Tuesday, August 14, 2007

స్వర్గీయ ఎన్.టి.ఆర్.నిజ జీవిత సంఘటనలతో బాలకృష్ణ సినిమా...!?.

స్వర్గీయ నందమూరి తరక రామారావు నిజ జీవిత సంఘటనల ఆధారంగా బాలకృష్ణ నటిస్తున్న " ఒక్కమగాడు" చిత్రం రూపుదిద్దుకుంటోంది. సినీపరిష్రమలోని కొందరు, మరి కొందరు పాత్రికేయులు కూడా ఇది నిజమనే అంటున్నారు. ఇదే విషయాన్ని ఇండియా గ్లిట్జ్.కాం లో కూడా ప్రచురించారు.వై.వి.యస్.చౌదరి నిర్మాణ, దర్షకత్వంలో బొమ్మరిల్లు పతాకంపై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో ఎన్.టి.ఆర్.నిజ జీవితంలోని సినీ,రాజకీయ సంఘటనలను సమ్మిళితంచేసి అత్యద్భుతంగా ఈ చిత్రకథను తయారుచేసినట్లు తెలిసింది. ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారు.ఇందులో బాలకృష్ణ సరసన సిమ్రాన్,అనుష్క,కరిష్మా కొఠక్ లు కథానాయికలుగా నటిస్తున్నారు.
శ్రీవెంకట్ బులెమోని.

1 comment:

Anonymous said...

సినిమా వార్తల బ్లాగు కోసం ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నాము. ఇలాగే భవిష్యత్తులో కూడా తెలుగు సినిమా వేడి వేడి వార్తలు అందిస్తారని ఆశిస్తా.