తమిళనాట సినీ పరిష్రమ ఒకరోజు స్థంభించింది. తమిళనాడులో మంచినీటి ప్రాజెక్టు హొగెనకల్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ కర్ణాటకలో తమిళ సినిమాలు ప్రదర్శిస్తున్న థియేటర్లపై దాడికి నిరసనగా తమిళ సినీ పరిశ్రమ యావత్తూ కదిలి వచ్చింది. కాలీవుడ్ ఆర్టిస్టులు శుక్రవారం ఉదయం చేపక్ మైదానంలో తమ నిరాహార దీక్షను ప్రారంభించారు. సినీ నటులు, తమిళ చిత్ర నిరమాతల మండలి ప్రతినిధులు, దక్షిణ భారత చిత్ర పరిశ్రమ ఉద్యోగుల సమాఖ్య వంటి సంస్థల ప్రతినిధులు ఈ నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా షూటింగులను రద్దు చేసుకున్నారు. ఇతర ప్రాంతాల్లో, విదేశాల్లో జరుగుతున్న షూటింగులను కూడా నిరసన ప్రదర్శనకు సంఘీభావంగా శుక్రవారం నాడు ఆపేశారు. చెన్నైలోని థియేటర్లలో మధ్యాహ్నం పూట సినిమా ప్రదర్శనలను రద్దు చేశారు. నిరాహార దీక్షలో రజనీకాంత్, కమల్ హాసన్, విక్రం, మాధవన్, త్రిష, నయనతార, విజయకాంత్, శరత్ కుమార్, రాధిక, ప్రకాశ్ రాజ్ సహా అనేకమంది సినీ ఆర్టిస్టులు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment