Saturday, March 15, 2008

చిరంజీవి రాజకీయ పార్టీ: ఎక్స్ క్లూజివ్ డిటైల్స్

(కర్టెసీ: 123 తెలుగు)
1. చిరంజీవి తన రాజకీయ పార్టీని ఏప్రిల్ నెలలో ప్రకటించనున్నట్లు తెలిసింది.
2. పార్టీ కార్యాలయానికి సంబంధించిన డిజైనింగ్ పనులు పూర్తయ్యాయి. మునిసిపల్ ఇతరత్రా పర్మిషన్లకోసం త్వరలో అప్లై చేయనున్నారు.
3. పార్టీ కార్యాలయం కోసం జూబిలీ హిల్స్ లోని రోడ్ నంబర్ 46లో 1800ల చదరపు గజాల ప్లాట్ ను ఎన్నుకోవడం జరిగింది.
4. లండన్ కు చెందిన డా.మిత్ర ఆర్గనైజేషనల్ చార్ట్ తయారు చేశారు. దీనికి చిరంజీవి అనుమతి కూడా లభించింది. ఈ డా.మిత్రా నెల్లూరు జిల్లాకు చెందిన ఒకప్పటి ప్రముఖ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుని పెద్ద కుమారునిగా తెలిసింది.
5. కోస్తా జిల్లాలలో అభిమానులతో సమావేశాలు పూర్తి చేసిన చిరంజీవి సోదరుడు నాగబాబు, ఈ నెల 18వ తేదీనుంచి రాయలసీమ జిల్లాలలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించిన తొలి సమావేశాన్ని కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. ఒక అజ్ణాత ప్రాంతంలో జరిగే ఈ సమావేశానికి తమ అభిమాన సంఘాలవారిని, మద్దతుదారులను సెల్ ఫోన్లు లేకుండా రావాలని నాగబాబు నిభంధన విధించినట్లు సమాచారం.
6. అల్లు అరవింద్, నాగ బాబులు డిల్లీలో తమ లాయర్లతో చర్చించి త్వరలోనే ఎలక్షన్ కమిషన్ కు తమ పార్టీకి సంబంధించిన అప్లికేషన్ ను పెట్టనున్నారు. దీనికి సంబంధించిన కార్యక్రమాలు దాదాపు పూర్తయినట్లు సమాచారం.
7. "ప్రత్యేక తెలంగాణా" అంశానికి కాకుండా, "సమ్యుక్త ఆంధ్రప్రదేశ్" నినాదంతో చిరంజీవి ప్రజలలోకి వెళ్ళనున్నట్లు సమాచారం.అలగే తమ తొలి రాజకీయ సమావేశాన్ని, పార్టీకి సంబంధించిన ప్రకటనను విజయవాడలో జరిపే బహిరంగ సభలో ప్రకటించనున్నట్లు తెలిసింది. అందరూ భావిస్తున్నట్లు చిరంజీవి తొలి రాజకీయ సమావేశాన్ని హైదరాబాదులో నిర్వహించక పోవచ్చు.
8. పార్టీకి సంబంధించిన అభ్యర్తులను ప్రకటించే ప్రక్రియలో భాగంగా ఇప్పటికే పలు అభ్యర్తనలను, బయోడేటాలను చిరంజీవి స్వీకరించి, పరిశీలిస్తున్నట్లు సమాచారం.
9. చిరంజీవి చిన్న తమ్ముడు పవన్ కళ్యాన్ మాత్రం ఎలక్షన్ల అనంతరం రాజకీయ రంగంలో కాకుండా, సినీ రంగంలోనే కొనసాగాలని భావిస్తున్నట్లు తెలిసింది.

No comments: