చిరంజీవి నటించిన "శంకర్ దాద జిందాబాద్" చిత్రం తమిళనాట విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. చిరంజీవి 148వ చిత్రంగా జెమిని ఫిలిం సర్క్యూట్ ప్రభుదేవా దర్శకత్వంలో నిర్మించిన "శంకర్ దాద జిందాబాద్" చిత్రాన్ని తమిళనాడులో పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్ విడుదల చేసింది. ఈ చిత్ర ప్రారంభోత్సవం చెన్నైలోని ఉడ్ లాండ్ పిరమిడ్ థియేటర్లో జులై 27న ఘనంగా జరిగింది. గత ఇరవై రోజులకుపైగా ఈ చిత్రాన్ని తమిళనాడులోని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తూ ఈ "శంకర్ దాద జిందాబాద్"ను విజయపథంలో నడిపిస్తున్నారు.తెలుగునాట సాధారణ విజయాన్ని నమోదు చేసుకున్న ఈ చిత్రం తమిళనాట మాత్రం ఘనవిజయాన్ని సాధించడం ఒకింత ఆశ్చర్యం వేసినా అక్కడ సాధించిన విజయం చిరంజీవి అభిమానులను ఆనందానికి గురిచేస్తొంది. ఈ విజయానికి చిరంజీవి సహితం సంతృప్తిగా ఉన్నట్లు తెలిసింది.తమిళ నాట చిత్ర విజయానికి ప్రధానంగా పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్ సి.ఒ.ఒ.ఆర్ వెంకట కృష్ణన్,మార్కెటింగ్ ప్రెసిడెంట్ జి.గౌతంల ప్రణాళికా బద్దమైన ప్రచారమే ప్రధాన కారనమని సంస్థ పేర్కొంటోంది. మార్కెటింగ్ ఇంచార్జ్ జ్యోతి, డిజైనర్ మాడసామి లతోబాటు ఇతర మార్కెటింగ్ సిబ్బంది చేసిన కృషి ఫలితంగా ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది.
శ్రీవెంకట్ బులెమోని.
No comments:
Post a Comment