తున్న ఎన్ టి రామారావు (వీడియో)

video

Wednesday, May 28, 2008

విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు

తెలుగు నాట పరిచయం అక్కరలేని వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. భారత దేశం గర్వించదగ్గ గొప్ప నటుడు, దర్శకుడు, నిర్మాతగా ఆయనను ప్రపంచమే గుర్తించింది.ఎన్.టి.ఆర్ నటనను ఆస్వాదించని ఒక్క తెలుగు వాడుంటాడా అని చెప్పడం కష్టం. ఆంధ్ర రాష్ట్రంలో ఓ కథుంది. ఓ పేదవాడు తన కష్టాలను తీర్చమని ప్రతిరోజూ దేవాలయంలో మ్రొక్కుకునేవాడు. అతని కష్టాలను చూసిన దేవునికి అతనిపై జాలి కలిగి ఒకరోజు ఆ పేద భక్తునికి ప్రత్యక్షమై"భక్తా, నీ భక్తికి మెచ్చాను,ఏం కావాలో కోరుకో " అనగానే ఆ పేద భక్తుడు భగవంతునివైపు బాగా పరిశీలనగా చూసి "పో పోవయ్యా, పొద్దున్నే నీకు నేనే దొరికానా, భగవంతుడంటే ఎట్టా వుంటాడు మా ఎంటోడిలాగా(ఎన్.టి.ఆర్ లాగా) వుంటాడు, నేను ఎన్ని సినిమాలలో సూల్లేదు, కృష్నుడిగా, రాముడిగా, రావణాసురునిగా, దేవుడైనా, రాచ్చసుడైనా ఎట్టావుంటాదో మాతెలుగు సినిమాలు సూసే వాళ్ళకంతా ఎరికే, నీ పగటి యేషాలు నాదగ్గర చూయించకు, యెళ్ళు, యెళ్ళి మరెవరినైనా అడుక్కో కలో, గంజో పోస్తారు" అనగానే ఆ దేవుడికి సహితం దిమ్మతిరిగిపోతుందని ఆ కథ సారాంశం. తన నటనతో తెలుగు ప్రజానీకం హృదయాల్లో అంతగా స్థానం సంపాదించిన గొప్ప నటుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు.
తెలుగువారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే నందమూరి తారక రామారావు (1923 మే 28 - 1996 జనవరి 18) ఒక గొప్ప నటుడు, ప్రజానాయకుడు. రామారావు, ఎన్.టి.ఆర్, ఎన్.టి.రామారావు గా కూడా ప్రసిద్ధుడైన ఆయన, తెలుగు, తమిళం మరియు హిందీ భాషలలో కలిపి దాదాపుగా 302 చిత్రాలలో నటించాడు. తన ప్రతిభను కేవలం నటనకే పరిమితం చేయకుండా పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు. విశ్వ విఖ్యాత నటసార్వభౌముడుగా బిరుదాంకితుడైన ఆయన, అనేక జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించడమేగాక, రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగు వారి హృదయాలలో శాశ్వతంగా నిలచిపోయాడు. రామారావు 1982 లో తెలుగుదేశం పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించి రాజకీయ రంగప్రవేశం చేసాడు. పార్టీని స్థాపించిన కేవలం 9 నెలల్లోనే ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించుతూ అధికారాన్ని కైవసం చేసుకున్నాడు. ఆ తరువాత మూడు దఫాలుగా దాదాపు 8 సంవత్సరాల పాటు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి, అప్పటి వరకు అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా నిలచాడు.

బాల్యము, విద్యాభ్యాసము

నందమూరి తారక రామారావు 1923, మే 28 వ తేదీన, సాయంత్రం 4:32కి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా, పామర్రు మండలంలోని, నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య చౌదరి, వెంకట రామమ్మ దంపతులకు జన్మించాడు. మొదట కృష్ణ అని పేరుపెట్టాలని తల్లి అనుకున్నప్పటికీ, మేనమామ తారక రాముడయితే బాగుంటుంది అని చెప్పడంతో ఆ పేరే పెట్టారు. తరువాత అది కాస్తా తారక రామారావుగా మారింది. పాఠశాల విద్య విజయవాడ మునిసిపలు హైస్కూలులో చదివాడు. తరువాత విజయవాడ ఎస్.ఆర్.ఆర్. కాలేజీలో చేరాడు. ఇక్కడ విశ్వనాథ సత్యనారాయణ తెలుగు విభాగానికి అధిపతి. ఒకసారి రామారావును ఒక నాటకములో ఆడవేషం వేయమన్నాడు. అయితే రామారావు తన మీసాలు తీయటానికి 'ససేమిరా' అన్నాడు. మీసాలతోటే నటించడం వలన ఆయనకు "మీసాల నాగమ్మ" అనే పేరు తగిలించారు. 1942 మే నెలలో 20 ఏళ్ళ వయసులో మేనమామ కుమార్తె అయిన బసవ రామతారకంను పెళ్ళి చేసుకున్నాడు. వివాహో విద్యానాశాయ అన్నట్లు పెళ్ళయిన తరువాత పరీక్షల్లో రెండుసార్లు తప్పాడు. తర్వాత గుంటూరు ఆంధ్రా క్రిస్టియన్ కళాశాలలో చేరాడు. అక్కడకూడా నాటక సంఘాల కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనేవాడు. ఆ సమయంలోనే నేషనల్ ఆర్ట్ థియేటర్ గ్రూప్ (ణాట్) అనే నాటక సంస్థను స్థాపించి కొంగర జగ్గయ్య, ముక్కామల, నాగభూషణం, కె.వి.ఎస్.శర్మ తదితరులతో చేసిన పాపం వంటి ఎన్నో నాటకాలు ఆడాడు. తర్వాతి కాలంలో ఈ సంస్థ కొన్ని చిత్రాలను కూడా నిర్మించింది. ఎన్టీఆర్ మంచి చిత్రకారుడు కూడా. రాష్ట్రవ్యాప్త చిత్రలేఖన పోటీలలో ఆయనకు బహుమతి కూడా లభించింది. సుభాష్ చంద్రబోసు విజయవాడ వచ్చినప్పుడు ఎన్టీఆర్ బోసు బొమ్మను చిత్రించి ఆయనకు కానుకగా ఇచ్చాడు.
చలనచిత్ర జీవితం

రామారావు కాలేజీలో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు వారి ఆస్తి మొత్తం ఏవో కొన్నికారణాల వల్ల హరించుకుపోయింది. అప్పుడు యుక్తవయసులో ఉన్న రామారావు జీవనం కోసం అనేక పనులు చేసాడు. కొన్ని రోజులు పాల వ్యాపారం, తరువాత కిరాణా కొట్టు, ఆపై ఒక ముద్రణాలయాన్ని కూడా నడిపాడు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అప్పు చేసేవాడు కాదు.
రామారావు 1947లో పట్టభద్రుడయ్యాడు. తదనంతరం ఆయన మద్రాసు సర్వీసు కమీషను పరీక్ష రాసాడు. పరీక్ష రాసిన 1100 మంది నుండి ఎంపిక చేసిన ఏడుగురిలో ఒకడుగా నిలిచాడు. అప్పుడు ఆయనకు మంగళగిరిలో సబ్-రిజిస్ట్రారు ఉద్యోగం లభించింది. అయితే సినిమాలలో చేరాలనే ఆశయం కారణంగా ఆ ఉద్యోగంలో మూడు వారాలకంటే ఎక్కువ ఉండలేకపోయాడు.
ప్రముఖ నిర్మాత బి.ఏ.సుబ్బారావు ఎన్టీఆర్ ఫొటోను ఎల్వీ ప్రసాదు దగ్గర చూసి, వెంటనే ఆయనను మద్రాసు పిలిపించి పల్లెటూరి పిల్ల సినిమాలో కథానాయకుడిగా ఎంపిక చేసాడు. దీనికి గాను రామారావుకు వెయ్యి నూటపదహార్ల పారితోషికం లభించింది. వెంటనే ఆయన తన సబ్-రిజిస్ట్రారు ఉద్యోగానికి రాజీనామా చేసేసాడు. కానీ సినిమా నిర్మాణం వెంటనే మొదలవలేదు. ఈలోగా మనదేశం అనే సినిమాలో అవకాశం రావడంతో దానిలో నటించాడు. అంచేత ఆయన మొదటిసారి కెమేరా ముందు నటించిన సినిమా మనదేశం అయింది. 1949లో వచ్చిన ఆ సినిమాలో ఆయన ఒక పోలీసు ఇన్స్‌పెక్టర్‌ పాత్ర పోషించాడు. 1950లో పల్లెటూరి పిల్ల విడుదలైంది. అదే సంవత్సరం ఎల్వీ ప్రసాదు షావుకారు కూడా విడుదలైంది. ఈ రెండు సినిమాల తరువాత ఎన్టీఆర్ తన నివాసం మద్రాసుకు మార్చివేశాడు. థౌజండ్‌ లైట్స్‌ ప్రాంతంలో ఒక చిన్న గదిని అద్దెకు తీసుకొని అందులో ఉండేవాడు. ఆయనతో పాటు ఆ గదిలో యోగానంద్ (తరువాతి కాలంలో నిర్మాత అయ్యాడు) కూడా ఉండేవాడు.
1951లో కె.వి.రెడ్డి పాతాళభైరవి, దాని తరువాత అదే సంవత్సరం బి.ఎన్‌.రెడ్డి మల్లీశ్వరి, 1952లో ఎల్వీ ప్రసాదు పెళ్ళిచేసి చూడు, ఆ తరువాత వచ్చిన కమలాకర కామేశ్వరరావు చిత్రం చంద్ర హారం ఆయనకు నటుడిగా గొప్ప కీర్తిని సంపాదించి పెట్టాయి. ఈ సినిమాలన్నీ విజయావారివే. ప్రతీ సినిమాకు నెలకు 500 రూపాయిలు జీతం మరియు 5000 రూపాయిల పారితోషికమూ ఇచ్చారు. పాతాళభైరవి 34 కేంద్రాలలో 100 రోజులు ఆడి అప్పట్లో సంచలనం సృష్టించింది. తన ఉంగరాల జుట్టుతో, స్ఫురద్రూపంతో, వెలుగులు విరజిమ్మే నవ్వుతో ఆంధ్రదేశ ప్రజలను ఆకట్టుకుని వారి మనసుల్లో నిలిచిపోయాడు.
1956లో విడుదలైన మాయాబజార్‌లో ఆయన తీసుకున్న 7500 రూపాయల పారితోషికం అపట్లో అత్యధికం అని భావిస్తారు. 1959లో ఎవిఎమ్ వారు నిర్మించి, విడుదల చేసిన భూకైలాస్ చిత్రంలో రావణబ్రహ్మ పాత్రకు రామారావు ప్రాణప్రతిష్ఠ చేసాడు. 1960లో విడుదలయిన శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం భారీ విజయం సాధించింది. శ్రీమద్విరాటపర్వములో ఆయన ఐదు పాత్రలు పోషించాడు. ఆ విధంగా 1950లలో ఎన్టీఆర్ ఎంతో ప్రజాదరణ పొందిన నటుడిగా ఎదిగాడు. సంవత్సరానికి 10 సినిమాల చొప్పున నటిస్తూ ఉండేవాడు. 1963లో విడుదలైన లవకుశ అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఎన్టీఆర్ సినిమాల్లోకి వచ్చిన 22 సంవత్సరముల వరకు ఆయన పారితోషికం 4 లేదా 5 అంకెల్లోనే ఉండేది. 1972నుంచి ఆయన పారితోషికం లక్షల్లోకి చేరింది.
ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన మొదటి చిత్రం 1961లో విడుదలైన సీతారామ కళ్యాణం. ఈ చిత్రాన్ని తన సోదరుడు త్రివిక్రమరావు ఆధీనంలోని "నేషనల్ ఆర్టు ప్రొడక్షన్సు" పతాకంపై విడుదల చేసాడు. 1977లో విడుదలైన దాన వీర శూర కర్ణలో ఆయన మూడు పాత్రల్లో నటిస్తూ స్వయంగా దర్శకత్వం చేసాడు. 1978లో విడుదలైన శ్రీరామ పట్టాభిషేకం సినిమాకు కూడా ఆయన దర్శకత్వం వహించాడు. ఎన్టీఆర్ నటించిన సాంఘిక చిత్రాలు అడవిరాముడు, యమగోల గొప్ప బాక్సాఫీసు విజయం సాధించాయి. 1991 ఎన్నికల ప్రచారం కోసం ఆయన నటించి, దర్శకత్వం వహించిన బ్రహ్మర్షి విశ్వామిత్ర 1990లో విడుదలైంది.
ఎన్టీఆర్ క్రమశిక్షణలో చాలా కచ్చితంగా ఉండేవాడు. గంభీరమైన తన స్వరాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజూ మద్రాసు మెరీనా బీచిలో అభ్యాసం చేసేవాడు. నర్తనశాల సినిమా కోసం ఆయన వెంపటి చినసత్యం దగ్గర కూచిపూడి నేర్చుకున్నాడు. వృత్తిపట్ల ఆయన నిబద్ధత అటువంటిది. కెమెరా ముందు ఎన్టీఆర్ తడబడిన దాఖలాలు లేవని చెబుతూంటారు, ఎందుకంటే ఆయన డైలాగులను ముందుగానే కంఠతా పట్టేసేవాడు.
ఎన్టీఆర్ జాతీయ పురస్కారం

ఎన్టీఆర్ పేరిట సినిమా ప్రముఖులకు జీవిత కాలంలో చేసిన సేవకు గుర్తింపుగా ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 1996 లో నెలకొల్పింది. 2002 వరకు ఇస్తూ వచ్చిన ఈ అవార్డును ప్రభుత్వం తరువాత నిలిపివేసింది. ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా 2006 జనవరి 18 న ఈ పురస్కారాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Tuesday, May 27, 2008

జాస్: 5 -రిసర్ఫేస్ ట్రైలర్

video

తెర కెక్కనున్న టెన్నిస్ స్టార్ సానియా మీర్జా?

ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిని సానియా మీర్జా జీవితం తెరకెక్కనుందని బాలీవుడ్ భోగట్టా.సానియా మీర్జా జీవితంలోని పలు ముఖ్య సంఘటనల ఆధారంగా, కొంత కాల్పనికతను జోడించి ఈ చిత్రాన్ని నిర్మించాలని దర్శక, నిర్మాతల ఆలోచనగా తెలుస్తోంది. బాలీవుడ్ లో గత కొంత కాలంగా స్పోర్ట్స్ సినిమాల హవా కొనసాగుతోంది . ఇటీవల రియల్ లైఫ్ స్టోరీస్ అంటే ప్రేక్షకులు మరింత ఆసక్తిని కనబరుస్తున్నారు. తాజాగా ఈ రెండు అంశాలు కలసి వచ్చేలా ప్రముఖ టెన్నీస్ తార సానియా మీర్జా రియల్ లైఫ్ ఆధారంగా బాలీవుడ్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ చిత్రానికి "ఐ ఫర్ ఇండియా" అనె పేరును రిజిస్టర్ చేసారట. అంబ్లెళ్ళా ఫిలిమ్స్ అథినేత దీపక్ ఆర్ గాంధి ఈ సినిమాను డిస్టిన్ట్ హారిజని ఫిలిమ్స్ (లాస్ యాంజెల్స్) వారితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించడనికి ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నట్లు తాజా సమాచారం. హేమంత్ దాస్ దర్శకత్వంలో నిర్మించనున్న ఈ చిత్ర కథకోసం సానియా మీర్జా స్పోర్ట్స్ జీవితంలోని కొన్ని ముఖ్య ఘట్టాలకు తీసుకుని వాటికి కొంత డ్రామా జోడించి, స్క్రిఫ్టు రెడీ చేస్తున్నారట. ఈ కథ సానియా మీర్జా ఒక్కరిదే కాదు ఎదుగుదల కోరుకునే ప్రతీ ఆటగాడి కథగా దర్శక, నిర్మాతలు చెబుతున్నట్లు బాలీవుడ్ న్యూస్.

Monday, May 26, 2008

3500 థియేటర్లలో విడుదల కానున్న రజినీకాంత్ "సుల్తాన్ ది వారియర్"

సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ,ఆయన కుమార్తె సౌందర్య స్వీయ దర్శకత్వంలో రూపొందిన యానిమేషన్ చిత్రం "సుల్తాన్ ది వారియర్" చిత్రం ప్రపంచవ్యాప్తంగా 3500 థియేటర్లలో విడుదల కానుంది। ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమైంది. కాగా ఆ చిత్రం గురించి రజినీ కూతురు సౌందర్య పూర్తి సంతృప్తితో ఉన్నట్లు సమాచారం. దాంతో ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా 3500 థియేటర్లలో విడుదల చేయాలని నిశ్చయించినట్లు సమాచారం. రజని చిత్రాల లోనే కాక యానిమేషన్ చిత్రాలలోనూ ఇది ఒక సెన్సేషన్ గా రికార్డులు సృష్టించాలని ఆమె కోరుకుంటున్నారు. ప్రముఖ కార్పోరేట్ సంస్ధ యాడ్ ల్యాబ్స్ తో కలిసి తన యాచర్ స్టూడియో బ్యానరుపై సమ్యుక్తంగా నిర్మించిన ఈ చిత్రం రిలీజ్ డేట్ త్వరలోనే ప్రకటించనున్నట్లు సమాచారం.

హాలీవుడ్ చిత్రం "ఆస్ట్రేలియా" అఫిషియల్ ట్రైలర్

video

Saturday, May 24, 2008

ముస్తాబవుతున్న రవితేజ "బలాదూర్"

రవితేజ నటిస్తున్న కొత్త చిత్రం పేరు "బలాదూర్" గా ఖరారు చేశారు. మొదటినుంచీ డిఫరెంట్ టైటిల్స్ ఉన్న చిత్రాలలో నటించే రవితేజకిది మరో కొత్త టైటిల్. గతంలో "ఇడియట్", "ఖతర్నాక్","వీడే "అంటూ అల్లరి చిల్లరిగా ఉండే టైటిల్ చిత్రాలలో నటించిన రవితేజ కమర్షియల్ గా విజయాన్ని అందుకున్నాడు.ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ బానర్‌పై డి. సురేష్‌బాబు నిర్మిస్తున్న కొత్త సినిమాకు ఈ టైటిల్ పెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. "కలిసుందాం రా" ఫేమ్ ఉదయశంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనుష్క హీరోయిన్. "విక్రమార్కుడు" తర్వాత రవితేజ, అనుష్క జంటగా నటిస్తున్న సినిమా కావటంతో ట్రేడ్ లో ఇంట్రస్టుగా ఉంది. అంతేగాక సీనియర్ నటుడు కృష్ణ ఒక కీలక పాత్రలో నటిస్తూండటం మరో విశేషం. ఈ సినిమాకు కె.ఎం రాధాకృష్ణన్ సంగీతం సమకూరుస్తుండగా, మణిశర్మ రీ రికార్డింగ్ అందించనున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.

"ది మమ్మీ:టోంబ్ ఆఫ్ ది డ్రాగన్ ఎంపరర్" టీసర్

video

"సెక్స్ అండ్ ది సిటి" ట్రైలర్

video

Friday, May 23, 2008

అద్భుత యానిమేషన్ చిత్రం "కుంగ్ ఫు పాండా" (ట్రైలర్)

video

Thursday, May 22, 2008

ఇంత మౌనమేల చిరంజీవా?!

బోధిసత్వుడిలా మౌన ముద్ర దాల్చిన చిరంజీవి మౌనం ఇప్పట్లో వీడేనా? చిరంజీవి ఆత్మీయులైన అల్లు అరవింద్ సహా మరెవరికైనా చిరంజీవి మౌనం వెనకున్న రహస్యం తెలుసా? చిరంజీవికి రాజకీయ పార్టీ పెట్టే ఉద్దేశ్యం అసలుందా? సరే రాజకీయ పార్టీ పెట్టే ఉద్దేశ్యం చిరంజీవికి లేదనుకుందాం, మరి అతని కొత్త చిత్రం ప్రారంభించడానికి ఇంత కాలం వేచి ఉండటం ఎందుకు, తెలుగు గడ్డేమైనా రచయితలకు, దర్శకులకు గొడ్డు బోయిందా? రాష్ట్రం మొత్తం చిరంజీవో రామచంద్రా అంటుంటే చిరంజీవి మాత్రం మౌనముద్ర దాల్చడం వెనుక ఉద్దేశ్యం ప్రజలలో, పాలకులలో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెంచి ఒక్క సారిగా రాష్ట్ర రాజకీయాలలోకి చొచ్చుకురావాలనే తలంపా? లేక చిరంజీవి నమ్ముకున్న "ఆ నలుగురిదీ" రాజకీయ ప్రణాళిక చేయలేని అసమర్దతా? .....ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు చిరంజీవి అభిమానులను, ప్రత్యర్ధులను తొలిచి వేస్తున్నాయి. ఎంత తరచి తరచి చూసినా ఈ ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదని అభిగ్న వర్గాల ఉవాచ. మరోవైపు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెంచడం వల్ల ఒక్కోసారి మంచికన్నా చెడే ఎక్కువ జరుగవచ్చనే భయాందోళనలూ అభిమానుల్లో చోటుచేసుకున్నాయి. "అంజి", "మృగరాజు", "యుద్ద భూమి" లాంటి చిత్రాలలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఏర్పడ్డ తర్వాత ఒక్కోసారి తుస్సుమనే అవకాశమూ లేకపోలేదనీ అభిమానులు భయపడుతున్నట్లు సమాచారం. వీటన్నింటికీ మించి ఈ మధ్యన చిరంజీవి బర్త్ డేరోజు పార్టీని ప్రకటిస్తారని ఒకవైపు, కాదు కొత్త సినిమా ప్రారంభిస్తారని మరోవైపూ ప్రచారం ఊపందుకుంది. మరి చివరికి ఎవరి మాట నెగ్గుతుంది. పోనీ కొత్త రాజకీయ ప్రధానమైన చిత్రం నిర్మించి ఆవెంటనే పార్టీని ప్రకటిస్తారనుకుంటే రాబోయే ఎలక్షన్లకు ఉన్న గడువు అతి కొద్ది కాలం మాత్రమే. ఆలోగా పురిటి బిడ్డలాంటి రాజకీయపార్టీతో పెద్ద పార్టీలను ఎదుర్కోగలడా? మరోవైపు చిరంజీవి బలం "యువత" అని ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు, మరి ఇతర వర్గాలను ఎలా ఆకట్టుకుంటారు. గతంలో ఎన్ టి రామారావు లా ప్రభంజనంలా రావాలని ఒకవేళ చిరంజీవి భావిస్తూండవచ్చు, కాని అప్పటి రాజకీయ పరిస్థితులు వేరు, ఇప్పటి రాజకీయ పరిస్థితులు వేరు. అప్పుడంటే రామారావు గారి ప్రజాబలం తెలియక కాంగ్రెస్ పార్టీ ఆయనను బహిరంగంగా రెచ్చగొట్టి అడ్రస్ లేకుండా పోయింది, గత అనుభవంతో ప్రస్తుతం కాంగ్రెస్ ఎక్కువశాతం చిరంజీవి విషయంలో మౌనంగా ఉండటానికే అధిక ప్రాధాన్యతను ఇస్తోంది. మరి ఇలాంటి సమయంలో చిరంజీవి నిర్ణయం కమల్ హాసన్ "దశావతారం" చిత్రంలా వాయిదా పడుతూ వస్తూండటం (గతంలో చిరంజీవి నటించిన "అంజి" చిత్రం కూడా వాయిదాలపై, వాయిదాలు వేస్తూ వచ్చి చివరికి బాక్స్ ఆఫీసు దగ్గర బోల్తా పడిందన్న విశయం చాలా మందికి గుర్తుండే ఉంటుంది) అంత మంచిదేనా? మరి చిరంజీవి తన మౌనాన్ని ఇప్పటికైనా వీడేనా లేక మాజీ ప్రధాని పి వి నరసిం హా రావు గారిలా మౌనాన్ని మరికొన్నాళ్ళు ఆశ్రయిస్తారా...!? చూద్దాం ఏం జరుగుతుందో.

రాబోయే బాలీవుడ్ చిత్రం "లవ్ స్టోరి - 2050" ట్రైలర్

video

Tuesday, May 20, 2008

హాలీవుడ్ పాప్ గాయని మరియా కేరీ "త్రూ ది రైన్" వీడియో

video

ఉదయ కిరణ్ "గుండె ఝల్లుమంది" గ్యాలరి








విజయ్ హీరోగా "కంత్రి" తమిళంలోకి

యంగ్ ఎన్టిఆర్, హన్సిక మోత్వానీ జంటగా మెహర్ రమేష్ దర్శకత్వంలో అశ్వినిదత్ నిర్మించిన "కంత్రి" సినిమాని తమిళంలోకి పునర్నిర్మిస్తున్నారని తాజా సమాచారం. ఈ సినిమా చూసిందగ్గర్నుంచి తను హీరోగా తమిళంలోకి రీమేక్ చేయాలని తమిళ క్రేజీ హీరో విజయ్ ముచ్చట పడుతున్నాడని తమిళనాట వార్త గుప్పుమంటోంది. రెగ్యులర్ గా విజయ్ దాదాపు ప్రతి క్రేజి తెలుగు సినిమా రిలీజుకి తప్పని సరిగా హైదరాబాద్ వచ్చి మార్నింగ్ షో చూసి సినిమా నచ్చితే తన నిర్మాతలని తమిళ రైట్స్ కోసం పంపుతూండటం విజయ్ కు ఆనవాయితీ. ఆ వరసలోనే మహేష్ బాబు "ఒక్కడు" సినిమాని "గిల్లి" పేరుతో రీమేక్ చేసి సంచలన విజయం సాధించారు. అలాగే "పోకిరి" సినిమాను "పోకిరి" పేరుతోనే తమిళ వెర్షన్ చేసి ఘన విజయాన్ని అందుకున్నాడు. సాధారణంగా విజయ్ కు తెలుగు సినిమాలపై ఆసక్తి ఎక్కువ.తమిళంలో అందరి హీరోల కన్నా ఎక్కువ తెలుగు రీమేక్ లు చేసిన ఘనత ఆయనకే దక్కింది. అందులోనూ "బొమ్మరిల్లు", "ఆడువారి మాటలకు అర్ధాలు వేరులే" చిత్రాలు తమిళంలోకి జయం రవి, ధనుష్ లతో రీమేకై హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో నడుస్తున్నాయి. దాంతో విజయ్ ప్రస్తుతం నటిస్తున్న "సింగం" చిత్రం తర్వాత తప్పకుండా మరో తెలుగు చిత్రం రీమేక్ లో నటించాలని విజయ్ ఆసక్తి కనబరుస్తున్న టైంలో "కంత్రి" సినిమా చూడటం, అది నచ్చడంతో వెంటనే ఈ చిత్ర రీమక్ చేయడం కోసం చిత్ర హక్కులను తీసుకోవడం జరిగిందని సమాచారం.

Monday, May 19, 2008

ఐశ్వర్య రాయ్ ఎక్స్ క్లూజివ్ క్లోజప్స్









22న రానున్న "బుజ్జిగాడు"

ప్రభాస్ హీరోగా దర్శకుడు పూరీ జగన్నాథ్ రూపొందించిన "బుజ్జిగాడు-మేడిన్ చెన్నై" 22న విడుదల కానుంది. త్రిష, సంజన హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కెఎస్ రామారావు నిర్మించారు. ప్రభాస్ సినిమాలన్నింటికంటే భారీ స్థాయిలో అత్యధిక ప్రింట్లతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయడానికి కె యెస్ రామారావు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో త్రిష అన్నగా, శివన్న అనే డాన్ పాత్రను మోహన్‌బాబు పోషించారు. ఆయన "డియర్" అనే డైలాగుతో కూడిన మేనరిజమ్ తో కనపడతారని సమాచారం. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు సందీప్ చౌతా అందించిన ప్రోమోలు ,పాటలు ఇప్పటికే ప్రేక్షకులలో ఆదరన చూరగొన్నాయి. ఇందులో రజనీకాంత్ వీరాభిమానిగా బుజ్జి అనే పాత్రలో ప్రభాస్ కనిపించనున్నాడు.ఇంతకు ముందు జగన్ డైరెక్ట్ చేసిన "పోకిరి", "దేశముదురు" వంటి సూపర్‌హిట్ సినిమాల రేంజిలో ఈ సినిమా కూడా వర్కవుట్ అవుతుందని ప్రభాస్ అభిమానులు ఆశిస్తున్నారు.

Saturday, May 17, 2008

హాలీవుడ్ గాయక - నటి మరియా కేరీ "నెవర్ టూ ఫార్ అవే" వీడియో సాంగ్

video

మహేష్ బాబుకు 8 కోట్లు, త్రివిక్రం కు 4.5 కోట్లు...?

యంగ్ హీరో మహేష్ బాబు ఒక సినిమాకు తీసుకునే రెమ్యునరేషన్ 8కోట్లు తీసుకుంటున్నట్లు టాలీవుడ్ లో వదంతులు వ్యాపించాయి. "వరుడు" సినిమాకు మహేష్ బాబు 8 కోట్ల రూపాయలను, ఆ చిత్ర దర్శకుడు త్రివిక్రం శ్రీనివాస్ 4.5 కోట్ల రూపాయలను రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నట్లు సమాచారం. త్రివిక్రమ్ దర్శకత్వంలో శింగమల రమేష్ నిర్మిస్తున్నక్రేజి చిత్రం "వరుడు" సినిమా కు గాను చిత్ర నిర్మాత రెమ్యునేషన్ నిమిత్తం మహేష్ బాబుకి 8 కోట్లు , త్రివిక్రమ్ కి 4.5 కోట్లు ఇచ్చారని అలాగే 30 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమా తెరకెక్కించబోతున్నరనేది ఆ వార్తల సారాంశం. ఇది విన్న కొందరు హీరోలు, దర్శకులు తమ రెమ్యునేషన్స్ పెంచాలని పి.ఆర్ లతో చర్చిస్తున్నారుట . మరో ప్రక్క ఈ వార్త నిర్మాతల గుండెల్లో రైళ్ళు పరుగెత్తిస్తోందిట. కొందరైతే ఇది నేషనల్, ఓవర్ సీస్ మార్కెట్ ఉన్న బాలీవుడా అని బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారుట. కాని ఇప్పుడున్న పరిస్ధితుల్లో డబ్బు గురించి ఆలోచిస్తే పెద్ద హీరోల డేట్స్ దొరకవు అలా స్పీడుగా ఉన్నాడు కాబట్టే శింగమల రమేష్ పవన్ తో "పులి", మహేష్ తో "వరుడు" యేక కాలంలో ప్రారంభించాడని మరికొందరు ఫిల్మ్ ఛాంబర్ పెద్దలు సమర్ధస్తున్నారట. యేది ఎలా ఉన్నా ఈ సినిమా పై మంచి హోప్స్ ఉన్నాయి. ఇక ఈ సినిమా మొత్తం ఫన్ కలిసిన రొమంటిక్ ఎడ్వంచర్స్ తో సాగుతుందిట. ఎలాగో త్రివిక్రమ్ తరహా పంచ్ లు ఉండనే ఉంటాయి. మహేష్ స్టైలిష్ యాక్షన్ తప్పనిసరి. అలాగే వీరి కాంబినేషన్లో గతంలో వచ్చి హిట్టైన "అతడు" సినిమాకి పూర్తి భిన్నంగా ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారుట. చూద్దాం ఏం జరుగుతుందో.

మోస్ట్ ఎక్స్పెక్టెడ్ హాలీవుడ్ ఫ్యాంటసీ ఫిలిం "ట్విలైట్" ట్రైలర్

video

ఫ్యూచరిస్టిక్ మెగా థియేటర్ (చైనా) -ఎక్స్ క్లూజివ్ గ్యాలరీ


మీరు చూస్తోంది ఆసియా ఖండంలోనే అత్యున్నతమైన టెక్నికల్లీ అడ్వాన్స్డ్ సినెమా థియేటర్.హాంగ్ కాంగ్ ఐస్లాండ్స్ లో ఉన్న క్వీన్ మేరీ జిల్లలో ఉన్న ఈ థియేటర్ పేరు "ఎ ఎం సి పసిఫిక్ ప్యాలెస్ సినెమా".





Friday, May 16, 2008

అమితాబ్ బచ్చన్ "సర్కార్ రాజ్" కథ

శివసేన అధినేత బాల్‌థాకరే జీవితానికి చాలా దగ్గరగా వున్న కథతో రాంగోపాల్‌ వర్మ చేసిన ప్రయోగం సర్కార్‌. బాలీవుడ్‌తో పాటు దేశ విదేశాల్లో ఈ సినిమా పెద్ద సంచలనం సృష్టించి కాసుల వర్షం కురిపించింది. దాంతో ఈ సక్సెస్‌ని వర్మ కంటిన్యూ చేయాలనుకున్నాడు. సర్కార్‌కు సీక్వెల్ గా సర్కార్‌ రాజ్‌ను తెరకెక్కిస్తున్నాడు. అంతేగాక అమితాబ్ ఫ్యామిలికి చెందిన ముగ్గురు నటులని ఒకే సారి చూపుతూ వారి చుట్టూ కథ అల్లాడు. దాంతో ఈ చిత్రం ప్రారంభం రోజు నుండే సంచలనం సృష్టించటం ప్రారంభించింది. అందులోనూ వివాహం తరువాత తొలిసారిగా ఐష్‌, అభిషేక్‌ బచ్చన్‌ జంటగా నటిస్తుండటంతో ఆ కెమిస్ట్రీ వేరంటూ అందరూ ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు బ్యాంకాక్‌లో నిర్వహించే ఐఐఎఫ్‌ఐ చిత్రోత్సవంలో ఫిల్మ్‌ ప్రీమియర్‌ షో నిర్వహించాలని అనుకుంటున్నాడు వర్మ. ఇక సర్కార్ రాజ్ కథ విషయానికొస్తే... ఐశ్వర్యారాయ్ ఓ అంతర్జాతీయ కంపెనీకి సీఈఓ. ఆమె మహారాష్ట్రలోని ఓ మారుమూల గ్రామంలో విద్యుత్‌ ప్లాంట్‌ నెలకొల్పాలనుకుంటుంది. అయితే అక్కడ ప్రాంతాలకు పెద్ద అయిన అమితాబ్‌ బచ్చన్‌ గట్టిగా వ్యతిరేకిస్తాడు. చివరగా ప్రాజెక్ట్‌ ఉపయోగాలు దాని వల్ల తమ గ్రామాలు బాగుపడే తీరు తెలుసుకుంటాడు. ఐష్ కి మద్దతు తెలుపుతాడు. సమస్య తీరిపోయిందనుకుని పనులు ప్రారంభించే సమయంలో అక్కడ రాజకీయాలు ప్రారంభమవుతాయి. దీంతో కథ అనుకోని మలుపు తిరిగి రసవత్తరంగా ముందుకు సాగుతుంది. చివరికి పవర్‌ ప్రాజెక్ట్‌ పరిస్థితి ఏమైంది అనేది ఉత్కంఠతో తీర్చిదిద్దారట వర్మ. దాంతో సర్కార్‌ తరహాలోనే ఈ చిత్రం కాసుల వర్షాన్ని కుర్పిస్తుందని భావిస్తూ జూన్‌ ఆరున చిత్రం రిలీజ్‌ చేయాలని భావిస్తున్నాడు.
(కర్టేసి: దట్స్ తెలుగు)

హాలీవుడ్ ఫిలిం "ఎల్లా" ట్రైలర్

video

Thursday, May 15, 2008

హాలీవుడ్ ఫిలిం "ది అన్నోన్ ఉమెన్" అఫిసియల్ ట్రైలర్

video

క్రియాశీల రాజకీయాల్లోకి రానున్న సినీనటుడు బాలకృష్ణ

సినీనటుడు బాలకృష్ణ వచ్చే నెలాఖరులో క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన జూన్ 10 న లాస్ ఏంజిలిస్ లో జన్మదినం జరుపుకుని, అక్కడి ప్రవాసాంధ్రులతో సమావేశమై తిరిగి వస్తారు. జూన్ 28న విజయవాడ వేదికగా బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ క్రియాశీలక రాజకీయాల్లో ప్రవేశించనున్నారు. ఆరోజుకు చంద్రబాబు నాయుడు "మీకోసం" యాత్ర విజయవాడకు చేరుకునేలా ప్రణాళిక సిద్ధమైంది. నిన్న బాలయ్య తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించారు. అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామిని, పుల్లేటి కుర్రులో రామలింగేశ్వర స్వామిని ఆయన దర్శించుకున్నారు. తన అభిమానులతో, తెలుగుదేశం పార్టీ నాయకులతో, వివిధ సామాజిక వర్గాల నాయకులతో ఆయన సమావేశమై రాజకీయాలపై చర్చించినట్టు తెలుస్తోంది.

"పులి"లో "పోలీసు"గా పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త. అతి త్వరలో పవన్ ప్పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ప్రస్తుతం నటిస్తున్న "పులి" చిత్రంలోనే పవన్ పోసీసు అధికారిగా నటిస్తున్నట్లు ఫిలిం నగర్ సమాచారం. "జల్సా" చిత్రం మంచి విజయాన్ని సాధించినప్పటికీ ఆ చిత్రంలో నక్సలైట్ పాత్ర పవన్ అభిమానులను పెద్దగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. ఆ చిత్రం నుంచి కొన్ని పాఠాలు నేర్చుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ తన తర్వాతి చిత్రం "పులి"లో ద్విపాత్రాభినయంతో పాటు ఓ పోలీసు అధికారిగా పవర్‌ఫుల్ పాత్రను పోషిస్తున్నాడనే వార్త ఫిలిం నగర్ లో వినిపిస్తోంది.ప్రేక్షకులు, తన అభిమానులు ఇష్టపడే రీతిలో ఆ పాత్రను రూపొందించడం కోసం పవన్‌కళ్యాణ్ ఎక్కువగా కష్టపడుతున్నాడని తెలిసింది. అంతేకాదు ఆ పంథాలోనే ఆ పాత్రకు కావలసిన అలవాట్లు, కదలికలపై పూర్తి స్థాయిలో స్టడీ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇందులో భాగంగా జిమ్‌కు కూడా వెళ్లనున్నట్లు తెలిసింది. అభిమానుల అంచనాలకు తగ్గట్లుగా తన పాత్ర ప్రభావం చూపాలనే ధృడసంకల్పంతో పవన్ ఉన్నట్లు సినిమా వర్గాలు తెలిపాయి.

Wednesday, May 14, 2008

హాలీవుడ్ హర్రర్ ఫిలిం "ఫ్రంటైర్" Trailer

video

ఛార్మి "16 రోజులు"

"అనుకోకండా ఒక రోజు","మంత్ర " చిత్రాల తర్వాత ఛార్మి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం "16 డేస్". వెరైటీ టైటిల్ సినిమా ప్రమోషన్ కి బాగా ఉపయోగపడటమే కాక కలెక్షన్స్ కీ కలసి వస్తుండటంతో ఇటీవల ఇలాంటి టైటిల్స్ కొద్దిగా పెరిగాయని చెప్పొచ్చు. ఇప్పుడు అదే ప్రాసెస్ లో ఛార్మి కొత్త సినిమాకి "16 డేస్ "అని పేరు పెట్టారు. కాస్మోస్ ఎంటర్ టైన్ మెంట్ పతాకం పై ప్రభు సాల్మన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈచిత్రాన్ని తెలుగు,తమళ భాషలలో రూపొందిస్తున్నారు. ఈ టైటిల్ కు ట్రేడ్ లోనూ మంచి రెస్పాన్స్ వస్టోందని దర్శక, నిర్మాతలు పేర్కొంటూడటం ఇక్కడ గమనార్హం .

Tuesday, May 13, 2008

"ఇండియానా జోన్స్ అండ్ ది కింగ్ డం ఆప్ ది క్రిస్టల్ స్కల్" Trailer-2

video

Monday, May 12, 2008

పద్మ విభూషణ్ గానకోకిల

గానకోకిలకు పద్మ విభూషన్ దక్కింది. పి.సుశీల (పానులేటి సుశీల) . 5యాభై సంవత్సరాల సినీ జీవితములో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో 25 వేలకు పైగా గీతాలు పాడిన ప్రముఖ గాయకురాలు పానులేటి సుశీల(పి.సుశీల)కు భారత ప్రభుత్వం కొత్తగా పద్మ విభూషన్ అవర్డును ఇచ్చి గౌరవించింది. ఉత్తమ గాయనిగా ఐదు సార్లు (1969 - ఉయిర్ మనిదన్, 1972 - సావలే సమాలి, 1978 - సిరిసిరి మువ్వ, 1983 -మేఘ సందేశం మరియు 1984- ఎం.ఎల్.ఏ.ఏడుకొండలు)జాతీయ అవార్డును అందుకున్న గానకోకిలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే రఘుపతి వెంకయ్య పురస్కారం 2001 లో లభించింది.1935లో విజయనగరంలో సంగీతాభిమానుల కుటుంబంలో జన్మించిన సుశీల గారి తండ్రి పి.ముకుందరావు ప్రముఖ క్రిమినల్ లాయరు. తల్లి శేషావతారం. 1950లో సంగీత దర్శకుడు నాగేశ్వరరావు ఆలిండియా రేడియోలో నిర్వహించిన పోటీలో సుశీలను ఎన్నుకున్నారు. ఆమె ఏ.ఎమ్.రాజాతో కలిసి పెట్ర తాయ్ (తెలుగులో "కన్నతల్లి") అనే సినిమాలో "ఎదుకు అలత్తాయ్" అనే పాటను తను మొదటిసారిగా పాడింది. అలా మొదలైన పి.సుశీల గానవాహిని అలా కొనసాగుతూనే ఉంది.

ప్రభాస్ "బుజ్జిగాడు" కొత్త Trailer

video

Saturday, May 10, 2008

డాక్టర్. రాజశేఖర్ "గోరింటాకు" Trailer

video

హాలీవుడ్ హాట్ మరియా కేరీ "టచ్ మై బాడీ" పాప్ సాంగ్

video

Friday, May 9, 2008

ప్రైవేటు సైన్యం ఏర్పాటు చేసుకుంటున్న చిరంజీవి?

చిరంజీవి ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. చిరంజీవి రాజకీయ ప్రవేశం దాదాపు ఖరారైన నేపధ్యంలో చిరంజీవి ఇలా ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవడం తెలుగునాట చర్చనీయాంశంగా మారింది. చిరంజీవి రాజకీయ పార్టీ పెట్టబోతున్నారన్న విషయం ఖరారు కాబట్టే ఆయన తన రక్షణ కోసం, పార్టీ రక్షణ కోసం ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారని టాలీవుడ్ ప్రముఖులు, కొందరు రాజకీయ ప్రముఖులూ తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం చిరంజీవి రక్షణ కోసం 200 మంది ప్రైవేటు సైన్యం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. మొదటి నుంచి చిరంజీవి రాజకీయాల్లోకి రావాలని కోరుతున్న కాంగ్రెస్ ఎంపీ హరిరామ జోగయ్య నిన్న కూడా ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి అవినీతి మీద, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమాల మీద ధ్వజమెత్తారు. సీనియర్ నాయకుడైన జోగయ్య చిరంజీవి వంటి నిష్కళంకుడు రాజకీయాల్లోకి రావాలని బహిరంగంగా ఆహ్వానిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉండి ఆయన ఇలా వ్యవహరించడం నిజంగా సాహసమే. ఈసారి కాంగ్రెస్ టికెట్ ఆశించకపోవడం ఆయన ధైర్యానికి ఒక కారణం కావచ్చు.
చిరంజీవి ప్రైవేటు సైన్యాన్ని ఎందుకు పెట్టుకుంటున్నట్టు? ఆయనకు ప్రభుత్వం కల్పించే రక్షణ మీద నమ్మకం లేదా? చిరంజీవి రాజకీయాల్లోకి రాకుండా రాజశేఖరరెడ్డి వర్గీయులు అన్ని విధాల ప్రయత్నిస్తున్నారని వార్తలు వస్తున్న నేపధ్యంలో ప్రభుత్వం కల్పించే పోలీసు రక్షణ మీద చిరు శ్రేయోభిలాషులకు నమ్మకం లేకుండా పోయిందని చెబుతున్నారు. అందువల్లనే మెరికల్లాంటి పాతికేళ్ళ లోపు యువకులకు శిక్షణ ఇచ్చి ఎంత ఖర్చయినా రక్షణగా పెట్టుకోవాలని చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్, బావమరిది అల్లు అరవింద్ భావిస్తున్నారు. చిరంజీవి ఆగస్టులో తన పార్టీ ఆవిర్భావ ప్రకటన చేయనున్నట్టు తాజా సమాచారం. ఆయన పార్టీ పేరు మీద, చిహ్నం మీద ఇంకా నిర్ణయం తీసుకోలేదు. చిరంజీవి తన సినిమాల విషయంలో కూడా ఇదే విధమైన గోప్యతను పాటిస్తుంటారు. ప్రైవేటు ఆర్మీ ఇప్పటికే ఆయన చుట్టూ ఉంది. అయితే ప్రజల మధ్య తిరిగేటప్పుడు ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా నివారించడానికి మరో 200 మంది ప్రైవేటు సైన్యానికి హైదరాబాద్ నగర శివారులో కఠోర శిక్షణ ఇస్తున్నారు. ఇన్ని జాగ్రత్తలతో ప్రజల ముందుకు రానున్న చిరంజీవి విజయం సాధించాలని ఆశిద్దాం.

"ది క్రానికల్స్ ఆప్ నార్నియ: ప్రిన్స్ క్యాస్పియన్" Trailer

video

ఇండియన్ హాలీవుడ్ డైరెక్టర్ నైట్ శ్యామలన్ "ది హ్యప్పేనింగ్" Trailer

video

Thursday, May 8, 2008

యంగ్ ఎన్ టి ఆర్ "కంత్రి" స్క్రీన్ సేవర్స్






హాలీవుడ్ లేటెస్ట్ ఫిలిం "స్పీడ్ రేసర్" Trailer

video

నక్కను తొక్కిన గడ్డం చక్రవర్తి (జె డి చక్రవర్తి)

నిజంగానే జె డి చక్రవర్తి నక్కను తొక్కినట్లుంది. రజినీకాంత్ ప్రతిష్టాత్మక చిత్రం "రోబోట్" లో జె డి కి అవకాశం రావడంతో టాలీవుడ్ లో అందరూ ఇదే విశయం మాట్లాడుకుంటున్నారు. గడ్డం చక్రవర్తి పిలవబడే జెడికి ఎక్కడ లేని అదృష్టం పట్టిందని అంతా అనుకుంటున్నారు. తాను హీరోగా నటిస్తున్న "రోబోట్" సినిమాలో విలన్ పాత్రకి జె.డి. చక్రవర్తిని రజనీకాంత్ సిఫార్సు చేశాడు. చాలా కాలంగా అవకాశాలు లేక బాధపడుతున్న జెడికి మంచి రోజులు వచ్చినట్లే భావించాలి. "శివ" సినిమాతో సినీరంగంలో ప్రవేశించి జెడి "సత్య" సినిమాతో బాలీవుడ్ లోనూ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. అయితే నటనకన్నా, దర్శకత్వం పట్ల అతను ఎక్కువగా దృష్టి పెట్టడంతో క్రమంగా కనుమరుగవుతూ వచ్చాడు. ఇన్నాళ్ళకు శంకర్ దర్శకత్వం వహిస్తున్న "రోబోట్"లో మెయిన్ విలన్ పాత్ర జెడికి దక్కడంతో జె డి తెగ సంతోశపడుతున్నట్లు సమాచారం. "శివాజీ" సినిమాలో విలన్ గా నటించిన సుమన్ తనదైన మానరిజమ్స్ తో ఆకట్టుకున్నాడు. అప్పటి నుంచి అతను బిజీ అయ్యాడు. అందువల్ల "రోబోట్" తర్వాత తన జాతకం మారిపోతుందని జెడి ఆశపడుతున్నాడని అంటున్నారు. తాజాగా జగపతిబాబు హీరోగా జెడి "హోమం" సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇందులో విలన్ పాత్రను కూడా పోషిస్తున్నాడు. తాజాగా "సర్వమ్" అనే తమిళ సినిమాలో ప్రధాన పాత్ర పోషించడానికి అంగీకరించాడు. ఇక జెడి బిజీ అయిపోయినట్లే భావించొచ్చా.

Wednesday, May 7, 2008

"కంత్రి" సినిమాలో టీడీపీకి ప్రచారం

యంగ్ ఎన్ టీ ఆర్ తన లేటెస్ట్ చిత్రం "కంత్రి" ద్వారా తెలుగు దేశం పార్టీకి ప్రచారం చేస్తున్నారనే వదంతి టాలీవుడ్ లో గుప్పుమంటోంది. వేసవిలో విడుదలవనున్న హాట్ ఫెవరేట్ చిత్రం "కంత్రి" మీదే అందరి దృస్టీ కేంద్రీకృతం అవడంతో ఈ రూమర్ కు అధిక ప్రాధాన్యత సంతరించుకుంది. టాలీవుడ్ లో ఎక్కడ విన్నా ఆ విశేషాలే వినిపిస్తున్నాయి. చిత్రంలో టి.డి.పి ని సపోర్టు చేస్తూ నేటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కొన్ని పొలిటికల్ డైలాగులు, సన్నివేశాలు సినిమాలో ఉన్నాయనే వార్త అభిమానులను మరీ ఊరిస్తోంది. అసలు సినిమా ప్రారంభం లోనే ఎన్టీఆర్ సైకిల్ తో కనపడి కొన్ని పార్టీకి ఊపు నిచ్చే డైలాగులు కొడతాడని రూమర్లు వినిపిస్తున్నాయి. అలాగే తన తాతగారైన ఎన్టీఆర్ గురించి ఆరాధన భావంతో మాట్లాడుతూ సైకిలుకి పూర్తి స్ధాయిలో తన అండదండలు ఉంటాయని చెపుతాడుట.ఇవి నిజమైతే "కంత్రి" ద్వారా తన వంతు సాయం తమ పార్టీకి చేస్తున్నాడన్నమాట. అయితే దీన్ని యంగ్ ఎన్టీఆర్ ఖండిస్తున్నాడు. "ప్రత్యేకంగా ఓ పార్టీ గురించో, మరొకరి గురించో ప్రస్తావించే రాజకీయ సంభాషణలు కంత్రీ లో లేవు. కథానుగుణంగా సామాజిక శ్రేయస్సు దృష్ట్యా కొన్ని మాటలున్నా వాటికి రాజకీయాలతో ముడిపెట్టలేం" అని అతను చెపుతున్నట్లు సమాచారం. నిజం ఈ తొమ్మిదవ తేదీకే తెలుస్తుంది. కాదంటారా...?

Tuesday, May 6, 2008

విక్రం "మల్లన్న" ట్రైలర్

video

"గజిని" షూటింగ్ లో అమీర్ ఖాన్ కు బలమైన గాయాలు

బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ "గజిని" హిందీ సినిమా షూటింగులో ఉండగా మల్లీ గాయపడ్డాడు. అతని ఎడమ కాలికి బలమైన గాయమైనట్లు సమాచారం. "గజిని" హిందీ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతోంది. విలన్ ను చేజ్ చేసే సీనులో నటిస్తుండగా అమీర్ ఖాన్ పడిపోవడంతో ఆయనకు బలమైన గాయం తగిలింది. దీంతో అతన్ని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన ఆయన భార్య కిరణ్ హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నారు. గతంలో కూడా అమీర్ ఖాన్ ప్రమాదవశాత్తు "గజిని" షూటింగులో గాయపడ్డాడు. అప్పుడు వెంటనే అతను ముంబయి వెళ్లిపోయాడు. కొద్ది కాలం విశ్రాంతి తీసుకుని తిరిగి హైదరాబాదు వచ్చాడు. తిరిగి "గజిని" షూటింగ్ ప్రారంభమైంది. అయితే మరోసారి అదే పద్ధతిలో ప్రమాదం జరగడంతో అమీర్ ఖాన్ గాయపడ్డాడు. ఈసారి తగిలిన గాయం మునుపటి కన్నా ఎక్కువగా ఉందని, కనీసం మూడు వారాలు విశ్రాంతి అవసరమని డాక్టర్లు తెలిపినట్లు సమాచారం.

Monday, May 5, 2008

హాలీవుడ్ ఫిలిం "మేడ్ ఆప్ హానర్" వాల్ పేపర్స్




యంగ్ ఎన్ టి ఆర్ "కంత్రి" ట్రైలర్

video

చిరంజీవి పార్టీ పేరు"తెలుగు వెలుగు"

మెగాస్టార్ చిరంజీవి తన పార్టీ పేరును ఖాయం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. "తెలుగు వెలుగు" అని పార్టీకి నామకరణం చేయాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన లోగోను కూడా ఆయన సిద్ధం చేసుకుంటున్నారు. నిజానికి చిరంజీవి తాను పెట్టే పార్టీ గురించి మే 9వ తేదీననే అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. అది ఆయనకు కలిసి వచ్చే తేదీ. అయితే ఉప ఎన్నికల దృష్ట్యా మరో నెల రోజుల పాటు దాన్ని వాయిదా వేసినట్లు పెద్దగానే ప్రచారమవుతోంది. చిరు పార్టీకి చెందిన బ్యానర్లు, వినైల్ హోల్డింగ్స్, పోస్టర్లు తమిళనాడు లోని కోయంబత్తూరులో అచ్చవుతున్నట్లు తెలుస్తోంది.తెలుగుపై మక్కువతో తెలుగు అనే పద్మ్ తప్పకుండా తమ పార్టీ పేరులో ఉండాలని నిర్ణయించుకున్న చిరంజీవి తమ పార్టీకి "తెలుగు వెలుగు" గా నామకరణం చేయడం పట్ల ఆసక్తి చూపారు. గతంలో తెలుగుపై ఉన్న మక్కువతోనే ఎన్టీఆర్ తన పార్టీకి "తెలుగుదేశం" అనే పేరుపెట్టి తెలుగు ప్రజలకు మరింత దగ్గరయ్యారని, అలాగే ఈ పేరులో ఎక్కడా ప్రత్యేక రాష్ట్రం చాయలు కనిపించవని, దాంతో తమ పార్టీకి "తెలుగు వెలుగు" ఖరారు చేసినట్లు సమాచారం. లోగోను దాదాపు సిద్ధం చేసినప్పటికీ, పార్టీ జెండాలో, అధికారిక చిహ్నంలో తను కాలుతూ వెలుగులను పంచే కాగడా, లాంతరు, కొవ్వొత్తి వంటి గుర్తులను తప్పకుండా వినియోగిస్తే బావుంటుందనే సూచనను ఆయన చేసినట్లు తెలిసింది. ఏదేమైనా చిరంజీవి పార్టీ అతి త్వరలోనే ఆవిష్కరింపబడుతుందనే సమాచారం అందుతోంది.

Saturday, May 3, 2008

"షీలా"ది ఐరన్ లెగ్గా?

అల్లు అర్జున్ , షీలా జంటగా భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన 'పరుగు' సినిమా అందరి అంచనాలు తలక్రిందులు చేస్తూ తుస్సుమంది. దాంతో ఆ ఫెయిల్యూర్ క్రెడిట్ మొత్తం హీరోయిన్ పాత్రధారి షీలా పైకి నెట్టేస్తున్నారు. ఆమె మొదటి నుంచి ఐరన్ లెగ్ అని అందుకే ఇలా జరిగింది అంటున్నారు. కాని మరో వర్గం మాత్రం ఫెయిల్యూర్ భాద్యత మొత్తం రెండో గండం దాటలేని భాస్కర్ దే అంటున్నారు. 'సీతాకోకచిలుక' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ తమిళ ముద్దు గుమ్మ షీలా. ఆ సినిమా తరవాత ఆమె దిల్ రాజు సమర్పించిన 'హలో ప్రేమిస్తారా' లో పూరీ తమ్ముడు సాయిరామ్ శంకర్ సరసన నటించింది. ఈ రెండు ఫ్లాపు అయ్యాయి. అయినా దర్శకుడు భాస్కర్ ఆమెను యేరికోరి ఎంపిక చేసుకున్నాడు.నిజానికి 'దేశముదురు' తర్వాత విపరీతమైన స్టార్ డమ్ సంపాదించిన అల్లు అర్జున్ ప్రక్కన ఏ త్రిషానో , ఇలియానానో పెట్టుకోవచ్చు. కానీ సినిమాలో ఉండే అమాయకపు పల్లె పడుచు పాత్రకు షీలానే సూటవుతుందని భాస్కర్ భావించాడట. దాంతో మంచి ఆఫర్ వచ్చినందుకు ఆమె కూడా చాలా సంతోషపడింది. కాని సీను రివర్స్ అయింది. దాంతో ఆమె మెదటి నుంచి ఐరన్ లెగ్ అందుకే ఇలా జరిగింది అని ఆమె పైకి పరాజయాన్ని త్రోసే ప్రయత్నం చేస్తున్నారు సెంటిమెంట్లును విపరీతంగా నమ్మే సినిమా వారు.కాని మరో వర్గం మాత్రం తెలుగు దర్శకులకు తప్పని రెండో సినిమా గండం భాస్కర్ దాటలేక పోయాడని కామెంట్లు చేస్తున్నారు. మొదటి సినిమా హిట్టు కిక్కు అతన్ని హేంగోవర్ లో ఉంచిందని అందుకే కథని తనిష్టమొచ్చినట్లు నడిపాడని అంటున్నారు. 'బొమ్మరిల్లు' లో తండ్రి కొడుకుల మద్య చోటు చేసుకునే కమ్యూనికెషన్ గ్యాప్ అనే సున్నితమైన అంశాన్ని చక్కని స్కీన్ ప్లే తో నడిపిన భాస్కర్ ఈ సినిమాలో అదే మిస్సయ్యాడని అంటున్నారు. అయినా ఈ సినిమా హిట్టయినా హోల్ అండ్ సోల్ గా అతనికే పేరొచ్చేలా కథని నడిపాడని, ఆఖరికి అల్లు అర్జన్ లో ఉన్న ఎనర్జీని, మాస్ ఇమేజ్ ని కూడా ప్రక్కన పెట్టాడని వారు వాదిస్తున్నారు. కాబట్టి షీలా కన్నా భాస్కర్ దే ఈ సినిమా పరాజయ భాద్యత అని డిసైడ్ చేస్తున్నారు.

Friday, May 2, 2008

శ్రీనువైట్ల దర్శకత్వంలో నాగార్జున "కింగ్"

తెలుగు సినిమా "మన్మథుడు" నాగార్జున, హిట్ చిత్రాల దర్శకుడు శ్రీనువైట్ల కాంబినేషన్లో కొత్త చిత్రం రూపుదిద్దుకోనుంది. నాగార్జున మితృడు డి. శివప్రసాద్‌రెడ్డి నిర్మాతగా "కామాక్షి కళా మూవీస్" పతాకంపై తెరకెక్కనున్న ఈ చిత్రం ఇటీవలే అన్నపూర్ణ స్టూడియోలో నిరాడంబరంగా ప్రారంభమైంది. దేవుని చిత్రపటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి అక్కినేని నాగేశ్వరరావు క్లాప్ కొట్టగా, అక్కినేని అమల కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఈ కార్యక్రమంలో నాగార్జున కుటుంబసభ్యులతో పాటు కెమెరామెన్ ప్రసాద్ మారెళ్ల, రచయిత గోపీ తదితరులు పాల్గొన్నారు. మే 21 నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకునే ఈ చిత్రంలో త్రిష కథానాయకగా నటించనుండగా ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. "డాన్" తర్వాత హీరో నాగార్జున నటిస్తున్న ఈ చిత్రానికి "కింగ్" అనే పేరును ఖరారు చేశారు.

"బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై" ట్రైలర్

video