Thursday, August 30, 2007

బాంబు దాడితో భీతిల్లిన తెలుగు సినీ పరిశ్రమ.

హైదరాబాదు జంట బాంబు పేలుళ్ళు తెలుగు సినీ పరిశ్రమను ఆర్థికంగా దెబ్బతీసాయి. శనివారం జరిగిన బాంబు పేలుళ్ళ నేపద్యంలో హైదరాబాదులోని థియేటర్లను వరుసగా మూడు రోజులపాటు మూసి వుంచారు. బుధవారమే థియేటర్లను తిరిగి ఓపెన్ చేయడంతో బాంబు పేలుళ్ళ భీతితో వున్న ప్రేక్షకులు థియేటర్లకు రావడానికే భయపడిన సందర్బాలు ఉన్నాయి. దాంతో ఒక్కసారిగా సినిమాల కలెక్షన్లు దెబ్బతిని థియేటర్లన్నీ ఢీలాపడిపోయాయి. దాంతో తెలుగు సినీ పరిశ్రమలోని అత్యధికులు బాగా కలతచెందినట్లు కనిపించారు.ఇటీవల తన కొత్త చిత్రం విడుదలైన ఎన్.టి.ఆర్ తోసహా చాలామంది బాధపడినట్లు పరిశ్రమలోని అనేకులు చెబుతున్నారు. మొదటి వారం గొప్ప కలెక్షన్లతో రికార్డు నెలకొల్పిన "యమదొంగ" చిత్రం బాంబుల దెబ్బకు దివాలా తీసాయి. పూరీ జగన్నాథ్ తమ్ముడు సాయిరాం శంకర్ నటించిన "హల్లో ప్రేమిస్తారా" చిత్రాన్ని కూడా ఈ కారణంగానే విడుదలను సెప్టెంబర్ 14కు పొడిగించారు. ఇక మిగతా చిత్రాల సంగతి మరీ ధారుణంగా వుందని తెలిసింది. ప్రభుత్వాలపై కక్ష పెంచుకున్న తీవ్రవాదులు అందుకు అమాయకులను బలి చేయడమనే విష సంస్కృతి తొలిగినప్పుడే సామాన్య ప్రజానీకానికి రక్షణ. అప్పుడే సినిమాలైనా, ఇతర వ్యాపారాలైనా ఎలాంటి దెబ్బతినకుండా కొనసాగుతాయి.

No comments: