Thursday, August 16, 2007

వివాహ భోజనంబు అనబోతున్న యానిమేషన్ "ఘటోత్కచుడు".

"వివాహ భోజనంబు వింతైన వంటకంబు
వియ్యాలవారి విందు ఒహ్హొహ్హొ నాకెముందు"...
_ అంటూ సాగే "మాయాబజార్" సినీ గీతాన్ని ఏ తెలుగు ప్రేక్షకుడైనా మరచిపోగలడా. మహాభారతంలో లేని కల్పిత కథ 'శశిరేఖా పరిణయం' తో దర్షకబ్రహ్మ కె.వి.రెడ్డి సృస్టించిన మాయాజాలం యాభై సంవత్సరాలుగా తెలుగు ప్రేక్షకున్ని అలరిస్తూనేఉంది.తెలుగు దర్షకుల సృజనాత్మకతకు ప్రతీక ఆ సినిమా.ఆ చిత్రం ఇచ్చిన స్పూర్తితో అలనాటి "మాయాబజార్"కు సహాయ దర్షకుడిగా పనిచేసిన సింగీతం శ్రీనివాసరావు ఇప్పుడు "ఘటోత్కచుడు" అనే మరో సినిమాను రూపొందిస్తున్నారు.అయితే ఇది పూర్తిస్తాయి యానిమేషన్ చిత్రం కావడం దీని ప్రత్యేకత. అలాగే ఈ సినిమాని మోషన్ క్యాప్టరింగ్ టెక్నాలజీ ఆధారంగా నిర్మిస్తుండడం మరో ప్రత్యేకత.గతంలో "మ్యాట్రిక్స్" "హ్యాప్పీ ఫీట్స్"లాంటి ఇంగ్లీషు చిత్రాలలో వాడిన టెక్నాలజీని ఈ చిత్రానికి వాడుతున్నారు.గత రెండు సంవత్సరాలుగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం అతి త్వరలో పూర్తి కానుంది.ఈ అక్టోబరులోనే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సింగీతం శ్రీనివాసరావు దర్షకత్వం వహించిన ఈ చిత్రంలో దలేర్ మెహందీ, బాల సుబ్రహ్మన్యం, శ్రేయా ఘోషల్,సుధీర్ భోన్స్ లే, షాన్ తదితరులు పాటలు పాడారు. సూర్య దేవర వినోద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం ప్రవీణ్ మణి,యానిమేషన్ డైరెక్టర్ ఒవెల్ మినా.
శ్రీవెంకట్ బులెమోని.

No comments: