Saturday, April 19, 2008

చైనా ప్రభుత్వంతో పిరమిడ్ సాయిమిరా ఒప్పందం

సినిమా నిర్మాణ, పంపిణీ రంగాలతోబాటుగా టెలివిజన్ సాప్ట్ వేర్ ను కూడా రూపొందిస్తున్న పిరమిడ్ సాయిమిరా థియేటర్ లిమిటెడ్ సంస్థ చైనా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోబోతోంది. చైనాలోని మూడు వందల థియేటర్లను లీజుకు తీసుకుని సినిమాల ప్రదర్శనకు ఒప్పందం చేసుకోబోతున్నామని, అందుకోసం చైనా నుండి వచ్చిన ప్రతినిధుల బృందం చెన్నైలోనూ, హైదరాబ్ లోనూ తాము నిర్వహిస్తున్న కార్యకలాపాలను వీక్షించాయని సాయిమిరా థియేటర్ లిమిటెడ్ సంస్థ చైనా ఆపరేషన్స్ సి ఇ ఒ వెంకట్ తెలిపారు. ఏడుగురు సభ్యులు కలిగిన చైనా బృందం సాయిమిరా థియేటర్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అరోనా టెక్నలజీస్ సంస్థ రూపొందిస్తున్న యానిమేషన్, ఆన్ లైన్ గేంస్ సాప్ట్ వేర్, శబ్దాలయా స్టూడియోలోని పోస్ట్ ప్రొడక్షన్ యూనిట్ ను, పద్మాలయా స్టూడియోస్ తోబాటు, జంటనగరాలలోని కొన్ని థియేటర్లను సందర్శించారు. చైనా బృందంలో చైనా సోషల్ మ్యూజిక్ రీసెర్చ్ బోర్డ్ కు చెందిన లూ షి జంగ్, లంగ్జూ గ్రూప్ కు చెందిన యంగ్ లీ, యంగ్ జుడోంగ్, డింగ్ యాలీ, లీ గుపూ, కీ టైప్ టెక్నాలజీస్ లిమిటెడ్ సి ఇ ఒ లియు జున్(మైఖేల్) ఉన్నారు. ఆంద్ర ప్రదేశ్ లో జరుగుతున్న సాయిమిరా థియేటర్ లిమిటెడ్ సంస్థ కార్యకలాపాలను ఎ పి ఇంచార్జ్ తమ్మారెడ్డి భరద్వాజ ఈ బృందానికి వివరించారు.

No comments: