Wednesday, April 16, 2008

చిరంజీవి "అధినాయకుడు"

మెగాస్టార్ చిరంజీవి నటించనున్న కొత్త చిత్రం "అధినాయకుడు" అతి త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనున్నట్లు సమాచారం. సినీ రాజకీయ మీమాంసలో ఉన్న చిరంజీవి అభిమానులకు ముందుగా చిరంజీవి తరువాతి చిత్రం ప్రారంభం కానుందనే వార్త కొంత ఉత్సాహాన్ని ఇస్తుందనే చెప్పాలి. తమ అభిమాన నాయకుడు రాజకీయాల్లోకి రావాలని ఎంతగానే కోరుకుంటున్న అభిమానులకు చిరంజీవి ప్రస్తుతం నటించనున్న రాజకీయ ప్రాధాన్యత కలిగిన చిత్రం పూర్తవగానే మెగా పార్టీ ఆవిర్భవించనుందనే సంకేతాన్ని అభిమానులకు చిరంజీవి కుటుంబ సభ్యులౌ చేరవేసినటు సమాచారం. చిరంజీవి "శంకర్ దాదా జిందాబాద్" తరువాత ఏ సినిమాలోనూ నటించలేదు.అలాగని రాజకీయాల్లోకి రేపో, ఎల్లుండో వస్తారనే ఊహాగానాలకీ తెర వెయ్యలేదు. దాంతో ఈ పరిస్ధితిలో ఇక చిరంజీవి సినిమా లేనట్లే అని తెలుగు చలనచిత్ర రంగంలో కొంత ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి తెరవెయ్యడం కోసం ఎలాంటి హంగూ, ఆర్భాటాల్లేకుండా "అధినాయకుడు" సినిమా త్వరలో ప్రారంభమయ్యే సూచనలు కనపడుతున్నాయి. ఈ సినిమాకి రాజకీయ, సామాజిక అంశాలను టచ్ చేస్తూ మాస్ ఎలిమెంట్లు మిళితం చేస్తూ పరుచూరి బ్రదర్స్ పూర్తి స్ధాయి స్క్రిప్టు రెడీ చేసారట. ఎన్ కౌంటర్ ఫేమ్ ఎన్. శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం రానున్నట్లు సమాచారం. చిరంజీవి శ్రేయాభిలాషులైన కె. రాఘవేంద్రరావు, సి. అశ్వనీదత్ లతో అల్లు అరవింద్, దీనిని నిర్మించబోతారని తెలుస్తోంది. హీరోయిన్, మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. తాము "అధినాయకుడు" సినిమాకు స్క్రిప్టు పూర్తిగా సిద్దం చేసామని, ప్రారంభమే తరువాయి అన్నట్లు కొద్ది కాలం క్రితం పరుచూరి వెంకటేశ్వర రావు చెన్నైలో చెప్పడం ఇక్కడ గమనార్హం.

No comments: