Monday, April 14, 2008

24న ప్రారంభం కానున్న మహేష్ బాబు "వరుడు"

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నూతన చిత్రం "వరుడు" ఈ నెల 24న ప్రారంభించనున్నట్లు సమాచారం. మహేష్ బాబు చివరగా నటించిన "అతిధి" రిలీజయి చాలా కాలం అవుతున్నా ఇంతవరకు మరే సినిమా ప్రారంభం కాలేదు. ప్రస్తుతం హాలిడే ట్రిప్పులో విదేశాలు చుడుతున్న మహేష్ బాబు వచ్చాక త్రివిక్రమ్ దర్శకత్వంలో "వరుడు" చిత్రంలో నటిస్తాడని తెలుస్తోంది. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన "అతడు" మెగా హిట్ కావటంతో వీరి కాంబినేషన్ పై భారీగానే అంచనాలు ప్రారంభమవుతున్నాయి. శింగనమల రమేష్ నిర్మించే ఈ చిత్రం పూర్తి స్క్రిప్టు తో సెట్స్ మీదకు వెళ్ళటానికి రెడీగా ఉందని సమాచారం. ఈ చిత్రానికి హీరోయిన్ ఎంపిక ఇంకాజరుగలేదని, కొత్త అమ్మాయికోసం వెదుకుతున్నట్లు సమాచారం. 24నుంచి ఈ ప్రాజెక్టు సెట్స్ మీదకు తీసుకువెళ్ళేందుకు తీవ్రంగాగా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.

No comments: