Monday, August 13, 2007

పోరాఠయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి కథతో చిరంజీవి 150వ చిత్రం.

ఆంధ్రరాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతానికి చెందిన తొలి పోరాఠయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి. గెరిల్లా పోరాఠ యుద్దరీతులు అవలంభించి బ్రిటీశువారికి నిద్రలేకుండా చేసిన గొప్ప దేశభక్తుడాయన. అప్పటి బ్రిటీశ్ ప్రెసిడెన్సీలోని కర్నూలు జిల్లా,కోయిలకుంట్ల ప్రాంతానికి చెందిన ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పాలెగాడుగా జీవించేవాడు.అయితే ప్రజలదగ్గర పన్నులు వసూలుచేసి బ్రిటీశువారికి అప్పగించడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించాడు.దాంతో అప్పటి అధికారులకు ఆయనను భందించి శిక్షించాల్సిందిగా జిల్లా కలెక్టర్ థామస్ మన్రో ఆదేశించగా, అది తెలిసిన ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బ్రిటీశువారికి దొరకకుండా తప్పించుకుని ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని బ్రిటీశువారిపై తిరుగుబాటు చేసాడు. కోయిలకుంట్ల ధనాగారాన్ని కొల్లగొట్టి ప్రజలకు పంచిపెట్టాడు. ఆయుధాగారాలను కొల్లగొట్టి బ్రిటీశువారికి నిద్రలేకుండా చేసాడు.ఉయ్యాలవాడ నరసింహా రెడ్డిని భందించడానికి ప్రత్యేకంగా వచ్చిన బ్రిటీశ్ అధికారి కేప్టెన్ హాల్ట్ నుంచి తప్పించుకుని నైజాం చేరుకుని అక్కడ్నుంచి పోరాటాన్ని సాగించిన ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి నిజాం ప్రభువుల వెన్నుపోటుకు గురై బ్రిటీశ్ వారికి చిక్కి, వారి చేతుల్లో బహిరంగంగా ఉరితీయబడ్డారు. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి ప్రేమ వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే అతన్ని అమితంగా అభిమానించే మరో గిరిజన యువతికూడా బ్రిటీశువారిచేత ఉరితీయబడ్డట్లు తెలుస్తోంది. ఇంతటి మహోన్నతమైన చరిత్ర ఉన్న ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి కథతో తెలుగు ఫిలిం భాద్షా చిరంజీవి 150వ చిత్రం "ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి " రూపుదిద్దుకుంటోంది. చిరంజీవి అత్యంత ప్రతిస్టాత్మకంగా భావిస్తున్న ఈ చిత్రాన్ని ఆయన భార్య శ్రీమతి సురేఖ నిర్మిస్తోఎంది.కాగా ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్షకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పాత్ర పోశించాలని స్వర్గీయ నందమూరి తారక రామారావు గారితోపాటు ప్రస్తుత నాయకులు చిరంజీవి, బాలక్రిష్ణ,వెంకటేశ్ లు భావించగా చివరికి చిరంజీవికి ఆ పాత్ర ధరించే అదృస్టం దక్కింది.

శ్రీవెంకట్ బులెమోని.

1 comment:

Anonymous said...

Really good concept. tThis is goog film for Chiranjivi.