Wednesday, March 19, 2008

శివ "భవాని(రఘువరన్)" ఇక లేరు

ప్రముఖ సినీనటుడు రఘువరన్ నేటి ఉదయం గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 59 సంవత్సరాలు. అనేక తెలుగు, తమిళ, మలయాళ, హిందీ చిత్రాల్లో ఆయన నటించారు. ఆయన ప్రధానంగా విలన్ గా, క్యారక్టర్ ఆర్టిస్టుగా నటించారు."మిస్టర్ భరత్" చిత్రం ద్వారా తెలుగు వెండితెరకు వచ్చిన రఘువరన్‌కు 59 ఏళ్లు. "శివ" చిత్రంలో ప్రతినాయుకుడుగా అత్యుత్తమనటన కనబరిచి అశేషాంధ్రప్రేక్షకులకు దగ్గరయ్యారు. రఘువరన్ మృతి పట్ల యావత్ సినీలోకం దిగ్భ్రాంతికి గురైంది. పలువురు సినీ రంగ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలిపారు.1982లో సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన రఘువరన్ అనేక దక్షిణాది చిత్రాల్లో నటించారు.
ఏ పాత్ర వేసినా అందులో నిమగ్నం కావడం , ఆ పాత్ర తప్ప అయన ప్రేక్షకులకు కన్పించకపోవడం ఆయన ప్రత్యేకత.1989 లో "శివ" సినిమాతో ఆయన విలన్ గా ప్రాచుర్యం పొందారు. "భాషా","ముత్తు", "అరుణాచలం", "ఒకే ఒక్కడు" సినిమాల్లో ఆయన నటన అమోఘం. ఇటీవల "శివాజీ", "భీమ", "ఎవడైతే నాకేంటి" సినిమాల్లో నటించారు.

No comments: