
నటుడు అమీర్ ఖాన్ దర్శకత్వంలో రూపొందిన ప్రతిష్టాత్మక చిత్రం "తారే జమీన్ పర్" చిత్రం పాకిస్థాన్‌లో విడుదల కానునంది. ఈ చిత్రంతో పాటు, "రేస్" సినిమాను ఈనెల 28వ తేదీన విడుదల చేసేందుకు యూటీవీ సంస్థ సన్నాహాలు పూర్తి చేసింది. "తారే జమీన్ పర్" చిత్రానికి పాకిస్థాన్ సెన్సార్ బోర్డు యూనివర్సల్ సర్టిఫికేట్ (యు)ను జారీ చేసింది. "తారే జమీన్ పర్" చిత్రానికి ఎ

క్కడా సెన్సార్ కత్తెర వేయకుండా పాకిస్తాన్ సెన్సార్ అనుమతిని ఇచ్చింది. అలాగే "రేస్" చిత్రంలో అక్కడకడ్కడా సెన్సార్ కట్ చేసి యూ/ఏ సర్టిఫికేట్‌తో విడుదల చేసేందుకు పాక్ బోర్డు అనుమతి ఇచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా పంపిణీ హక్కులను కలిగిన యూటీవీ సంస్థ పాకిస్థాన్‌లోని ఐదు ముఖ్య నగరాల్లో విడుదల చేయనుంది. ఒక్కో నగరం

లో ఐదు సినిమా థియేటర్లలో ఈ చిత్రాలు విడుదల చేస్తున్నారు. యూటీవీ గతంలో "గోల్" చిత్రాన్ని విడుదల చేసింది.
No comments:
Post a Comment