హైదరాబాద్: డిటెక్టివ్ నవలల ద్వారా లక్షలాది తెలుగు పాఠకులకు చిరపరిచితమైన షాడో అలియాస్ మధుబాబు ఇప్పుడు యానిమేషన్ సినిమా రంగంలోకి ప్రవేశించారు.1970 దశకంలో డిటెక్టివ్ నవలల ద్వారా తెలుగు పాఠకులను ఉర్రూతలూగించిన మధుబాబు ఎలా ఉంటారో ఎవరికీ తెలియదు. ఆయన రాసిన వందలాది నవలల్లో ఆయన ఫోటో ఏనాడూ ప్రచురితం కాలేదు. "మూషి" అనే యానిమేషన్ సినిమా ద్వారా మళ్ళీ వెలుగులోకి రానున్న ఈ సస్పెన్స్ రైటర్ ఫోటోలను "దట్స్ తెలుగు డాట్ కాం" తొలిసారిగా పాఠకుల ముందుకు తీసుకొస్తోంది.మధుబాబు శరపరంపరగా తన రచనా యాగం కొనసాగించినప్పటి రోజులు వేరు. ఇప్పుడు చదివే వారు బాగా తగ్గిపోయారు. టీవీ చూడడమో, ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడమో ఇప్పటి హాబీలు. అయినా మారిన కాలాన్ని తిట్టుకోకుండా యానిమేషన్ మూవీ రంగంలోకి అడుగు పెట్టారు మధుబాబు. మధుబాబు "మూషి" దాదాపు అన్ని భారతీయ భాషల్లోనూ రానుంది.
(కర్టేసి: దట్స్ తెలుగు)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment