Wednesday, April 9, 2008
"బెనహర్" హీరో హెస్టన్ కన్ను మూత
ప్రపంచ చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోయే క్లాసిక్ చిత్రాలైన "టెన్ కమాండ్ మెంట్స్" , "బెనహర్" చిత్రాల ల హీరో హెస్టన్ గత శనివారం రాత్రి కన్నుమూశారు. "బెనహర్" చిత్రానికికి గాను ఆస్కార్ అవార్డు అందుకున్న ఈ అంతర్జాతీయ నటుడు గత కొద్ది కాలంగా అల్జీమర్స్ వ్యాధితో భాధపడుతున్నారు. తన 84 వ యేట అమెరికా లాస్ లోని ఏంజిల్స్ లోని బెవర్లీ హిల్స్ లో గల తన సొంత ఇంట్లో ఆయన ప్రశాంతంగా తుదిశ్వాస వదిలారు. ఈ వార్త తెలిసిన ప్రపంచ నినీ ప్రియులు, అభిమానులు, హాలీవుడ్ వాసులు అంతా ఒక్కసారిగా విచార సముద్రంలో మునిగి పోయారు.ఒడిదుడుకులుగా ఉన్న హెస్టన్ సినీ కెరీర్ "బెనహర్" సినిమా వచ్చాక మారిపోయింది. ఆ తరువాత కొద్ది కాలానికే హాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకునే స్థాయికి ఎదిగాడు ఆయన. తర్వాత తరం వాళ్శకే గాక తన తరం వారికి కూడా ప్రేరణగా నిలవడం ఆయన ప్రత్యేకత. దాదాపు వంద సినిమాల్లో ఆయన నటించి తారాస్థాయికి ఎదిగాడు. తనకు ఉన్న వ్యాధిపై చాలా కాలం ఆయన బయటి ప్రపంచానికి తెలియనివ్వలేదు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment