Wednesday, March 5, 2008

మహేశ్ బాబు, ఛార్మి ఇళ్ళపై ఇన్ కం ట్యాక్స్ దాడులు


సోమవారం టాలీవుడ్ సినీ ప్రముఖులు మహేశ్ బాబు, ఛార్మి, దిల్ రాజు, వి వి వినాయక్ ఇళ్లతోపాటు వారి బంధువుల ఇళ్లపై ఇన్ కం ట్యాక్స్ అధికారులు దాడులు చేసి బ్యాంక్ లాకర్లను సీజ్ చేశారు. ఇదే సమయంలో చెన్నైలోని వారి ఆస్తులపై కూడా ఏకకాలంలో దాడులు జరిగాయి. మహేష్ బాబు ఇటీవల కాలంలో అత్యధిక పారితోషికం తీసుకోవటంతోపాటు పలు ప్రకటనా సంస్థల్లో అత్యధిక పారితోషికం, మల్టీ నేషనల్ కంపెనీలు మహేష్‌తో చిత్రాలు నిర్మించటం వంటి వార్తలు రావటంతో ఐటీ ఆయనపై దృష్టి సారించినట్లు తెలిసింది. అదేవిధంగా "మంత్ర" చిత్రంతో హిట్ హీరోయిన్‌గా నిలిచిన ఛార్మి ఇంటిపైనా ఇటువంటి దాడులు జరిగాయి. "కృష్ణ" చిత్రంతో సంక్రాంతి డైరెక్టరుగా విజయం సాధించిన వినాయక్ కూడా ఐటీ దాడులకు గురయ్యారు. అగ్ర హీరోల చిత్రాలకు దర్శకత్వం వహించే వినాయక్ అత్యధిక పారితోషికం తీసుకునే దర్శకునిగా పేరుంది. ఇక దిల్ రాజు "బొమ్మరిల్లు" విజయంతో భారీ ఆదాయాన్ని పొందారు. ఈ దాడులు జరిగేటపుడు ఎవరినీ అనుమతించకుండా అధికారులు సోదాలు నిర్వహించారు. ఈరోజు ఉదయం వరకూ ఐటీ దాడులు కొనసాగవచ్చునని టాలీవుడ్ సమాచారం. ఇదిలా ఉండగా, ఇటువంటి దాడులు తమకు సర్వసాధారణమేనని దిల్ రాజు వ్యాఖ్యానించడం కొసమెరుపు.

1 comment:

krishna rao jallipalli said...

ఒక్క సారి కాడు కదా .. వంద సార్లు దాడి చేసినా వారికి ఊడేది ఏమి ఉండదు. ఎందుకు IT వారికి వృధా ప్రయాస??