Thursday, August 30, 2007

430 కోట్లు చెల్లించి "షోలే" హక్కులు కొన్న పి.ఎన్.సి.


"షోలే" చిత్రం ఎప్పుడూ సంచలనమే.
ముప్పై రెండు సంవత్సరాల క్రితం విడుదలై కనీవినీ ఎరుగని అఖండ విజయం సాధించిన ఈ చిత్రం డైలాగులు నాటి అత్యధిక భారతీయ ప్రేక్షకులకు కంఠస్థమే. భాషతో సంబంధంలేకుండా అన్ని ప్రాంతాలవారిని ఈ చిత్రం మెప్పించింది.ఈ క్లాసిక్ చిత్రం రాంగోపాల్ వర్మ వల్ల మరోసారి చర్చనీయాంశమైంది.
ఈ చిత్ర హక్కులు పొందకుండా "షోలే" చిత్రాన్ని రీమేక్ కు ఆయన పూనుకోవడంతో వ్యవహారం కొర్టులదాకా వెల్లింది.ఆ తర్వాత ఆయన పేరు మార్చడం, కథ మార్చడం వేరే విషయం. ఇప్పుడు కొత్తగా ఈ చిత్రం రీమేక్ కు పొందిన రేటుతో మరోమారు భారతీయ చిత్ర పరిశ్రమలో సంచలనం సృస్టించింది. "షోలే" చిత్రాన్ని రీమేక్ కోసం చిత్ర నిర్మాత జి.పి. సిప్పీ, దర్శకుడు రమశ్ సిప్పీలకు ఏకంగా రూ.430 కోట్లు చెల్లించి ప్రీతీశ్ నంది కమ్యూనికేషన్స్ (పి.ఎన్.సి.) హక్కులు పొందడం బాలీవుడ్ లో చర్చనీయాంశమైంది. ప్రీతీశ్ నంది కమ్యూనికేషన్స్ సంస్థ "షోలే" చిత్రాన్ని నాలుగు భాగాలుగా చిత్రించడానికి పూనుకుంది. అసలు "షోలె" కు ముందు ఏం జరిగి వుంటుందోననే కథాంశంతో మొదటి భాగాన్ని,అసలు చిత్రాన్ని యధాతతంగా రెండవ భాగాన్ని, త
దనంతరం జరిగే కథతో మూడవ భాగాన్ని చిత్రించడంతోబాటు, అసలు చిత్రాన్ని యధాతతంగా యానిమేషన్ రూపంలో నాలుగవ చిత్రాన్ని నిర్మినంచడానికి పూనుకుంది. వీటికి సంబంధించిన స్క్రిప్ట్ కార్యక్రమాలు అప్పుడే ప్రారంభమయ్యాయని తెలిసింది. దీని షూటింగ్ కూడా అతి త్వరలోనే సెట్స్ పైకి వస్తుంది.
శ్రీవెంకట్ బులెమోని

No comments: