Monday, March 31, 2008

అందాల అభినేత్రి ఐష్వర్య రాయ్ "పాస్ పోర్ట్" చూద్దామా

ప్రపంచ స్థాయి అందాల భామలలో ఒకరైన బాలీవుడ్ నటీమణి అందాల ఐష్వర్యా రాయ్ అంటే చాలామందికి చాలా చాలా ఇష్టం. ఆమెకు సంబంధించిన వ్యక్తిగత వివరాలు తెలుసుకోవాలని అందరు అభిమానులూ ప్రత్యేక ఉత్సాహాన్ని చూయిస్తుంటారు. ఆమెకు సంబంధించిన పాస్ పొర్ట్ చూస్తే ఎలా వుంటుంది. భారత దేశ ప్రభుత్వం జారీచేసిన ఈ పాస్ పోట్ ఫొటో కాపీ ప్రత్యేకంగా మీకోసం.

"మైఖేల్ మదన కామరాజు" ఎక్స్ క్లూజివ్ గ్యాలరీ

Saturday, March 29, 2008

అంతర్జాతీయంగా రాణిస్తున్న "బెల్లీడ్యాన్స్"
ఎన్ టి రామారావు బర్త్ డేకు విడుదలవనున్న బాలకృష్ణ "పాండురంగడు"


నందమూరి అభిమానులకు మే 28 పండుగ రోజు కానుంది. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందుతున్న "పాండురంగడు" చిత్రాన్ని స్వర్గీయ ఎన్ టి రామారావు పుట్టిన రోజైన మే 28వ తేదీన విడుదలచేయాలని దర్శకుడు భావిస్తున్నట్లు సమాచారం. అప్పటికి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని చిత్రాన్ని విడుదల చేయాలని దర్శక,నిర్మాత కె రాఘవేంద్రా రావు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. "పాండురంగడు" చిత్రంలో బాలకృష్ణ కృష్ణుడు గానూ,భక్తుడు పాండురంగడు గా పించనున్నారు.రామోజీ ఫిలిం సిటి,రాయచూరు,ధాయలాండ్,ఇండోనేషియా,కంబోడియా లలో రమణీయంగా సన్నివేశాలు చిత్రీకరించారు.ఎప్పటిలానే రచయిత జె.కె.భారవి ఈ పౌరాణికానికి కొత్త సొగసులు అద్దారంటున్నారు. కీరవాణి సంగీతం,జయరాం కెమెరా,స్నేహా,టాబు,ప్రియమణి వంటి హీరోయిన్ల అభినయం చిత్రానికి అదనపు హంగులు అవుతుందంటున్నారు.ఈ చిత్రాన్ని ఆర్.కె బ్యానర్ పై కె.కృష్ణ మోహన్ నిర్మిస్తున్నారు.

Friday, March 28, 2008

చీరకట్టులో ఇలియానా

ఈ ఫోటోలు చూస్తే మీకేమనిపిస్తోంది. భారతీయ సాంప్రదాయ వస్త్రమైన చీరకట్టులో ఉండే అందం మరే వస్త్రాలలో రాదనిపించడం లేదూ. ఏప్రిల్ 2వ తేదీన విడుదలయ్యే "జల్సా" చిత్రంలో పవన్ కళ్యాణ్ ప్రేమ పాఠాలలో చీరకట్టులో ముద్దుగుమ్మలు ఎంత అందంగా ఉంటారో సెలవిచ్చినట్లున్నాడు. అందుకే "జల్సా"లో ఇలియానా చాలా సన్నివేశాలలో చీరకట్టులో దర్శనమిస్తుంది. చూస్తుంటే చీరకట్టు మళ్ళీ అమ్మాయిలకు ఫ్యాషన్ అవుతుందా ఏమిటనేలా ఉన్న ఫోటోలను మీరే చూడండి.

బాలీవుడ్ అభినేత్రి "అపర్ణా అరుణ్ కుమార్" (గ్యాలరీ)


బర్త్ డే బాయ్ రామ్ చరణ్ తేజ

"చిరుత" చరణ్ ఈ రోజు 24 వ సంవంత్సరం లోకి అడుగుపెడుతున్నాడు.మెదటి సినిమాతోనే తన దైన ముద్ర వేసి ముందుకెలుతున్న చరన్ ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నాడు. క్రిందటి బర్తడే ని బ్యాంకాక్ లో తల్లి,తండ్రి సమక్షంలో "చిరుత" సెట్ లో జరుపుకున్నాడు. ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త చితం సెట్లో, యూనిట్ అందరి సమక్షంలో ఘనంగా జరుపుకోబోతున్నాడు.విష్ యూ హ్యాప్పీ బర్త్ డే రామ్ చరణ్.

Thursday, March 27, 2008

భారతీ రాజా కూరురు వివాహం సెప్టెంబర్ 1న

ప్రముఖ దర్శకుడు భారతీరాజా కూతురు జనని వివాహం సెప్టెంబర్ 1వ తేదీన చెన్నైలో జరుగనుంది. మలేషియాలోని ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుమార్ తో జరుగనున్న ఈ పెళ్ళికి సంబధించిన నిశ్చితార్తం ఈరోజు చెన్నైలో జరిగింది.కాగా ప్రస్తుతం మలేషియాలో వ్యాపారాన్ని నిర్వహిస్తున్న రాజ్ కుమార్ తమిళనాడులోని మధురై జిల్లాకు చెందినవాడు. ఈరోజు చెన్నైలోని ఆకార్డ్ మెట్రోపాలిటన్ హోటల్ లో జనని, రాజ్ కుమార్ ల వివాహ నిశ్చితార్తం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బంధువులు, కొందరు సినీ ప్రముఖులు హాజరయ్యారు. సెప్టెంబర్ లో జరిగే వివాహాన్ని తెలుగు, తమిళ సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖుల సమక్షంలో అత్యంత వైభవంగా నిర్వహించాలని భారతీరజా భావిస్తున్నట్లు సమాచారం.

బాలీవుడ్ క్రేజీ నాయకి "ఊర్మిల" పెయింటింగ్ చూద్దామా...


"ఆవకాయ బిర్యాని"

"ఆనంద్", "గోదావరి", "హ్యాప్పీడేస్" చిత్రాల దర్శక, నిర్మాత శేఖర్ కమ్ముల తన తాజా ప్రాజెక్టు "ఆవకాయ బిర్యానీ" ని ప్రారంభించాడు. "ఆవకాయ బిర్యానీ" పేరుతో నిర్మించే ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల నిర్మాతగా మాత్రమే ఉంటూ, దర్శకత్వ బాధ్యతలను అనీష్ కురువిల్లాకు అప్పగించాడు.అనీష్ శేఖర్ తొలి చిత్రం "ఆనంద్" లో రాజాకు ఫ్రెండ్ పాత్రలో నటించాడు. అనీష్ చెప్పిన కథ బాగా నచ్చడంతో అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్ పై శేఖర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొత్త నటీనటులు బిందు, కమల్ లు ఇందులో నటిస్తున్నారు.

Wednesday, March 26, 2008

ఇండియానా జోన్స్-4 ఎక్స్ క్లూజివ్ ట్రైలర్

బాలకృష్ణ "పాండురంగడు" వివరాలు ఉగాదికి...

వరుస అపజయాలను ఎదుర్కొన్న నందమూరి బాలకృష్ణ భక్తిరస చిత్రం "పాండురంగడు" తో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. భక్తిరసాల చిత్రీకరణలో అందెవేసిన దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో "పాండురంగడు" చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. దీని పూర్తి వివరాలను ఉగాది శుభదినాన తెలియజేయాలని దర్శకేంద్రులు భావిస్తున్నట్లు తెలిసింది. ఈ చిత్రంలో బాలకృష్ణ "భక్త పుండరీకుని"గా, "శ్రీకృష్ణుని"గా ద్విపాత్రాభినయంతో ప్రేక్షకులను అలరించనున్నాడు. స్నేహ, టబు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో టబు వేశ్యగా నటించడం విశేషం. అంతేకాకుండా ఈ చిత్రానికి భారవి, వేటూరి, సుద్దాల అశోక్ తేజ, వేదవ్యాస్ కలాల నుంచి జాలువారే పాటలు ఈ చిత్రానికి మరింత బలాన్ని చేకూర్చనున్నాయి.గతంలో వైవిధ్య పాత్రలలో వచ్చిన "ఆదిత్య 369", "భైరవ ద్వీపం", "శ్రీకృష్ణార్జున విజయం" సూపర్ హిట్ అయ్యాయి. ప్రస్తుతం విభిన్న తరహాలో రాబోతున్న "పాండురంగడు" చిత్రం కూడా బాలయ్య నటనాచాతుర్యంతో సెన్సేషనల్ హిట్ సాధిస్తుందని ఆశిద్దాం.

Tuesday, March 25, 2008

బాలీవుడ్ క్రేజీ భామిని "మల్లికా శెరావత్" ఎక్స్ క్లూజివ్ వాల్ పేపర్స్

(Courtesy: mallikasherawatwow.com)
పాక్‌లో విడుదలవనున్న "తారే జమీన్ పర్"

నటుడు అమీర్ ఖాన్ దర్శకత్వంలో రూపొందిన ప్రతిష్టాత్మక చిత్రం "తారే జమీన్ పర్" చిత్రం పాకిస్థాన్‌లో విడుదల కానునంది. ఈ చిత్రంతో పాటు, "రేస్" సినిమాను ఈనెల 28వ తేదీన విడుదల చేసేందుకు యూటీవీ సంస్థ సన్నాహాలు పూర్తి చేసింది. "తారే జమీన్ పర్" చిత్రానికి పాకిస్థాన్ సెన్సార్ బోర్డు యూనివర్సల్ సర్టిఫికేట్ (యు)ను జారీ చేసింది. "తారే జమీన్ పర్" చిత్రానికి ఎక్కడా సెన్సార్ కత్తెర వేయకుండా పాకిస్తాన్ సెన్సార్ అనుమతిని ఇచ్చింది. అలాగే "రేస్" చిత్రంలో అక్కడకడ్కడా సెన్సార్ కట్ చేసి యూ/ఏ సర్టిఫికేట్‌తో విడుదల చేసేందుకు పాక్ బోర్డు అనుమతి ఇచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా పంపిణీ హక్కులను కలిగిన యూటీవీ సంస్థ పాకిస్థాన్‌లోని ఐదు ముఖ్య నగరాల్లో విడుదల చేయనుంది. ఒక్కో నగరంలో ఐదు సినిమా థియేటర్లలో ఈ చిత్రాలు విడుదల చేస్తున్నారు. యూటీవీ గతంలో "గోల్" చిత్రాన్ని విడుదల చేసింది.