Wednesday, April 30, 2008

హాలీవుడ్ ఫిలిం "ఐరన్ మెన్" వాల్ పేపర్స్
అల్లు అర్జున్ "పరుగు"

అల్లు అర్జున్ హీరోగా, షీలా హీరోయిన్‌ గా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం పరుగు. ఈ చిత్రం అన్ని హంగులు పూర్తి చేసుకుని గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది. కార్మిక దినోత్సవమైన మేడే రోజున ఈ చిత్రాన్ని నిర్మాతలు ప్రేక్షకుల ముందుకు తేనున్నారు. తెలుగు తెరపై విజయానికి చిరునామాగా నిలిచిన క్రేజీ కాంబినేషన్‌తో పరుగు చిత్రం రూపొందడంతో దీనిపై అందరిలోను ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో హీరోగా చేసిన అల్లు అర్జున్ తన తొలిచిత్రం గంగోత్రి నుంచి ప్రతి సినిమాను వైవిధ్యంగా మలుచుకుని విజయాన్ని సొంతం చేసుకుంటూ వస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన భాస్కర్‌కు ఇది రెండో చిత్రం. ఆయన తొలిచిత్రం బొమ్మరిల్లు ఎంతపెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఈ చిత్రం సాధించిన విజయంతో ఈ చిత్రం పేరు భాస్కర్‌కు ఇంటిపేరులా నిలిచిపోయింది. ఈ చిత్రాన్ని నిర్మించిన దిల్ రాజు సైతం సక్సెస్ చిత్రాల నిర్మాతగా పేరుతెచ్చుకున్నారు. ఈయన గత చిత్రం బొమ్మరిల్లు సాధించిన విజయం గురించి చెప్పుకున్నాం కదా. ఇలాంటి ఓ అద్భుతమైన కాంబినేషన్‌తో రూపొందిన చిత్రానికి సంబంధించి దర్శకుడు మాట్లాడుతూ తన గత చిత్రం బొమ్మరిల్లులో ఓ తండ్రి, కొడుకు మధ్య ఉండే సున్నితమైన అంశాన్ని తెరకెక్కించినట్టే ఈ చిత్రంలో ఓ తండ్రి, కూతురి మధ్య సంబంధాన్ని తెరకెక్కించినట్టు తెలిపారు. తన గత చిత్రం సాధించిన విజయం లాగానే ఈ చిత్రం సైతం తప్పకుండా విజయం సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అల్లు అర్జున్‌ కెరీర్‌లో మరో ఉత్తమ చిత్రంగా భావిస్తున్న ఈ చిత్రం ఆడియోను అల్లు అర్జున్ పుట్టిన రోజైన ఏప్రిల్ 8న ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ఈ ఆడియోను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేశారు. ఇలాంటి అనేక ప్రత్యేకతలున్న ఈ చిత్రం గురువారం నుంచి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సందడి చేయనుంది.

కమల్ హాసన్ ప్రతిష్టాత్మక చిత్రం "మరుదనాయగం" ఎక్స్ క్లూజివ్ ట్రైలర్


Tuesday, April 29, 2008

పిరమిడ్ స్వంతం చేసుకున్న "కుచేలుడు" డిస్ట్రిబ్యూషన్ హక్కులు (ప్రెస్ క్లిప్పింగ్స్)

ఈనాడు దిన పత్రిక
ఆంధ్ర జ్యోతి దిన పత్రిక

పవన్ కళ్యాణ్ సరసన నటించనున్న కరీనా కపూర్...!?

పవన్ కళ్యాణ్ సరసన బాలీవుడ్ అగ్ర నటి కరీనా కపూర్ నటించనుందనే వార్త టాలీవుడ్ లో గుప్పుమంటోంది. పవన్ కళ్యాణ్, ఇలియనాలు నటించిన "జల్సా" విజయవంతంగా ప్రదర్శింపడుతున్న తరుణంలో ఈ కొత్త కాంబినేషన్ కు సంబంధించిన వార్త వెలుగులోకి వచ్చింది. పవన్ కళ్యాన్ హీరోగా, ఎస్ జె సూర్య దర్శకత్వంలో సింగనమల రమేష్ నిర్మించనున్న "పులి" చిత్రంలో బాలీవుడ్ నటీమణి కరీనా కపూర్ నటించనుందని సమాచారం. అదే జరిగితే ఈ చిత్రం కరీనా కపూర్ కు తొలి దక్షిణ భారతీయ చిత్రం అవుతుంది. ఇప్పటికే ఈ చిత్రానికి ఎ ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తూడటం, బాలీవుడ్ సినెమాటోగ్రాఫర్ వినోద్ ప్రభాస్ కెమెరా మెన్ గా పనిచేస్తూండటం తోబాటు, హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ ఫిట్స్ చిత్రీకరించనుండటం తో ఇప్పటికే సంచలనాలు సృస్టిస్తున్న ఈ చిత్రం ఇప్పుడు కరీనా కపూర్ నటించనుందనే వార్తతో మరింత హాట్ కేక్ సమాచారంగా మారింది. ఈ విషయం అభిమానులకు ఖచ్చితంగా తీపి వార్తే.

"కుచేలుడు" డిస్ట్రిబ్యూషన్ హక్కులు పొందిన పిరమిడ్ సాయిమీరా థియేటర్స్ లిమిటెడ్

రజినీకాంత్ నటించిన "కుచేలుడు" డిస్ట్రిబ్యూషన్ హక్కులు పిరమిడ్ సాయిమీరా థియేటర్స్ లిమిటెడ్ స్వంతం చేసుకుంది. డిస్ట్రిబ్యూషన్ రంగంలో తనదైన శైలిలో దూసుకుపోతున్న పిరమిడ్ సాయిమీరా థియేటర్స్ లిమిటెడ్ ఈ చిత్ర తమిళ, తెలుగు హక్కులు స్వంతం చేసుకుంది. పి. వాసు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తమిళంలో పశుపతి ప్రధాన పాత్రలో నటిస్తుండగా, తెలుగులో జగపతి బాబు చేస్తున్నారు. నయనతార, మమతా మోహన్‌దాస్ సహా పలువురు ప్రముఖ తారలు ఈ చిత్రంలో నటిస్తున్నారు. రజనీకాంత్ ఈ సినిమాలో తన పాత్ర కనిపించేది 25 శాతమే అయినా చిత్రానికి ప్రాణ ప్రతిష్ట చేసే అత్యంత అరుదైన పాత్రను రజినీ పోషిస్తుండటంతో ఈ చిత్ర హక్కులకు విపరీతమైన డిమాడ్ ఏర్పడింది. దాంతో తెలుగు, తమిళ వెర్షన్ల పంపిణీ హక్కుల కోసం పలు కార్పోరేట్ కంపెనీలు పోటీ పడ్డాయి. వాటిల్లో యాడ్‌లాబ్స్, అయ్యంగారన్ ఫిలిమ్స్ మరి కొన్ని కంపెనీలు ఈ చిత్ర హక్కులకోసం పోటీపడ్డాయి. చివరకు పిరమిడ్ సాయిమీరా థియేటర్స్ లిమిటెడ్ ఈ చిత్ర హక్కులను స్వంతం చేసుకుంది. మార్కెట్లో "కుచేలుడు" సినిమాని చాలా విలువైన ప్రొజెక్టుగా భావించటంతో ఈ రేటు పలికిందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. అంటే "కుచేలుడు" మరో అరుదయిన రికార్డుని జత చేసుకున్నట్లే.

Tuesday, April 22, 2008

చెన్నైలో పిరమిడ్ ద్వారా విడుదలవనున్న "భలే దొంగలు"


అల్లరి నరేష్ "ఫిట్టింగ్ మాస్టర్"


"సీమశాస్త్రి" , "అత్తిలి సత్తిబాబు", "బ్లేడు బాబ్జీ" అంటూ వెరైటీ టైటిల్స్ తో దూసుకుపోతున్న అల్లరి నరేష్ కొత్త సినిమా కి "ఫిట్టింగ్ మాస్టర్" అనే టైటిల్ పరిశీలుస్తున్నారు. ఈ చిత్రాన్ని నరేష్ తండ్రి ఇ.వి.వి.సత్యనారాయణ తన దర్సకత్వంలో స్వీయ బేనరు పై నిర్మించటానికి సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా నరేష్ హీరోగా చేసిన "బొమ్ననా బ్రదర్స్ చందనా సిస్టర్స్"రిలీజై ఫరవాలేదనిపించుకుంటోంది. తరువాత వేగిశ్న సతీష్ దర్శకత్వంలో వస్తున్న "దొంగల బండి" షూటింగ్ లో నరేష్ నటిస్తాడు. తరువాతే ఫిటింగు మాస్టర్ ఉంటుంది. అంటే ఈ వెరైటీ కామిడి రావటానికి కొంత టైము పడుతుందన్నమాట.హాలీవుడ్ క్రేజీ నటి డ్రు బెర్రిమోర్ గ్యాలరి