Thursday, August 23, 2007

అమెరికాలో ఈ నెల 31న విడుదలవనున్న "వనజ".


నిరుపేద బెస్త కుటుంబంలోని పద్నాలుగేళ్ళ బాలిక వనజ తను ద్యాన్సర్ కావాలని కనే కలల చుట్టూ నడిచే కథతో హృద్యంగా చిత్రించిన "వనజ" చిత్రం ఈ నెల 31న అమెరికాలో విడుదలవుతోంది. కొలంబియా యూనివర్సిటీ విద్యార్థి అయిన రజినీశ్ తన విద్యాభ్యాస సమయంలో రాసుకున్న కథతో చిత్రించిన ఈ సినిమా బెర్లిన్ చిత్రోత్సవంలో పాల్గొని ఉత్తమ తొలి చిత్రంగా అవార్డును అందుకుంది. ఆ తర్వాత తొలి ఉత్తమ చిత్ర దర్శకునికి ఇచ్చే "గొల్లపూడి శ్రీనివాస్" స్మారక అవార్డును కూడా ఈ చిత్రం అందుకుంది. హైదరాబాదుకు చెందిన తెలుగు వాడైన రజినీశ్ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం ఇంతవరకు తెలుగులో, తెలుగు నేలపై విడుదలకు మాత్రం నోచుకోలేకపోయింది. ఈ చిత్రాన్ని తెలుగు నేలపైకూడా విడుదల చేస్తే బావుంటుంది. అప్పుడే ఓ మంచి చిత్రాన్ని తెలుగు వారికి చూయించిన సంతృప్తి దర్శక నిర్మాతలకు దక్కుతుంది. కనిక ఆ మార్గంలో వారు ప్రయత్నిస్తే బావుంటుంది. అయితే ఇప్పటికే వారు ప్రయత్నించి ఉంటారు.కాని ఆ ప్రయత్నం వల్ల కమర్శియల్ చిత్రాలకు అలవాటు పడ్డ డిస్త్రిబ్యూటర్లను, బయ్యర్లను వారు సంతృప్తి పరచక పోవడమో, లేక ఈ కథ పట్ల వారు సంతృప్తిగా లేక పోవడమో జరిగి ఉంటుంది. అయితే ఒక్క డిస్త్రిబ్యూటర్లు, బయ్యర్లే సమస్తం కాదు. ఇంకా చాలా దారులు ఉంటాయి. ఆ రకంగా కూడ ప్రయత్నించి త్వరలోనే విజయం సాధిస్తారని కోరుకుంటున్నాం.
శ్రీవెంకట్ బులెమోని.

No comments: