Wednesday, April 9, 2008

పరిటాల రవీంద్ర జీవిత కథతో రాం గోపాల్ వర్మ సినిమా

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దివంగత పరిటాల రవి జీవిత చరిత్రను "చరిత్ర" టైటిల్ తో రాంగోపాల్ వర్మ తెరకు ఎక్కించటానికి సన్నాహాలు చేస్తున్నారనే వార్త హాట్ టాపిక్ అయింది. "సత్య", "కంపెనీ", "సర్కార్" వంటి గ్యాంగ్ స్టర్ సినిమాలను ప్రతిభావంతంగా తెరకెక్కించిన రాం గోపాల్ వర్మ ఈ ప్రాజక్టును ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నట్లు సమాచారం. సాధారణంగా సంచలనం సృష్టించే విధంగా నిజ జీవిత పాత్రలను తన సినిమాల్లో చూపించటానికి వర్మ ఇష్టపడుతుంటారు। గతంలో "సర్కార్" చిత్రంలోలో శివ సేన అధినేత భాల్ థాకరే ని అనుకరిస్తూ అమితాబ్ పాత్రను చిత్రీకరించారు. అదే విధంగా ఇప్పుడు అనంతపురం జిల్లాను తన కనుసన్నల్లో శాసించి, స్థానికంగా అతి పెద్ద నాయకునిగా, ఎం ఎల్ ఎ గాఎదిగిన పరిటాల రవీంద్ర ఆ తర్వాత దారుణ హత్యకు గురయ్యారు. అయితే పరిటాల రవి పాత్రను తెరకెక్కించాలని నిర్ణయించుకోవటం వివాదాలకు అవకాశమున్న సున్నితమైన అంశం అని కొందరు భావిస్తున్నారు. మరో ప్రక్క అసెంబ్లీ సమావేశాల్లో రవి భార్య సునీత ఆయన హత్య వెనుక ముఖ్యమంత్రి వైఎస్ కుమారుడు జగన్ వున్నాడని ఆరోపించారు. ఇలా వాడి వేడిగా ఉన్న సబ్జెక్టు కావటంతో మరింత ఆసక్తి రేపుతోంది. "చరిత్ర" పేరుతో నిర్మించనున్న ఈ సినిమాకు వర్మే దర్శకత్వం వహిస్తారా లేక తన శిష్యులకు అప్పచెపుతారా, సినిమాలో పరిటాల రవీంద్ర పాత్రను ఎవరు పోషిస్తారు వంటి విషయాలు తెలియాల్సి ఉంది.

No comments: