Tuesday, April 8, 2008

ఒకేసారి 10 చిత్రాలను ప్రారంభించిన పిరమిడ్ సాయిమిరా గ్రూప్

తమిళ చలన చిత్ర రంగంలో మరో నూతన అధ్యాయం ప్రారంభమైంది. తమిళ చలన చిత్ర రంగంలె తొలిసారిగా ఒక సంస్థ పది చలన చిత్రాలను ఒకేరోజు ప్రారంభించింది. ప్రపంచంలొ అత్యంత వేగంగా విస్తరిస్తున్న చలచిత్ర నిర్మాణ, ప్రదర్షన సంస్థ అయిన పిరమిడ్ సాయిమిరా థితేటర్ లిమిటెడ్ సంస్థ గత శనివారం రోజు ఏక కాలంలో పది చలన చిత్రాల నిర్మాణానికి పూనుకుంది. తమిళ చలన చిత్ర నిర్మాతల సంఘం అధ్యక్షుడౌ రామ నారాయణ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పిరమిడ్ సాయిమిరా సంస్థ 10 చలన చిత్రాల నిర్మాణానికి అంకురార్పణ గావించింది. ప్రపంచ వ్యాప్తంగా ఆరు దేశాలలో 800 సినిమా థియేటర్లు, 53 మల్టీ ప్లెక్స్ లు కలిగిన పిరమిడ్ సాయిమిరా సంస్థ సినిమాల నిర్మాణం, పంపిణీ, సీరియల్ ల నిర్మాణాన్ని చేబట్టింది. సినీ రంగంలో ఉంటూ ఆర్థికంగా కృంగిపోయిన నిర్మాతలకు వెన్నుదన్నుగా ఉండటంకోసం సంస్థ నిర్ణయించింది. ఇందులో భాగంగా 24 చలన చిత్రాలను నిర్మించి ఆర్ధికంగా కృంగిన నిర్మాతలకు చేయూతనందించాలనే పధకంలో భాగంగా తొలి విడతగా 10 చిత్రాల నిర్మాణానికి పూనుకుంది. ఈ పది చిత్రాలను గత శనివారం చెన్నైలో అత్యంత వైభవంగా ప్రారంభించింది. ఈ పథకాన్ని పిరమిడ్ సాయిమిరా థియేటర్ లిమిటెడ్ సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ పి.సామినాథన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమనికి సినీ నిర్మాతల సంఘం అధ్యక్షుడు రామనారాయణ్ అధ్యక్షత వహించగా, సినీ వాణిజ్య సంఘం అధ్యక్షుడు కె ఆర్ జి, సినీ దర్శకులు చేరన్, నటుడు శిబి, విజయకుమార్,సత్యరాజ్, భరత్, పార్తీబన్, జీవన్, జయం రవి, ప్రసన్న, మురళి, సుందర్ సి, దర్శ్కుల సంఘం అధ్యక్షుడు ఎస్ ఎ చంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

No comments: