Friday, August 17, 2007

పోలీస్ అధికారి "రాఘవన్"గా వస్తున్న కమల్ హాసన్.






కమల్ హాసన్, జ్యోతిక, కమలినీ ముఖర్జీ హీరో, హీరోయిన్లుగా నటించిన తమిళ చిత్రం "వేట్టియాడు వేలయాడు" తెలుగులో "రాఘవన్" పేరుతో విడుదల కానుంది.సెవెంత్ ఛానెల్ కమ్యూనికేషన్స్ పతాకంపై మాణిక్యం నారాయణ్ సమర్పణలో కె.వి.వి.సత్యనారాయణ, శాఖమూరి పాండురంగారావులు ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.ఈ నెల 31వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రముఖనటుడు ప్రకాశ్ రాజ్ మరో పోలీస్ అధికారిగా కమల్ కు సహకరించే పాత్రలో నటించినట్లు తెలుస్తొంది.తెలుగులో వెంకటేశ్ నటించిన "ఘర్షణ" చిత్రానికి దర్శకత్వం వహించిన గౌతం ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

శ్రీవెంకట్ బులెమోని.



1 comment:

S said...

ఎన్ని సార్లు పేర్లు మారుస్తారో ఈ సినిమాకి!
మొదట "మగధీర" అన్నారు. తరువాత "వేటాడు-వెంటాడు" అన్నారు. ఇప్పుడేమో "రాఘవన్" అంటున్నారు. ఏమిటో! ఎప్పటికి విడుదల చేస్తారో!
ఈ సినిమా గురించి కొన్నాళ్ళ క్రితం రాసిన వ్యాసం, దానికి సంబంధించిన కామెంట్లు -
http://vbsowmya.wordpress.com/2007/04/02/vettaiyaaduvilayaadu/

S.