Thursday, August 16, 2007

ఇండియన్ పనోరమా పోటీలకు ఆహ్వానం.

38వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఇండియన్ పనోరమా విభాగంలో ప్రదర్శించడం, మరియు పోటీ విభాగంలో ప్రదర్శించడానికి భారతీయ చలన చిత్రాల నిర్మాతలనుండి డైరెక్టరేట్ ఆఫ్ ఫిలిం ఫెస్టివల్స్ ఐ.పి. విభాగం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.ఈ విభాగం ఎంపిక చేసిన చిత్రాలను ఈ సంవత్సరం అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించడంతోబాటు ఈ సంవత్సరం జరిగే వివిధ జాతీయ, అంతర్జాతీయ చిత్రోత్సవాలలో పాల్గోవడానికి వీటిని అనుమతిస్తారు.ఏ భారతీయ భాషలలో అయినా రూపొందించిన ఫీచర్,నాన్ ఫీచర్ చిత్రాలను ఇండియన్ పనోరమా విభాగానికి అనుమతిస్తారు. అయితే ఈ చిత్రాలు 1,సెప్టెంబర్,2006 నుంచి 31,ఆగస్టు,2007 మద్యన రూపొందించినవై ఉండాలి.ఫీచర్ ఫిల్మ్ 35 ఎం.ఎం.,16 ఎం.ఎం. లేదా వైడర్ గేజ్ ప్ఫార్మాట్లో చితీకరించినవై ఉండాలి.డిజిటల్ రూపంలో చిత్రీకరించిన చిత్రాలయితే వాటి విడుదల ఖచ్చితంగా ఫిలిం ఫార్మాట్లో జరిగినదై ఉండాలి.నాన్ ఫీచర్ ప్జిల్మ్ ఏ ఫార్మాట్లో చిత్రీకరించినా ప్రదర్శనమాత్రం ఫిలిం లేదా బీటాకాం నాణ్యతతో జరిగి ఉండాలి.ఆయా చిత్రాల హక్కుదారులు మాత్రమే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. దరఖాస్తులు, ఇతర నియమ నిభందనలకోసం www.dff.nic.in అనే వెబ్ సైట్లో చూడవచ్చు. దరఖాస్తులకు చివరి తేదీ:7,సెప్టెంబర్,2007.
శ్రీవెంకట్ బులెమోని.

No comments: