Friday, August 31, 2007

మహేశ్ బాబు తో రూ.55 కోట్ల ఒప్పందం చేసుకున్న యు.టి.వి.


భారత దేశంలోని ప్రముఖ చిత్ర నిర్మాణ, పంపిణీ సంస్థ అయిన యు.టి.వి. యంగ్ హీరో మహేశ్ బాబుతో రూ.55 కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా యు.టి.వి.సంస్థ నిర్మించే మూడు చిత్రాలలో హీరో మహేశ్ బాబు నటించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన అడ్వాన్స్ కూడా మహే బాబుకు ఇవ్వడం జరిగిందని పద్మాలయా స్టూడియోస్ తెలియజేసింది.

వీరి ఒప్పందంలోని మొదటి చిత్రం జనవరి,2008 లో ప్రారంభమౌతుంది. వీటిని ప్రముఖ యువ దర్శకులతో చిత్రించాలని యు.టి.వి.భావిస్తోందని తెలిసింది. అధికారికంగా తెలియజేయకున్నా ఇప్పటికే ఆయా చిత్రాలకు సంబంధించిన కథా చర్చలు ప్రస్తుతం కొనసాగుతున్నట్లు తెలిసింది. కాగా ప్రస్తుతం మహేశ్ బాబు నటించిన "అతిథి" చిత్రం దేశవ్యాప్త ప్రదర్శన హక్కులను యు.టి.వి.పెద్ద మొత్తం చెల్లించి సొంతం చేసుకుంది. ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది.

తెలుగు సినీ "మల్లీశ్వరి" కత్రినా కైఫ్ ఫోటో గ్యాలరీ.
















నాకూ ఒక్క జాతీయ అవార్డు కావాలి: త్రిష.



టాలీవుడ్, మరియు కోలీవుడ్ లలో క్రేజీ హీరోయిన్ అయిన త్రిష అవార్డుకోసం చకోర పక్షిలా ఎదురు చూస్తొంది. తెలుగు, తమిళ భాషలలో పలు చిత్రాల్లో నటించినా ఇంతవరకు ఒక్క జాతీయ అవార్డయినా రాక పోవడం ఆమెను చాలా బాధ పెట్టినట్లు తెలిసింది. దాంతో ఎలాగయినా ఒక్క జాతీయ అవార్డయినా సాధించాలనే లక్ష్యంతో ఆమె ఒక్క సమాంతర చిత్రం (ఆర్ట్ ఫిల్మ్) లో అయినా నటించాలని నిర్ణయించినట్లు తెలిసింది.

అలాగే ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలలో కూడా తన పాత్ర ప్రాధాన్యతను, ఆయా విషయాలు అవార్డు కమిటీలను తృప్తి పరిచేలా ఉన్నాయా, లేవా అని తరచి తరచి చూస్తున్నట్లు తెలిసింది. కమర్షియల్ చిత్ర నిర్మాతలు అవార్డు విషయాలకు అంత ప్రాధాన్యం ఇవ్వరని తెలిసినా తను మాత్రం ఆశగానే ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం తను తెలుగులో ప్రభాస్ ప్రక్కన "బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై", చిత్రంలో, అలాగే రవితేజ ప్రక్కన నటిస్తోంది. ఇక తమిళంలో విజయ్ తో "కురవి" చిత్రంలో, గౌతం మీనన్ దర్శకత్వం వహిస్తున్న "చెన్నయిల్ ఒరు మలై కాలం" చిత్రంలో, మరియు రాధా మోహన్ చిత్రంలో నటిస్తోంది. కాగా రాధా మోహన్ చిత్రంలో తండ్రీ కూతుళ్ళ మద్యన కొనసాగే ఆత్మీయానుభంధాలు కథాంశంగా నిర్మిస్తుండడం వల్ల ఆ చిత్రం తన కోరిక తీర్చొచ్చనే ఆశతో త్రిష ఉన్నట్లు తెలిసింది.ఎనీ హౌ త్రిషా బెస్ట్ ఆఫ్ లక్.

నటశేఖర కృష్ణ,ఇళయరాజా, అంబరీష్ లకు ప్రతిష్టాత్మక ఎన్.టి.ఆర్. అవార్డు.









ప్రముఖ నటుడు నటశేఖర కృష్ణ, ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా, ప్రముఖ కన్నడ నటుడు, కేంద్ర మంత్రి అంబరీష్ లకు ప్రతిష్టాత్మక ఎన్.టి.ఆర్. అవార్డును రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఐదు సంవత్సరాలక్రితం ప్రభుత్వం ఆపేసిన ఎన్.టి.ఆర్. అవార్డు లను తిరిగి పునరుద్దరిస్తూ వరుసగా మూడు సంవత్సరాలకు ఎన్.టి.ఆర్. అవార్డులను ప్రభుత్వం ప్రకటించింది. ఈ అవార్డు ప్రధానోత్సవంలో భాగంగా 2003,2004,2005వ సంవత్సరాలకు గాను నటశేఖర కృష్ణ,ఇళయరాజా, అంబరీష్ లకు ప్రతిష్టాత్మక ఎన్.టి.ఆర్. అవార్డును ప్రభుత్వం ప్రకటించింది.ఈ అవార్డు కింద రూ.5 లక్షల నగదు, ఒక లక్ష విలువైన వెండి జ్ఞాపికను ప్రదానం చేస్తారు. 2006,2007వ సంవత్సరాలకు గాను ఎన్.టి.ఆర్ అవార్డుల ఎంపికకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఎంపిక చేయవలసి ఉందని ప్రభుత్వం ప్రకటించింది. కాగా ఈ అవార్డులను ఈ నవంబరులో జరిగే నంది అవార్డుల ప్రధాన కార్య క్రమంలో గ్రహీతలకు అందజేస్తారు.

Thursday, August 30, 2007

బాంబు దాడితో భీతిల్లిన తెలుగు సినీ పరిశ్రమ.

హైదరాబాదు జంట బాంబు పేలుళ్ళు తెలుగు సినీ పరిశ్రమను ఆర్థికంగా దెబ్బతీసాయి. శనివారం జరిగిన బాంబు పేలుళ్ళ నేపద్యంలో హైదరాబాదులోని థియేటర్లను వరుసగా మూడు రోజులపాటు మూసి వుంచారు. బుధవారమే థియేటర్లను తిరిగి ఓపెన్ చేయడంతో బాంబు పేలుళ్ళ భీతితో వున్న ప్రేక్షకులు థియేటర్లకు రావడానికే భయపడిన సందర్బాలు ఉన్నాయి. దాంతో ఒక్కసారిగా సినిమాల కలెక్షన్లు దెబ్బతిని థియేటర్లన్నీ ఢీలాపడిపోయాయి. దాంతో తెలుగు సినీ పరిశ్రమలోని అత్యధికులు బాగా కలతచెందినట్లు కనిపించారు.ఇటీవల తన కొత్త చిత్రం విడుదలైన ఎన్.టి.ఆర్ తోసహా చాలామంది బాధపడినట్లు పరిశ్రమలోని అనేకులు చెబుతున్నారు. మొదటి వారం గొప్ప కలెక్షన్లతో రికార్డు నెలకొల్పిన "యమదొంగ" చిత్రం బాంబుల దెబ్బకు దివాలా తీసాయి. పూరీ జగన్నాథ్ తమ్ముడు సాయిరాం శంకర్ నటించిన "హల్లో ప్రేమిస్తారా" చిత్రాన్ని కూడా ఈ కారణంగానే విడుదలను సెప్టెంబర్ 14కు పొడిగించారు. ఇక మిగతా చిత్రాల సంగతి మరీ ధారుణంగా వుందని తెలిసింది. ప్రభుత్వాలపై కక్ష పెంచుకున్న తీవ్రవాదులు అందుకు అమాయకులను బలి చేయడమనే విష సంస్కృతి తొలిగినప్పుడే సామాన్య ప్రజానీకానికి రక్షణ. అప్పుడే సినిమాలైనా, ఇతర వ్యాపారాలైనా ఎలాంటి దెబ్బతినకుండా కొనసాగుతాయి.

టాలీవుడ్ టాప్ హీరోయిన్ ఇలియానా ఫోటో గ్యాలరీ











430 కోట్లు చెల్లించి "షోలే" హక్కులు కొన్న పి.ఎన్.సి.


"షోలే" చిత్రం ఎప్పుడూ సంచలనమే.
ముప్పై రెండు సంవత్సరాల క్రితం విడుదలై కనీవినీ ఎరుగని అఖండ విజయం సాధించిన ఈ చిత్రం డైలాగులు నాటి అత్యధిక భారతీయ ప్రేక్షకులకు కంఠస్థమే. భాషతో సంబంధంలేకుండా అన్ని ప్రాంతాలవారిని ఈ చిత్రం మెప్పించింది.ఈ క్లాసిక్ చిత్రం రాంగోపాల్ వర్మ వల్ల మరోసారి చర్చనీయాంశమైంది.
ఈ చిత్ర హక్కులు పొందకుండా "షోలే" చిత్రాన్ని రీమేక్ కు ఆయన పూనుకోవడంతో వ్యవహారం కొర్టులదాకా వెల్లింది.ఆ తర్వాత ఆయన పేరు మార్చడం, కథ మార్చడం వేరే విషయం. ఇప్పుడు కొత్తగా ఈ చిత్రం రీమేక్ కు పొందిన రేటుతో మరోమారు భారతీయ చిత్ర పరిశ్రమలో సంచలనం సృస్టించింది. "షోలే" చిత్రాన్ని రీమేక్ కోసం చిత్ర నిర్మాత జి.పి. సిప్పీ, దర్శకుడు రమశ్ సిప్పీలకు ఏకంగా రూ.430 కోట్లు చెల్లించి ప్రీతీశ్ నంది కమ్యూనికేషన్స్ (పి.ఎన్.సి.) హక్కులు పొందడం బాలీవుడ్ లో చర్చనీయాంశమైంది. ప్రీతీశ్ నంది కమ్యూనికేషన్స్ సంస్థ "షోలే" చిత్రాన్ని నాలుగు భాగాలుగా చిత్రించడానికి పూనుకుంది. అసలు "షోలె" కు ముందు ఏం జరిగి వుంటుందోననే కథాంశంతో మొదటి భాగాన్ని,అసలు చిత్రాన్ని యధాతతంగా రెండవ భాగాన్ని, త
దనంతరం జరిగే కథతో మూడవ భాగాన్ని చిత్రించడంతోబాటు, అసలు చిత్రాన్ని యధాతతంగా యానిమేషన్ రూపంలో నాలుగవ చిత్రాన్ని నిర్మినంచడానికి పూనుకుంది. వీటికి సంబంధించిన స్క్రిప్ట్ కార్యక్రమాలు అప్పుడే ప్రారంభమయ్యాయని తెలిసింది. దీని షూటింగ్ కూడా అతి త్వరలోనే సెట్స్ పైకి వస్తుంది.
శ్రీవెంకట్ బులెమోని

Wednesday, August 29, 2007

తోడుకోసం ఎదురు చూస్తున్న టాబూ...!?.


బాలీవుడ్ కథానాయిక టాబూకు తోడుకొసం అయినవాళ్ళు ఒకటే వెతుకుతున్నారు. అమ్మాయికి తోడు తేవడమంటే మాటలా... ఎన్నెన్నో విషయాలను పరిగణలోకి తీసుకుని గానీ సరైన జోడీని నిర్ణయించలేమని సంబంధీకులు తెగ వాపోతున్నారు. పాపం చంద్ర సిద్దార్థ కయితే నిద్ర కరువై నెలపైనే గడిచిందని వారి కుటుంబీకులు తెగ ఆందోళన పడుతున్నారు.

ఇదేంటి టాబూకు జొడీని తీసుకురావడం కోసం చంద్ర సిద్దార్థకు నిద్ర కరువవ్వడానికి సంబంధమేమిటని అనుకుంటున్నారా...!.తప్పదు కదండీ చేసుకున్నోడికి చేసుకున్నంత మహదేవా అన్నట్లు చంద్ర సిద్దర్థ తన కొత్త చిత్రం కోసం ఎలాగోలా టాబూనయితే ఒప్పించాడుగానీ ఆమెకు జోడీగా ఎవరినీ ఒప్పించలేక పోతున్నాడు పాపం. ఇప్పటికి అర్థమైందనుకుంటున్నాను. చంద్ర సిద్దర్థ తన కొత్త చిత్రం "ఇదీ సంగతి"కి కథానాయికగా బాలీవుడ్ హీరోయిన్ టాబూను ఒప్పించాడు. ఆమెకు జోడీగా ఇప్పటికి చాలామందినే అనుకున్నా ఎందుచేతనో ఎవ్వరూ ఒప్పుకోవట్లేదని తెలిసింది. చివరికి బాలీవుడ్ నటుడు కె.కె.మీనన్ ను ఒప్పించినా చివరి నిమిశంలో ఆయానా కాదని అన్నారని తెలిసింది. దాంతో కొత్తగా నటుడు అబ్బాస్ దగ్గరికి వెళ్ళొచ్చాడు దర్శకుడు చంద్ర సిద్దార్థ. అబ్బస్ సరే అన్నట్లే తెలిసింది. కానీ డేట్ల సమస్య ఒకటి ముందుకొచ్చింది.దాంతో చివరికి ఏంజరుగుతుందోనని ఈ దర్శకునికి ఒకటే ఆందోళన. అన్నట్లు కె.కె.మీనన్ కూడా చివరికి డేట్ల విషయమే ముందుంచి ఈ చిత్రంలోంచి తప్పుకున్న విశయం టాలీవుడ్ లో అందరికీ తెలిసిందే.

టాలీవుడ్ బాస్ నాగార్జున "డాన్" ఫోటో గ్యాలరీ.






రాజశేఖర్ తమిళ చిత్రం "ఒల్లెలావుంది".





ప్రముఖ నటుడు రాజశేఖర్ నటించిన తెలుగు సినిమా "ఎవడైతే నాకేంటి" ఇప్పుడు తమిళంలోకి డబ్బింగ్ అవుతోంది. తెలుగులో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని తమిళంలో "ఉడంబు ఎప్పడి ఇరుక్కు" పేరుతో డబ్బింగ్ చేస్తున్నారు. దీనికి తెలుగు అర్థం "ఒల్లెలావుంది".
గతంలో రాజశేఖర్ నటించిన "అంకుశం" తమిళంలో "ఇదుదాండా పోలీస్" పేరుతో తమిళంలో ఘన విజయం సాధించింది. ఆ తర్వాత రాజశేఖర్ నటించిన పలు చిత్రాలు తమిళంలో విడుదలై మంచి విజయాన్ని సాధించాయి. ఆ కోవలో ఇప్పుడు "ఎవడైతే నాకేంటి" చిత్రం "ఉడంబు ఎప్పడి ఇరుక్కు" పేరుతో తమిళంలో విడుదల అవుతొంది. కాగా ఈ చిత్రానికి రాజశేఖర్ సతీమని జీవిత దర్శకత్వం వహించింది.

Tuesday, August 28, 2007

శృంగార తార మల్లిక నిర్మాతగా కొత్త అవతారం!.

భారతదేశ అందాల తార మల్లికా శెరావత్ నిర్మాతగా కొత్త అవతారం ఎత్తింది. శృంగార తారగా కుర్రకారు గుండెలు కొల్లగొట్టిన మల్లిక "బ్లూ వెల్వెట్" పేరుతో తన సంస్థను ప్రారంభిస్తున్నట్లు ఇటీవలే ప్రకటించింది.
ప్రస్తుతం "అన్ వీల్డ్" అనే హాలీవుడ్ సినిమాలో నటిస్తున్న మల్లిక తమ సంస్థ నిర్మాణ వ్యవహారాలను తన తమ్ముడు విక్రం కు అప్పజెప్పింది. "బ్లూ వెల్వెట్" సంస్థ అదికారికంగా తన పనులను ప్రారంభించింది. ఒప్పటికే కుప్పలు తెప్పలుగా వస్తున్న ఫిలిం స్క్రిప్ట్ లను స్క్రూటినీ చేసే కార్యక్రమాలు చాలా వేగంగా జరుగుతున్నట్లు తెలిసింది. అయితే అధికారికంగా ఏ చిత్రాన్ని ముందుగా ప్రారంభిస్తారో ఇంతవరకూ తెలుపలేదు. కాకపోతే ఆ చిత్రం తప్పకుండా మల్లిక అందాలను ఆరబోసేది మాత్రం కాదని తెలిసింది. అదే నిజమై
తే కుర్రకారు కొద్దిగా డిసప్పాయింట్ కావలసిందే.

మెగా స్టార్ చిరంజీవి తన కొత్త చిత్రంకోసం తీసుకున్న ఫోటో సెషన్లోంచి కొన్ని ఫోటోలు (Photos Gallery).











రజినీకాంత్, మణిరత్నంల కాంబినేషన్లో మరో "దళపతి".



"శివాజి" తర్వాత రజినీకాంత్ చిత్రంపై తమిళ, తెలుగు సినీ పరిశ్రమల్లో చాలా ఆసక్తి నెలకొని ఉంది. రజినీకాంత్ నటించే తదుపరి చిత్రం ఏమై వుంటుందా అనే ఆసక్తితోబాటు, ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారా అనే ఆసక్తి కూడా సినీ పరిశ్రమలో నెలకొని ఉంది.
ఈ ఆసక్తికి తాత్కాలికంగా సమాధానం దొరికిందని తమిళ పరిశ్రమ చెబుతుండగా, అది నిజమనే సంఘటనలు కూడా జరుగుతున్నాయి. రజినీకాంత్ తదుపరి ప్రముఖ దర్శకుడు మణిరత్నం చిత్రంలోనటించనున్నారని కోలీవుడ్ కొడై కూస్తోంది. భారతీ రాజా, కె.ఎస్.రవి కుమార్ లతో రజినీ చర్చలు జరపడాని బట్టి తన తదుపరి చిత్రం భారీ విజయాన్ని సాధించే చిత్రంగా ఉండాలని రజినీ మంచి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిని నిజం చేస్తూ రజినీకాంత్ ఇటీవల తన "దళపతి" దర్శక, నిర్మాత మణిరత్నంతో చర్చలు జరుపుతున్నారు. గడచిన నెలరోజుల్లో రజినీ ఇంటిలో మణిరత్నంతో మూడు పర్యాయాలు చర్చలు జరిగినట్లు తెలిసింది. ఈ మూడు దఫాలు కూడా అయిదారు గంటలకు పైగా చర్చలు జరగడాన్ని బట్టి ఇది ఖచ్చితంగా రజినీ తదుపరి చిత్రం గురించే తప్ప మరేమీ కాదని కోలీవుడ్ తీర్మానించింది. అదే నిజమైతే వీరిద్దరి కాంబినేషన్లో మరో భారీ "దళపతి" ని ఆశించవచ్చునని సినీ పరిశ్రమలోని పలువురు అనుకుంటున్నారు.

దెయ్యంతో ప్రేమలో పడ్డ హీరో మాధవన్!.




ప్రముఖ తమిళ హీరో మాధవన్ ఓ దెయ్యంతో ప్రమలో పడ్డాడు. దాంతో హీరో మాధవన్ గత నాలుగు నెలలుగా తన ప్రేమలో మునిగి తేలుతూ చెట్ల వెంటా, పుట్టల వెంటా పడి తిరుగుతున్నాడు. ఈ విశయాన్ని అటు తమిళ సినీ పరిశ్రమ, ఇటు తెలుగు సినీ పరిశ్రమ ఎంతో ఆసక్తిగా గమనిస్తోంది. ఈ ప్రేమాయణం ముదిరి ఎప్పుడు పాకాన పడుతుందా, ఆ తర్వాత ఏంజరుగుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


హీరో మాధవన్ ఏంటి, దెయ్యంతో ప్రేమలో పడడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా! అవునండీ బాబూ... మన దయ్యాల సినిమాల దర్శక నిర్మాత రాంగోపాల్ వర్మ తను తాజాగా నిర్మిస్తున్న తెలుగు చిత్రంలో తమిళ హీరో మాధవన్ ను తీసుకువచ్చి తన రొటీన్ దెయ్యంతో ప్రేమాయణాన్ని సాగిస్తున్నాడు. అయితే ఈ సినిమాకు దర్శకుడు మాత్రం రాంగోపాల్ వర్మ కాదు. తన శిశ్యుడైన కోన వెంకట్ కు దర్శకత్వ భాద్యతలను అప్పజెప్పాడు. తన వర్మ కార్పోరేషన్లోనే ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో ఓ దెయ్యం హీరో మాధవన్ తో ప్రేమలో పడుతుంది. తదనంతరం జరిగే సన్నివేశాలు, ఫ్యామిలీ సెంటిమెంటు కూడా కలగలిసిన ఈ చిత్రం ఈ సెప్టెంబర్లోనే విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. చూద్దాం ఈ కొత్త దెయ్యం ఏం చేస్తుందో. అన్నట్లు ఈ సినిమా పేరు చెప్పలేదు కదూ ...ఈ సినిమా పేరు " అది ఒక ఇదిలే".

Monday, August 27, 2007

నగ్నంగా నటించనని చిత్రంలోంచి తప్పుకున్న "నమిత".


తెలుగు, తమిళ చిత్రాలలో కథానాయికగా ఎదిగిన నటి నమిత నగ్నంగా నటించమన్నందుకు ఓ చిత్రంలోంచి తప్పుకుంది.
తెలుగులో పలు చిత్రాలలో నటించిన నమిత ఇప్పుడు తమిళంలో స్థిరపడింది. ఇటీవల "మాయ" అనే ఆంగ్ల చిత్రంలో నటించేందుకు నమిత ఒప్పుకుంది. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను సహితం చిత్రీకరించారు. ఇందులో ఈమె వేశ్యగా నటిస్తొంది. అందుకు తగ్గట్లుగానే ఇందులో కొన్ని మసాలా సన్నివేశాలలో నటించాలని చెప్పిన దర్శక, నిర్మాతలు ఇప్పుడు మొత్తం నగ్నంగా నటించమని చెప్పడంతో తను ఈ చిత్రంలోంచి తప్పుకున్నానని, అలాగే ఇంతకు ముందు తను నటించిన సన్నివేశాలను కూడా చిత్రం లోంచి తొలగించాలని సూచించినట్లు తెలిసింది.దీనికి సంబంధించి ఈ చిత్ర నిర్మాతలు " ఆమె డిమాండ్లను ఒప్పుకోలేం" అంటున్నట్లు తెలుస్తోంది.ముందు ముందు ఏం జరుగుతుందో వేచిచూస్తేగానీ తెలీదు. కానీ ఒక్క విషయం. ఒక చిత్రంలో నటించమని చెప్పగానే వెంటనే ఒప్పుకోకుండా, దానికి సంబంధించిన పూర్వాపరాలను కూలంకశంగా తెలుసుకోవాల్సిన భాద్యత నటీనటులదైతే, ఆయా సినిమాలకు సంబంధించి ముఖ్యంగా అది ఆయా నటీనటుల మర్యాదకు భంగంకలిగించేదయినప్పుడు తాప్పకుండా ఈ విశయం ముందుగానే వారికి తెలియజేసి వారి అనుమతి తీసుకున్నాకే మిగతా కార్యక్రమాలు కొనసాగించడం చిత్రానికి, చిత్రపరిశ్రమకు ఆరోగ్యకరం.

అందాల బొమ్మ ఛార్మీ... "బామ్మ ఛార్మీ"గా మారితే..!!.(Photo Gallery)









Saturday, August 25, 2007

6 కోట్లకు శేఖర్ కమ్ముల "హ్యాప్పీ డేస్" చిత్ర హక్కులు కొన్న దిల్ రాజు.






ప్రతిభావంతుడైన దర్శకుడిగా పర్గాంచిన శేఖర్ కమ్ముల "హ్యాప్పీ డేస్" చిత్రం ప్రదర్శన హక్కులను సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ కం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు తీసుకున్నారు. దీంతో ఈ చిత్రంపై తెలుగు సినీ పరిశ్రమలో అంచనాలు పెరిగాయి. ముక్యంగా దిల్ రాజు చిత్ర హక్కులు తీసుకుంటే అది ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే సెంటిమెంట్ ఇండస్ర్టీలో ఉంది. గతంలో దిల్ రాజు ప్రదర్శన హక్కులు తీసుకున్న "పోకిరి", "ఖుశి" తదితర చిత్రాలు అఖంఢ విజయం సాధించడమే ఈ చిత్రంపై అంచనాలు పెరగడానికి ప్రధాన కారణంగా తెలుగు సినీ పరిశ్రమ చెబుతోంది. ఈ చిత్ర ప్రదర్శన హక్కుల కోసం దిల్ రాజు 6 కోట్ల రూపాయలు చెల్లించినట్లు తెలిసింది.

కమల్ హాసన్ దర్శకత్వంలో తెలుగులో కొత్త చిత్రం...!!

వైవిధ్యమైన నటుడిగా పేర్గాంచిన నటుడు కమల్ హాసన్ త్వరలో తెలుగులో ఓ స్వంత చిత్రాన్ని నిర్మించనున్నారు. తన స్వంత సంస్థ అయిన రాజ్ కమల్ మూవీస్ పతాకంపై నిర్మించనున్న ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలను అతి త్వరలోనే తెలియజేస్తానని ఆయన తెలిపారు.
కాగా ఈ చిత్రం ప్రస్తుతం కమల్ హాసన్ నటిస్తున్న "దశావతారం" చిత్రం పూర్తవగానే ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. ఈ చిత్రాన్ని తానే తన రాజ్ కమల్ మూవీస్ బ్యానరుపై రూపొందించనున్నారు. కాగా ఈ చిత్రానికి తానే దర్శకత్వం వహించే అవకాశం ఉందని తెలిసింది. ఇందుకు సంబంధించిన కథను కూడా ఆయన సిద్దం చేసుకున్నట్లు ఆయనకు దగ్గరివారు తెలియజేస్తున్నారు. అయితే ఈ విషయమై అధికారికమైన సమాచారం మాత్రం ఎవరూ ఇవ్వడం లేదు. గతంలో కమల్ హాసన్ "అంతులేని కథ","సాగర సంగమం", "స్వాతి ముత్యం","శుభ సంకల్పం" తదితర తెలుగులో చిత్రాలలో నటించారు.

మా బాలయ్య పెళ్ళిపెద్దాయెనెనే మా సినిమోళ్ళ ఇంట పండుగాయెనే..!!!. (PHOTO)

కలెక్షన్ కింగ్ బాలయ్య ఇప్పుడు పెళ్ళి పెద్ద అయ్యాడు. 26న జరగనున్న బాలకృష్ణ కూతురు బ్రాహ్మణి, బాలకృష్ణ బావ చంద్ర బాబు నాయుడి కొడుకు లోకేష్ ల పెళ్ళికి తెలుగు సినీ పరిశ్రమ ముస్తాబవుతోంది. ఈ పెళ్ళికి సినీ పరిశ్రమ పెద్దలంతా ఇలా తరలి వస్తే చూడడానికి కనులకు పండగే కాక మరేమవుతుంది.

రాం గోపాల్ వర్మ "అగ్గి" రాజుకుంది.



రాం గోపాల్ వర్మ దర్శకత్వంలో యాడ్ ల్యాబ్స్ నిర్మిస్తున్న "అగ్గి" చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది.
"రాంగోపాల్ వర్మ కీ ఆగ్" పేరుతో హిందీలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం "అగ్గి" గా తెలుగులో విడుదలవనుంది. దీనికి సంబంధించిన డబ్బింగ్ పనులు పూర్తికావస్తున్నాయి.
అలనాటి "షోలే" ప్రేరణతో రూపుదిద్దుకున్న ఈ చిత్రం విభిన్న తరహాలో ఉంటుందని వర్మ అంటున్నారు. అమితాబ్ బచ్చన్ బబ్బర్ సింగ్(అలనాటి గబ్బర్ సింగ్ అన్నమాట) పాత్ర పోశించిన ఇందులో బాలీవుడ్ అగ్ర తారాగణం నటించారు. మళయాల నటుడు మోహన్ లాల్ కూడా ప్రముఖ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఊర్మిళ ఓప్రత్యేక ఐటెం సాంగ్ లో పేక్షకులను మత్తెక్కించనుంది.ఈ చిత్రానికి సంబంధించిన పాటలను ఇటీవలే హైదరాబాదులో విడుదల చేసారు. త్వరలోనే ఈ సినిమా వివిధ భాషలలో భారతీయ ప్రేక్షకులను అలరించనుంది.

Friday, August 24, 2007

మొదటి వారం 11.57 కోట్ల కలెక్షన్లతో రికార్డు సృస్టిస్తున్న ఎన్.టి.ఆర్. "యమదొంగ".





ఎన్.టి.ఆర్. "యమదొంగ" కలెక్షన్ల పరంగా రికార్డు సృస్టిస్తోంది. ప్రారంభంలో సినిమాపై వచ్చిన టాక్ తో ఈ సినిమా యావరేజ్ గా నడుస్తుందని అంతా అనుకున్నా ఇప్పుడు ట్రేడ్ రిపొర్ట్ అందుకు విరుద్దంగా వచ్చింది.
మొదటి వారం ఈ సినిమా మొత్తం రూ.11.57 కోట్ల షేర్ ను ఆంధ్రప్రదేశ్ లో సాధించింది. ఏరియాలవారీగా ఈ సినిమా కలెక్షన్ల వివరాలు.
మొదటి వారం.
నైజాం రూ.4.10 కోట్లు,రాయలసీమ రూ.2.81 కోట్లు,వైజాగ్ రూ.85 లక్షలు,ఈస్ట్ గోదావరి రూ.66 లక్షలు, వెస్ట్ గోదావరి రూ.70 లక్షలు, క్రిష్ణ రూ.92 లక్షలు, గుంటూరు రూ.95 లక్షలు, నెల్లూరు రూ.58 లక్షలు.చాలా రోజుల తర్వాత వచ్చిన ఈ విజయంతో ఎన్.టి.ఆర్. చాలా సంతోషంగా ఉన్నట్లు తెలిసింది.

దసరాకు తెలుగు సినిమాలో రసవత్తర పోటీ: లక్ష్యం 150 కోట్లు.





తెలుగు సినీ పరిశ్రమలో దసరా సందడి ప్రారంభమైంది. ఈ దసరాకు విడుదలవుతున్న చిత్రాల వ్యాపార లక్ష్యం రమారమి నూటయాభై కోట్ల రూపాయలు. ఈ దసరా సీజన్ లో పెద్ద హీరోల చిత్రాలకు పోటీగా యువ హీరోల చిత్రాలు విడుదలవుతున్నాయి.


కాగా అన్ని చిత్రాలూ ప్రతిష్టాత్మకమైనవే కావడం ఇక్కడ గమనార్హం. ముఖ్యంగా "పోకిరీ" లాంటి సంచలన విజయం సాధించిన చిత్ర కథానాయకుడు మహేష్ బాబు నుంచి వసున్న "అతిథి" చిత్రం ఒకవైపు పోటీలో ఉండగా, "పోకిరీ" చిత్రానికి దర్శకత్వం వహించిన పూరీ జగన్నాథ్, చిరంజీవి తనయుడు రాం చరన్ తేజ హీరోగా వైజయంతి బ్యానరుపై నిర్మిస్తున్న "చిరుత" మరోవైపు పోటీలో ఉంది.
ఇక అక్కినేని నాగార్జున హీరోగా, "మాస్" దర్శకుడు లారెన్స్ రాఘవ దర్శకత్వంలో రూపొందుతున్న "డాన్"పై సినీ పరిశ్రమలో, ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక విక్టరీ ఇంటి పేరుగా మార్చుకున్న హీరో వెంకటేశ్, బోయపాటి సీను దర్శకత్వంలో నటిస్తున్న "తులసి రెడ్డి"పై కూడా భారీ అంచనాలే ఉన్నాయి.
మరోవైపు నందమూరి నటకిశోరం "ఒక్క మగాడు"తో సంచలనాలు సృస్టించడానికి తెర తీయబోతున్నట్లు కొన్ని వర్గాల కథనం. వెరసి ఈ దసరాకు తెలుగు నేలపై విడుదలవబోతున్న చిత్రాలన్నీ ప్రతిష్టాత్మకమైనవే. చిన్న సినిమాలను దృస్టిలో పెట్టూకోకున్నా ఈ చిత్రాల వ్యాపార అంచనాలు సుమారు 150 కోట్లు.
ఇక "అండర్ డాగ్"లా (దీనినే చాపకింద నీరులా అనికూడా అనుకోవచ్చు) శేఖర్ కమ్ముల "హ్యాప్పీ డేస్" చిత్రం ఈ అన్ని చిత్రాలకు మంచి పొటీ ఇవ్వడంకోసం సిద్దమవుతోంది. ఇంతక్రితం వచ్చిన శేఖర్ కమ్ముల చిత్రాలు "ఆనంద్", "గోదావరి" చిత్రాలు తెలుగునాట ఆర్థికంగా మంచి విజయాన్ని సాధించాయి.దాంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి.
ఏదేమయినా ఇప్పుడు రానున్న దసరా సీజన్ తెలుగు సినిమాలకు మంచి పోటీనిస్తుండగా, తెలుగు ప్రేక్షకునికి మంచి వినోదాన్ని అందివ్వనున్నాయి. సుమారు నెలన్నరలోగా విడుదలవనున్న ఈ అన్ని చిత్రాలలో ఏది ఖార్సయిన చిత్రమో, ఏది ఖాళీ చిత్రమో తేల్చడానికి తెలుగు ప్రేక్షకుడు సిద్దంగానే ఉన్నాడు. ఇక సినిమావారిదే ఆలశ్యం. ఈ దసరా వారికి సంతోశాన్నిచ్చే మధురమైన దసరా అవుతుందో లేక బాధతో మరువలేని దసరా అవుతుందో వేచి చూస్తేగానీ తెలీదు.
శ్రీవెంకట్ బులెమోని.

సినీ నేపధ్యంలోని మిస్టరీ కథతో "కాళిదాసు".

భారతీయ సినీ పరిశ్రమలోని అత్యంత ప్రతిభావంతులైన కళాకారులు దర్శకుడు భారతీరాజా, కథానాయకుడు అర్జున్, ప్రతిభాశాలి నానా పటేకర్ లు కలిసి చేస్తున్న చిత్రం "కాళిదాసు". "బొమ్మలాట" పేరుతో తమిళ, హిందీ భాషలలో నేరు చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రం తెలుగులో డబ్బింగ్ చిత్రంగా విడుదలవుతొంది.శ్రీ లక్ష్మీ శ్రీనివాస పిక్షర్స్ పతాకంపై ,కె.లక్ష్మీనారాయణ రెడ్డి దీనిని తెలుగులో అందిస్తున్నారు.
గతంలో భారతీరాజా దర్శకత్వంలో వచ్చిన "ఎర్ర గులాబీలు","టిక్ టిక్ టిక్" చిత్రాల తరహాలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఈ నెలలోనే విడుదలచేయడానికి ప్రయత్నిస్తున్నారు.హీరో అర్జున్ సరసన కాజల్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి హిందీ సంగీత దర్శకుడు హిమేశ్ రేష్మానియా సంగీతం సమకూరుస్తున్నారు. ఓ దర్శకుడి జీవితంలో జరిగిన సంఘటనలను క్రోఢీకరిస్తూ మిస్టరీ చిత్రంగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో కొన్ని భారతీరాజా నిజ జీవితంలోని ఘట్టాలుకూడా చోటు చేసుకోవచ్చునని తమిళ పరిశ్రమ చెబుతోంది.
విభిన్న చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొని ఉంది.

Thursday, August 23, 2007

అమెరికాలో ఈ నెల 31న విడుదలవనున్న "వనజ".


నిరుపేద బెస్త కుటుంబంలోని పద్నాలుగేళ్ళ బాలిక వనజ తను ద్యాన్సర్ కావాలని కనే కలల చుట్టూ నడిచే కథతో హృద్యంగా చిత్రించిన "వనజ" చిత్రం ఈ నెల 31న అమెరికాలో విడుదలవుతోంది. కొలంబియా యూనివర్సిటీ విద్యార్థి అయిన రజినీశ్ తన విద్యాభ్యాస సమయంలో రాసుకున్న కథతో చిత్రించిన ఈ సినిమా బెర్లిన్ చిత్రోత్సవంలో పాల్గొని ఉత్తమ తొలి చిత్రంగా అవార్డును అందుకుంది. ఆ తర్వాత తొలి ఉత్తమ చిత్ర దర్శకునికి ఇచ్చే "గొల్లపూడి శ్రీనివాస్" స్మారక అవార్డును కూడా ఈ చిత్రం అందుకుంది. హైదరాబాదుకు చెందిన తెలుగు వాడైన రజినీశ్ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం ఇంతవరకు తెలుగులో, తెలుగు నేలపై విడుదలకు మాత్రం నోచుకోలేకపోయింది. ఈ చిత్రాన్ని తెలుగు నేలపైకూడా విడుదల చేస్తే బావుంటుంది. అప్పుడే ఓ మంచి చిత్రాన్ని తెలుగు వారికి చూయించిన సంతృప్తి దర్శక నిర్మాతలకు దక్కుతుంది. కనిక ఆ మార్గంలో వారు ప్రయత్నిస్తే బావుంటుంది. అయితే ఇప్పటికే వారు ప్రయత్నించి ఉంటారు.కాని ఆ ప్రయత్నం వల్ల కమర్శియల్ చిత్రాలకు అలవాటు పడ్డ డిస్త్రిబ్యూటర్లను, బయ్యర్లను వారు సంతృప్తి పరచక పోవడమో, లేక ఈ కథ పట్ల వారు సంతృప్తిగా లేక పోవడమో జరిగి ఉంటుంది. అయితే ఒక్క డిస్త్రిబ్యూటర్లు, బయ్యర్లే సమస్తం కాదు. ఇంకా చాలా దారులు ఉంటాయి. ఆ రకంగా కూడ ప్రయత్నించి త్వరలోనే విజయం సాధిస్తారని కోరుకుంటున్నాం.
శ్రీవెంకట్ బులెమోని.

పన్నెండు మంది కథానాయికలతో బాలకృష్ణ సయ్యాట.
















పన్నెండు మంది కథానాయికలతో బాలకృష్ణ సయ్యాటాడనున్నాడు. దర్శకేందృడు కె.రాఘవేంద్ర రావు స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న "రంగా- పాండురంగా" చిత్రంలో కథానాయకుడు బాలకృష్ణ సరసన పన్నెండు మంది కథానాయికలు నటించనున్నారు. స్వర్గీయ ఎన్.టి.ఆర్. నటించిన "పాండురంగమహత్మ్యం" చిత్రం ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో బాలకృష్ణ భక్తుడిగా, భగవంతుడిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న "ఒక్క మగాడు" చిత్రం పూర్తవగానే ఈ చిత్రం ప్రారంభమవుతుంది. కాగా ఈ చిత్రాన్ని వచ్చే సంవత్సరం వేసవి సెలవులకు విడుదలచేయాలని దర్శక,నిర్మాత కె.రాఘవేంద్ర రావు నిర్ణయించుకున్నారు. దీనికి సంబందించిన స్క్రిప్ట్ కార్యక్రమాలను రచయిత జె.కె.భారవి ఇటీవలే పూర్తిచేసారు. ఇప్పటికే కథానాయికలలో స్నేహ,ప్రియా మణి,పార్వతి మెల్టన్ ల కాల్షీట్లు బుక్ చేయడం జరిగింది.

డి.వి.డి అమ్మకాలలో వరల్డ్ టాప్ టెన్.




2006-07వ సంవత్సరం ప్రపంచవ్యాపంగా జరిగిన డి.వి.డి. అమ్మకాలలో వరల్డ్ టాప్ టెన్ గా నిలిచిన చిత్రాల జాబితాను ఇటీవలే రెడ్ కార్పెట్ విడుదల చేసింది. వాటి వివరాలు.


1. పైరేట్స్ ఆఫ్ కరేబియన్ -డెడ్ మ్యన్స్ చెస్ట్.
2. కార్స్.
3.ది క్రానికల్ ఆఫ్ నార్నియా.
4.హ్యారీ పొట్టర్ & గాబ్లెట్ ఆఫ్ ఫైర్.
5.ఓవర్ ది హెడ్జ్.
6.కింగ్ కాంగ్.
7.వెడ్డింగ్ క్రాషెస్.
8.వాక్ ది లైన్.
9.ఐస్ ఏజ్ ది మెల్ట్ డౌన్.
10.ది లిటిల్ మెర్మైడ్.










గ్లామర్ దృశ్యాల చిత్రీకరణకూ "సై" అన్న కమలినీ ముఖర్జీ.

"ఆనంద్" మంచి కాఫీలాంటి సినిమా, "గోదావరి" లాంటి అభినయ ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటించిన కథానాయిక కమలినీ ముఖర్జీ ఇక ముందు గ్లామర్ సన్నివేశాల్లో కూడా నటించడానికి "సై" అంటోంది. ప్రస్తుతం షూటింగ్ లో ఉన్న నరేష్ చిత్రంతో సహా పలు తెలుగు చిత్రాలలో, పలు తమిళ చిత్రాలలో నటిస్తున్న కమలినీ ముఖర్జీ కొద్దికాలం క్రితం కమల్ హాసన్ తో నటించిన చిత్రంలో కూడా కొంత శృంగారాన్ని ఒలకబోసినట్లు తమిళ పరిశ్రమ తెలియజేస్తొంది. ఇక ముందు కూడా తను నటించే అన్ని భాషల చిత్రాలలో అవసరమైన పక్షంలో శ్రంగార సన్నివేశాలలో నటించేందుకు తను సిద్దంగా ఉన్నట్లు తన దగ్గరి వారితో చెబుతోందని తెలిసింది.






థామస్ ఆల్వా ఎడిసన్ "కినెటోస్కోప్" ప్రదర్శన.

1928లో థామస్ ఆల్వా ఎడిసన్ తను కనుక్కున్న "కినెటోస్కోప్"ను డెమాన్ స్టేషన్లో ప్రదర్శిస్తున్న దృశ్యం. అతనికి సహకరిసున్న వ్యక్తి జార్జ్ ఈస్ట్ మన్. థామస్ ఆల్వా ఎడిసన్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన జార్జ్ ఈస్ట్ మన్ తదనంతర కాలంలో మోషన్ ఫిల్మ్ ను మరింత డెవలప్ చేసాడు.

Wednesday, August 22, 2007

హిందీలోకి అనువదించనున్న రజినీకాంత్ "శివాజి".


తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన "శివాజి" చిత్రం ఇప్పుడు హిందీలోకి అనువాదం కానుంది. ఎ.వి.ఎం.సంస్థ రజినీకాంత్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో నిర్మించిన ఈ "శివాజి" చిత్రం ఆది నుంచి వార్తల్లో నిలుస్తూనే ఉంది. ముందుగా నిర్మాణ పరంగా, ఆ తర్వాత చిత్ర హక్కులకు వసూలైన అత్యధిక రేట్ల పరంగా మరియు విడుదల అనంతరం కలెక్షన్లపరంగా ఇది వార్తల్లోకెక్కింది. ఇప్పుడు ఈ చిత్రం హిందీలోకి అనువాదం కాబోతూ అక్కడ ఎన్ని సంచలనాలు సృస్టిస్తుందోననే ఆసక్తిని అటు ప్రేక్షకులలో, ఇటు పరిష్రమలో కలిగిస్తోంది. కాగా ఈ హిందీ "శివాజి" కోసం రజినీకాంత్ అమితాబ్ లా నటించే పాటను చిత్రీకరించనున్నారు. అలాగే ఈ చిత్ర నిడివిని కొంత తగ్గించనున్నట్లు తెలిసింది. ఈ హిందీ "శివాజి"కి సంబందించిన డబ్బింగ్ పనులు ఇటీవలే ప్రారంభమయ్యాయి. కాగా ఈ హిందీ "శివాజి" రానున్న దీపావలికి విడుదల చేయనున్నట్లు తెలిసింది. అయితే తెలుగులో విడుదలైన ఈ "శివాజి" చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు అంతగా ఆదరించలేదు. కొన్ని ఏరియాల డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలే మిగిలిన విషయం జగమెరిగిన సత్యం.

తమిళనాట విజయ దుంధుభి మ్రోగిస్తున్న "శంకర్ దాద జిందాబాద్".


చిరంజీవి నటించిన "శంకర్ దాద జిందాబాద్" చిత్రం తమిళనాట విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. చిరంజీవి 148వ చిత్రంగా జెమిని ఫిలిం సర్క్యూట్ ప్రభుదేవా దర్శకత్వంలో నిర్మించిన "శంకర్ దాద జిందాబాద్" చిత్రాన్ని తమిళనాడులో పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్ విడుదల చేసింది. ఈ చిత్ర ప్రారంభోత్సవం చెన్నైలోని ఉడ్ లాండ్ పిరమిడ్ థియేటర్లో జులై 27న ఘనంగా జరిగింది. గత ఇరవై రోజులకుపైగా ఈ చిత్రాన్ని తమిళనాడులోని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తూ ఈ "శంకర్ దాద జిందాబాద్"ను విజయపథంలో నడిపిస్తున్నారు.తెలుగునాట సాధారణ విజయాన్ని నమోదు చేసుకున్న ఈ చిత్రం తమిళనాట మాత్రం ఘనవిజయాన్ని సాధించడం ఒకింత ఆశ్చర్యం వేసినా అక్కడ సాధించిన విజయం చిరంజీవి అభిమానులను ఆనందానికి గురిచేస్తొంది. ఈ విజయానికి చిరంజీవి సహితం సంతృప్తిగా ఉన్నట్లు తెలిసింది.తమిళ నాట చిత్ర విజయానికి ప్రధానంగా పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్ సి.ఒ.ఒ.ఆర్ వెంకట కృష్ణన్,మార్కెటింగ్ ప్రెసిడెంట్ జి.గౌతంల ప్రణాళికా బద్దమైన ప్రచారమే ప్రధాన కారనమని సంస్థ పేర్కొంటోంది. మార్కెటింగ్ ఇంచార్జ్ జ్యోతి, డిజైనర్ మాడసామి లతోబాటు ఇతర మార్కెటింగ్ సిబ్బంది చేసిన కృషి ఫలితంగా ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది.
శ్రీవెంకట్ బులెమోని.

విడుదలకు సిద్దమవుతున్న విక్రం "భీమ".


క్రేజీ హీరో విక్రం, తమిళనాడులో స్థిరపడిన తెలుగువాడైన దర్శకుడు లింగు స్వామి, ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నంల కాంబినేషన్లో రూపుదిద్దుకున్న "భీమ" విడుదలకు సిద్దమవుతోంది. తమిళంలో నిర్మించిన పితామగన్, అన్నియన్ చిత్రాల తెలుగు అనువాద చిత్రాలు శివపుతృడు,అపరిచితుడు లుగా విడుదలై ఘనవిజయం సాధించాయి. తెలుగు వాడైన విక్రం ఇప్పుడు తమిళ, తెలుగు భాషలలో ఏకకాలంలో నిర్మించిన ఈ "భీమ"లో నటించాడు. ఇందులో విక్రం సరసన త్రిశ జంటగా నటించింది. గుండెధైర్యమే బలమనుకునే ఒ మొరటోడికి సంబంధించిన కథతో రూపొందిన ఈ చిత్రంలో త్రిశ ది అదిక ప్రాధాన్యతగల పాత్ర అని నిర్మాత తెలియజేస్తున్నారు.

నిర్మాతల మండలి అధ్యక్షునిగా భరద్వాజ.



తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలికి నూతన కార్యవర్గం ఎన్నికైంది. 2007-09 సంవత్సరానికి గాను ఈ ఆగస్టులో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఆరోగ్యకరమైన పద్దతిలో ఎన్నికలు లేకుండానే నూతన అధ్యక్షుడిని, ఇతర కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమౌతోంది. నూతన అధ్యక్షులుగా తమ్మారెడ్డి భరద్వాజ ఎన్నికవగా, ఉపాధ్యక్షులుగా వడ్డే రమేష్, శ్యాంప్రసాద్ రెడ్డి, ప్రధాన కార్యదర్శులుగా టి.వి.డి.ప్రసాద్,సి.వి.రెడ్డి, సం యుక్త కార్యదర్శులుగా జి.వి.హెచ్.ప్రసాద్,వజ్జా శ్రీనివాస రావు, కోషాధికారిగా సి.కల్యాణ్ లు ఎంపికయ్యారు. సి.అశ్వినీ దత్, కె.యస్.రామా రావు,అల్లు అరవింద్,పి.వి.కిషోర్,డి.సురేష్ బాబు, కె.ఎల్.నారాయణ,కైకాల నాగేశ్వర రావు,కె.అశోక్ కుమార్,ఎం.యల్.కుమార్ చౌదరి, కొడాలి వెంకటేశ్వర రావు,నట్టి కుమార్,ఎస్.మల్లికార్జున రావు, టి.రామసత్యనారాయణ,పి.కల్యాణ్,కామిని వెంకటేశ్వరరావు లు కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు.

Tuesday, August 21, 2007

అక్టోబర్ 3వ తేదీన రానున్న మహేష్ బాబు "అతిథి".

క్రిష్ణ ప్రొడక్షన్స్ బ్యానరుపై ఘట్టమనేని రమేష్ బాబు మహేష్ బాబు హీరోగా, అమృతా రావు హీరోయిన్ గా నిర్మించిన "అతిథి" చిత్రం అక్టోబర్ 3వ తేదీన విడుదల కానుంది. ఈ చిత్రానికి మణి శర్మ అందించిన పాటలు బావున్నాయనే టాక్ పరిశ్రమలో వచ్చింది.ఈ పాటలను సెప్టెంబర్ 5వ తేదీన విడుదల చేయనున్నారు. వీటిని సుప్రీం మ్యూజిక్ సంస్థ విడుదల చేయనుంది. సురెందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.

పిరమిడ్ విడుదల చేయనున్న "చందమామ" చిత్రం.


పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్ సంస్థ కృష్ణవంశీ దర్శకత్వం వహించిన "చందమామ" చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్ అంతటా విడుదల చేస్తోంది. నవదీప్,శివ బాలాజీ, కాజల్, సింధు మీనన్ నాయికా నాయకులుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని రేఖా కంబైన్స్ సమర్పణలో తేజ సినిమా పతాకంపై సి.కల్యాన్, ఎస్.విజయానంద్ లు నిర్మించారు.
ఈ సినిమా పాటలను సోమవారం విడుదల చేసారు. కాగా ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 6న విడుదల చేయనున్నారు. హృద్యమైన ప్రేమ కథతో నిర్మించిన ఈ చిత్రం గతంలో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చిత్రాలలాగే ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నిర్మాతలంటున్నారు. ఇందులో నాగేంద్ర బాబు మరియు ఆహుతి ప్రసాద్ లకు చాలా అద్భుతమైన పాత్రలు లభించినట్లు తెలిసింది. సకుటుంబ సమేతంగా చూడదగ్గ ప్రేమ కథగా రూపొందించిన ఈ చిత్రానికి కె.ఎం.రాధాకృష్నన్ సంగీతాన్ని అందించారు.
శ్రీవెంకట్ బులెమోని.



వైజాగ్ లో విడుదలవనున్న "డాన్" ఆడియో.


టాలీవుడ్ రొమాంటిక్ హీరో అక్కినేని నాగార్జున నటించిన 'డాన్ ' పాటలను వైజాగ్ లో విడుదల చేయనున్నారు.కీర్తి క్రియేషన్స్ పతాకంపై కె.ఎల్.కుమార్ చౌధరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి లారెన్స్ రాఘవ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి సంగీతాన్నికూడా లారెన్స్ అందించడం మరో విశేషం. అనుష్క షెట్టి నాగార్జునకు జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో ల్యాండ్ మాఫియాగూర్చి చర్చించారని తెలిసింది. గతంలో నాగార్జున, లారెన్స్ ల కాంబినేషన్లో వచ్చిన "మాస్" మంచి విజయాన్ని సాధించడంతో ఈ చిత్రంపై పరిశ్రమలో భారీ అంచనాలే నెలకొన్నాయి.
శ్రీవెంకట్ బులెమోని.

"బుజ్జిగాడు-మేడ్ ఇన్ చెన్నై" గా వస్తున్న ప్రభాస్.


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ "బుజ్జిగాడు-మేడ్ ఇన్ చెన్నై" గా త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, కె.ఎస్.రామా రావుల కాంబినేషన్లో నిర్మించే చిత్రంలో ప్రభాస్ నటిస్తున్న విషయం తెలిసిందే. ముందుగా ఈ చిత్రానికి "షాడో" అనే పేరు అనుకున్నప్పటికీ దీనిని ఇప్పుడు "బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై" గా మార్చారు.ఈ నెల 23వ తేదీన ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఇందులో ప్రభాస్ కు జతగా త్రిష,సుజనలు నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.కాగా ఈ చిత్రాన్ని జనవరి,4వ తేదీన విడుదల చేయనున్నారు.
శ్రీవెంకట్ బులెమోని.

Monday, August 20, 2007

చిరంజీవి తనయుని "చిరుత"లో "క్రిష్" పోలికలు...!?.




చిరంజీవి తనయుడు రాం చరన్ తేజ్ ను కథానాయకునిగా పరిచయం చేస్తున్న "చిరుత" సినిమాలో హిందీ చిత్రం "క్రిష్" పోలికలు చాలా ఉన్నాయని తెలిసింది. చిరంజీవికి మంచి గుర్తింపునిచ్చిన చిత్రం "అడవి దొంగ" మరుయు హృతిక్ రోషన్ "క్రిష్" ల సమ్మేళనమే ఈ "చిరుత" చిత్రం అని తెలుగు సినీ పరిశ్రమలోని పలువురు పెద్దలు కోడై కూస్తున్నారు. ఇందులో రాం చరన్ తేజ ఒక ధనవంతుల ఏకైక సంతానమై ఉంటాడు.కొన్ని వేల ఎకరాల భూమి, పాడి పంటలకు వీరు హక్కుదారులు.వీరి ఆస్థిని కాజేయాలనుకున్న దగ్గరివారు విహార యాత్రకు వీరిని అడవులకు తీసుకువెల్లి చంపివేయగా, వారి కొడుకైన చిన్నారి రాంచరన్ తేజ మాత్రం వారి నుంచి తప్పించుకుని అడవిలోకి వెలతాడు. అడవిలోని జంతువులకు అతను బలి అయ్యుంటాడని భావించిన ఆ హంతహులు వెళ్ళి పోతారు. తదనంతరం అడవిలోని జంతువులకు దగ్గరైన ఆ బాబు అడవిలోనే పెరిగి పెద్దవాడవుతాడు. కాల క్రమంలో జరిగిన పలు మలుపుల తర్వాత అతని దగ్గరున్న చైన్, మరియు పుట్టుమచ్చల అధారంగా అతన్ని గుర్తించిన అతని బందువులు అతని తల్లిదండ్రుల హత్యకు ప్రతీకారం తీర్చుకునేలా అతన్ని తీర్చిదిద్దుతారు. అయితే ఇతనికి అడవిలో వుండగానే కొన్ని అద్భుత శక్తులు వచ్చి అతను మహా బలవంతుడవుతాడని, ఆ శక్తులు తన శతృవులను ఎదిరించడానికి అతనికి ఉపయోగపడతాయని తెలిసింది. తదనంతర కథనమంతా డర్శకుడు పూరీ జగన్నాథ్ స్టైల్లో వుంటాయని తెలిసింది.ఈ చిత్ర కథను గోప్యంగా వుంచడానికి షూటింగ్ మొత్తం జమైకా అడవులలో,బ్యంకాక్ అడవులలో చిత్రీకరించారు. ఇక పాటలను న్యూజిలాండ్ లో చిత్రీకరించారు. ఈ పాటలను ఈ నెల 22న మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. కాగా ఇందులో చిన్నప్పటి 'చిరుతాగా పూరి జగన్నాథ్ కుమారుడు నటించాడు. ఇందులోని ఫైట్లు మహాద్భుతంగా వచ్చాయని సినీ విలేఖరులు అంటున్నారు. కాగా ఈ "చిరుత" తెలుగు సినీ ప్రేక్షకులను ఎలా అలరిస్తాడో వేచిచూస్థేగానీ తెలీదు.

శ్రీవెంకట్ బులెమోని.


మలేషియాలో జరగనున్న తెలుగు సినీ మ్యూజికల్ నైట్.

మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్(మా), మరుయు మలేషియా కల్చరల్ ఫౌండేషన్లు సం యుక్తంగా నవంబర్ 17, 18వ తేదీలలో మలేషియాలో తెలుగు సినీ తారల మ్యూజికల్ నైట్ నిర్వహించనున్నారు.తెలుగు సినీ పరిష్రమ 75 సంవత్సరాలు పూర్తిచేకోవడం, అలాగే మలేషియా స్వాతంత్ర్యం సంపాదించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా ఈ మ్యూజికల్ నైట్ ను నిర్వహిస్తున్నట్లు మా అధ్యక్షులు నాగేంద్ర బాబు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చే మొత్తాన్ని పేద కలాకారుల సంక్షేమానికై వెచ్చిస్థామని ఆయన తెలియజేశారు.
శ్రీవెంకట్ బులెమోని.



తెలుగు సినిమా పీపుల్ చాయిస్ అవార్డ్స్ కు శ్రీకారం.

తెలుగు సినిమా చరిత్రలో తొలిసారిగా ప్రజలే న్యాయనిర్నేతలుగా "తెలుగు సినిమా పీపుల్ చాయిస్ అవార్డ్స్" కు శీకారం చుట్టారు.
తెలుగు సినిమా పీపుల్ చాయిస్ అవార్డ్స్ కమిటీ కన్వీనర్లు మహేశ్వర రావు, భగీరథ, యాంకర్ సుమ లు అంతర్జాతీయ స్థాయిలో జరిగే ఓటింగ్ ఆధారంగా ఈ అవార్డుల ఎంపిక జరుగుతుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు తమకు నచ్చిన చిత్రాలను ఎంపిక చేసుకుని ఎస్.ఎం.ఎస్ ల ద్వారా విజేతలను ఎన్నుకునే కొత్త ఒరవడికి తెలుగులో తాము శ్రీకారం చుడుతున్నామని వారు తెలిపారు.తొలిసారిగా 2006 ఉగాది నుంచి 2007 ఉగాది వరకు విడుదలైన ( శ్రీ రామదాసు నుంచి జగడం వరకు) చలన చిత్రాలలోని ఉత్తమ చిత్రాలను ఎస్.ఎం.ఎస్. ల ద్వారా ప్రేక్షకులు ఎన్నుకోనున్నారని వారు తెలిపారు.అయితే దీనికి సంబంధించిన విధి విధానాలను ఇంకా రూపొందించాల్సి ఉంది.వాటి వివరాలు త్వరలోనే తెలుస్తాయి.
శ్రీవెంకట్ బులెమోని.



డిజిటల్ రూపం లోకి రాజ్ కపూర్ చిత్రాలు.


భారతీయ ప్రముఖ దర్శకులలో ఒకరైన స్వర్గీయ రాజ్ కపూర్ దర్శకత్వం వహించిన "బాబీ", "ప్రేం రోగ్","సత్యం శివం సుందరం" చిత్రాలు డిజిటల్ రూపాన్ని సంతరించుకోనున్నాయి.చలన చిత్రాలను డిజిటల్ రూపంలోకి మార్చడంలో అగ్రగామి సంస్థ అయిన యూఫో మీడియా సంస్థతో ఆర్.కె.స్టూడియోస్ సంస్థ ఈ మేరకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది.ఈ సినిమాలను డిజిటల్ రూపంలోకి మార్చడంతోబాటు 70 ఎం.ఎం.చిత్రాలుగా మార్చడానికి వీరు ఒక అవగాహనకు వచ్చారు.సినిమా డిజిటలీకరణ పూర్తయింతర్వాత వీటిని డిజిటల్ థియేటర్లలో ప్రదర్శించడానికి రాజ్ కపూర్ కుమారుడు రణధీర్ కపూర్ నిర్ణయించారు. దీనివల్ల రాజ్ కపూర్ చిత్రాలను ఎలాంటి నష్టం కలగకుండా కాపాడటంతోబాటు భావి తరాలకు అందించినవారమవుతామని ఆయన ఆశ పడుతున్నట్లు తెలుస్తోంది. అలాగే రాజ్ కపూర్ ఇతర చిత్రాలను కూడా డిజిటలీకరణ చేస్తామని ఆయన అంటున్నారు.
శ్రీవెంకట్ బులెమోని.

తెలుగులో రానున్న "హోస్ట్".
























ఇండో ఓవర్సీస్ పతాకంపై "హోస్ట్' చిత్రాన్ని తెలుగులోకి అనువదించి విడుదలచేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కొరియాలో విజయభేరి మ్రోగించిన ఈ చిత్రం గత సంవత్సరం జూన్ లో జరిగిన కేన్స్ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించారు. ఆసియా చలన చిత్రోత్సవాలలో ఈ చిత్రానికి ఉత్తమ నటుడి అవార్డుతోపాటు అనేక అభినందనలు వచ్చాయి. ఐదు కోట్ల జనాభా ఉన్న కొరియాలో మొదటి మూడు వారాలలో కోటి మందికిపైగా సినిమాను థియేటర్ కి వెల్లి మరీ చూడడం చిత్ర గొప్పదనాన్ని తెలియజేస్తోందని సినీ పరిశీలకులు అంటున్నారు. కొరియన్లు అమితంగా ఇష్టపడ్డ ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు కూడా నచ్చుతుందో లేదో కాలమే చెబుతుంది.
శ్రీవెంకట్ బులెమోని.



శరవేగంతో నిర్మిస్తున్న మహేష్ బాబు "అతిథి".

"పోకిరి" సంచలన విజయం తర్వాత మహేష్ బాబు నటిస్తున్న "అతిథి" చిత్రంపై తెలుగునాట భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సురెందర్ రెడ్డి దర్శకుడు. బొంబాయి నటి అమృతా రావు కథానాయికగా తెలుగు తెరకు పరిచయమౌతోంది. యు.టి.వి.సంస్థ భారీ మొత్తం చెల్లించి ఈ చిత్ర దేశవ్యాప్త ప్రదర్శన హక్కులను కైవసం చేసుకుంది. ఈ చిత్ర షూటింగ్ ప్రస్థుతం హైదరాబాద్ లో జరుగుతోంది. చక్కటి కుటుంబంలోని ఆప్యాయతలు, అనురాగాల కలయికగా ఈ చిత్రం ఉంటుందని తెలిసింది.ముంబై నటుడు మురళీ శర్మ ఈ చిత్రం ద్వారా విలన్ పాత్రలో పరిచయమవుతున్నారు.ఇందులో ఆశిష్ విద్యార్థి,సునీల్,బ్రహ్మానందం,వేణు మాధవ్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.ఈ చిత్రానికి మాటలు అబ్బూరి రవి,రచనా సహకారం వక్కంతం వంశీ,సంగీతం మణిశర్మ,కెమెరా సమీర్ రెడ్డి. కాగా ఈ చిత్ర ఆడియోను సెప్టెంబర్ లో విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.అక్టోబర్లో చిత్రం విడుదల అవుతుంది.

శ్రీవెంకట్ బులెమోని.

Friday, August 17, 2007

రీమాసేన్ కు "గ్లామర్ క్వీన్" అవార్డు.

"చిత్రం" సినిమాతో సినీ పరిశ్రమకు పరిచయమైన హేరోయిన్ రీమా సేన్ కు ఇటీవల "గ్లామర్ క్వీన్" అవార్డు వచ్చింది. ఇటీవల సింగపూర్లో జరిగిన సినీ నటుల అవార్డు కార్యక్రమంలో ఆమెకు ఈ అవార్డును ప్రధానం చేసారు.పలు తెలుగు, తమిళ చిత్రాలలో నటించిన రీమాసేన్ ఇటీవల చిత్రాల పరంగా బాగా వెనకబడింది.తెలుగులో "చిత్రం" తర్వాత "మనసంతా నువ్వే" చిత్రం ఆమెకు బాగా గుర్తింపునిచ్చాయి. అయితే ఆతర్వాత చెప్పుకోదగ్గ విజయాలేమీ ఆమెకు రాలేదు.తమిళంలో పలు చిత్రాలలో నటించినా "చెల్లామె" చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత ఎందుచేతనో ఆమెకు అవకాశాలే రాలేదు. కాగా ప్రస్తుతం ఆమె సెల్వరాఘవన్ దర్శకత్వంలో నిర్మిస్తున్న "ఆయిరత్తిల్ ఒరువన్" చిత్రంలో నటిస్తోంది.ఇప్పుడు వచ్చిన అవార్డుతో రీమాసేన్ చాలా సంతోషంగా ఉన్నట్లు తెలిసింది.తను ఎలాంటి డ్రెస్ వేసినా అందంగానే ఉంటానని అందుకే తనకీ అవార్డు వచ్చిందని ఆమె తెలిసిన వారిదగ్గరల్లా చెబుతూ మురిసిపోతోంది.
శ్రీవెంకట్ బులెమోని.

పోలీస్ అధికారి "రాఘవన్"గా వస్తున్న కమల్ హాసన్.






కమల్ హాసన్, జ్యోతిక, కమలినీ ముఖర్జీ హీరో, హీరోయిన్లుగా నటించిన తమిళ చిత్రం "వేట్టియాడు వేలయాడు" తెలుగులో "రాఘవన్" పేరుతో విడుదల కానుంది.సెవెంత్ ఛానెల్ కమ్యూనికేషన్స్ పతాకంపై మాణిక్యం నారాయణ్ సమర్పణలో కె.వి.వి.సత్యనారాయణ, శాఖమూరి పాండురంగారావులు ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.ఈ నెల 31వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రముఖనటుడు ప్రకాశ్ రాజ్ మరో పోలీస్ అధికారిగా కమల్ కు సహకరించే పాత్రలో నటించినట్లు తెలుస్తొంది.తెలుగులో వెంకటేశ్ నటించిన "ఘర్షణ" చిత్రానికి దర్శకత్వం వహించిన గౌతం ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

శ్రీవెంకట్ బులెమోని.



అమెరికాకు చెందిన 'బిజినెస్ వీక్' సర్వేలో "టాప్ 50"లో రజినీకంత్.





భారతీయ తొలి యాభై మంది ప్రముఖుల్లో తమిళ సూపర్ స్టార్ రజినీకంత్ స్థానం సంపాదించారు. భారత 60వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అమెరికాకు చెందిన 'బిజినెస్ వీక్' పత్రిక భారతదేశంలో ఆర్థికంగా, సామాజికంగా అగ్రగాములుగా ఉండటంతో పాటు అత్యంత ప్రజాదరణ కలిగిన మొదటి 50మంది ప్రముఖులు ఎవరనే అంశంపై ప్రత్యేక సర్వే నిర్వహించింది.సినీ, రాజకీయ, క్రీడ,వ్యాపార, వైద్య, శాస్త్రీయ రంగాలలో జరిగిన ఈ సర్వేలో సూపర్ స్టార్ రజినీకంత్ స్థానం సంపాదించుకున్నారు. ఈ పత్రిక రజినీకాంత్ ను దక్షిణాది చలన చిత్ర మహరాజుగా అభివర్నించింది.ఇటీవల విడుదలైన "శివాజి" చిత్రం ప్రపంచవ్యాప్తంగా అందరి దృస్తిని ఆకర్శించిన నేపద్యంలో జరిగిన ఈ సర్వేలో "శివాజి" రజినీ ఫేం పెరిగేందుకు దోహదపడిందని పేర్కొంది.బాలీవుడ్ ఎవర్ గ్రీన్ స్టార్ అమితాబ్ బచ్చన్,షారుఖ్ ఖాన్,అమీర్ ఖాన్,ఐశ్వర్యరాయ్ తదితరులు కూడా ఈ జాబితాలో స్థానం సంపాదించారు.

శ్రీవెంకట్ బులెమోని.

Thursday, August 16, 2007

జానపద చిత్ర రూపాల్లో మహా నటులు శ్రీ ఎన్.టి.ఆర్ గారు.

మహానటులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తన నట జీవితంలోని పౌరానికాలు, సాంఘికాలు మరియు జానపదాల ద్వారా ప్రజల హృదయాలలో చెరిగిపోని ముద్ర వేశారు. ఆయన నటించిన జానపదాలలోని మచ్చుకు రెండు చిత్రాలు.



పవన్ కళ్యాన్,ఎ.ఆర్.రెహమాన్,ఎస్.జె.సూర్యల కాంబినేషన్లో వస్తున్న "పులి".



యువతరంలో పవన్ కళ్యాన్ కు ఉన్న ఫాలోయింగ్ చలాఎక్కువ. ఇక సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ ఉన్న ఫాలోయింగ్ మహాద్భుతం. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో "సత్యాగ్రహి" రూపొందుతుందని అనుకున్నా ఆ ప్రాజెక్ట్ తాత్కాలికంగా వాయిదా పడింది. ఆ తర్వాత వారిద్దరూ కలిసి పని చేస్తున్న సినిమా " పులి". పవన్ కళ్యాన్ సంచలన చిత్రం " ఖుషి"కి దర్శకత్వం వహించిన ఎస్.జె.సూర్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.దాంతో పవన్ అభిమానులు మరో కనువిందు చేసే అద్భుత చిత్రం వీరినుంచి వస్తుందని ఆషిస్తున్నారు. ఈ చిత్ర కథ, కథనాలను దర్శకుడు ఎస్.జె.సూర్య సంవత్సరం క్రిందటే సిద్దం చేసుకుని పవన్ కళ్యాన్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు.ఫైనల్ గా ఈ చిత్రం అతి త్వరలోనే షూటింగ్ ప్రారంభించుకోనుందని తెలిసి పవన్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని సింగనమల రమేష్ నిర్మిస్తున్నారు.
శ్రీవెంకట్ బులెమోని.

అక్కినేని నాగార్జున "లవ్ స్టోరీ ఇన్ పార్ట్ 1,2,3...!".


తెలుగు సినిమా మన్మధునిగా పేర్గాంచిన అక్కినేని నాగార్జున అతి త్వరలో "లవ్ స్టోరీ ఇన్ పార్ట్ 1,2,3...!" అనబోతున్నాడు. ప్రతిభావంతుడైన దర్శకుడిగా పేర్గాంచిన గుణ్ణం గంగరాజు స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న "లవ్ స్టోరీ ఇన్ పార్ట్ 1,2,3...!" చిత్రంలో మరోమారు లవర్ బాయ్ గా నాగార్జున ప్రేక్షకులను పలకరించనున్నాడు. గతంలో "లిటిల్ సోల్డ్జర్స్","అమ్మ చెప్పింది" చిత్రాలకు దర్శకత్వం వహించడంతోబాటు జాతీయ అవార్డు సాధించిన "ఐతే" చిత్రానికి మాటలు కూడా అందించిన గుణ్ణం గంగరాజు తన జస్ట్ యెల్లో మీడియా వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నాగార్జున నటిస్తున్న "డాన్" చిత్రం పూర్తయింతర్వాత ఈ చిత్రం ప్రారంభమౌతుందని తెలిసింది.
శ్రీవెంకట్ బులెమోని.

భక్తుడినుండి భగవంతునివరకు నాగార్జున ప్రయానం.


"కొండలలో నెలకొన్న కోనేటి రాయుడువాడు
కొండలంటి వరములు గుప్పెడు వాడూ"
అంటూ అన్నమయ్యలో,
"పలుకే బంగారమాయెనా కొదండరామా
పలుకే బంగారామాయెనా
పలుకే బంగారామాయె పిలచిన పలుకవేమి"
అంటూ 'శ్రీ రామదాసు"లో ప్రేక్షకులను భక్తిపారవష్యంలో ఓలలాడించిన అక్కినేని నాగార్జున ఇప్పుడు భగవంతుని పాత్రలోకి పరాకాయ ప్రవేషం చేయనున్నారు. అక్కినేని నాగార్జునకు ఆప్తమితృడైన ఎం.మోహన్ బాబు నిర్మిస్తున్న చిత్రంలో నాగార్జున భగవంతుని పాత్రకు ఒప్పుకున్నారు. మోహన్ బాబు తనయుడు విష్ను వర్ధన్ బాబు ఇందులో భక్తునిగా నటిస్తున్నారు. శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్షర్స్ పతాకంపై నిర్మించనున్న ఈ చిత్రం ఇంగ్లీషులో అఖండ విజయం సాధించిన "బ్రూస్ ఆల్మైటీ" చిత్రం ఆధారంగా నిర్మితమవుతోందని తెలిసింది. "చింద్రముఖి" లాంటి విజయవంతమైన చిత్రానికి దర్శకత్వం వహించిన పి.వాసు దీనికి దర్షకత్వం వహిస్తున్నారు. 2008 జనవరి తర్వాత ఈ సినిమా షూటింగ్ ప్రారంభమౌతుందని తెలిసింది.
శ్రీవెంకట్ బులెమోని.

వివాహ భోజనంబు అనబోతున్న యానిమేషన్ "ఘటోత్కచుడు".

"వివాహ భోజనంబు వింతైన వంటకంబు
వియ్యాలవారి విందు ఒహ్హొహ్హొ నాకెముందు"...
_ అంటూ సాగే "మాయాబజార్" సినీ గీతాన్ని ఏ తెలుగు ప్రేక్షకుడైనా మరచిపోగలడా. మహాభారతంలో లేని కల్పిత కథ 'శశిరేఖా పరిణయం' తో దర్షకబ్రహ్మ కె.వి.రెడ్డి సృస్టించిన మాయాజాలం యాభై సంవత్సరాలుగా తెలుగు ప్రేక్షకున్ని అలరిస్తూనేఉంది.తెలుగు దర్షకుల సృజనాత్మకతకు ప్రతీక ఆ సినిమా.ఆ చిత్రం ఇచ్చిన స్పూర్తితో అలనాటి "మాయాబజార్"కు సహాయ దర్షకుడిగా పనిచేసిన సింగీతం శ్రీనివాసరావు ఇప్పుడు "ఘటోత్కచుడు" అనే మరో సినిమాను రూపొందిస్తున్నారు.అయితే ఇది పూర్తిస్తాయి యానిమేషన్ చిత్రం కావడం దీని ప్రత్యేకత. అలాగే ఈ సినిమాని మోషన్ క్యాప్టరింగ్ టెక్నాలజీ ఆధారంగా నిర్మిస్తుండడం మరో ప్రత్యేకత.గతంలో "మ్యాట్రిక్స్" "హ్యాప్పీ ఫీట్స్"లాంటి ఇంగ్లీషు చిత్రాలలో వాడిన టెక్నాలజీని ఈ చిత్రానికి వాడుతున్నారు.గత రెండు సంవత్సరాలుగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం అతి త్వరలో పూర్తి కానుంది.ఈ అక్టోబరులోనే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సింగీతం శ్రీనివాసరావు దర్షకత్వం వహించిన ఈ చిత్రంలో దలేర్ మెహందీ, బాల సుబ్రహ్మన్యం, శ్రేయా ఘోషల్,సుధీర్ భోన్స్ లే, షాన్ తదితరులు పాటలు పాడారు. సూర్య దేవర వినోద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం ప్రవీణ్ మణి,యానిమేషన్ డైరెక్టర్ ఒవెల్ మినా.
శ్రీవెంకట్ బులెమోని.
పిరమిడ్ సంస్థ దేశవ్యాప్తంగా ( కేరళ, కర్నాటక మినహా) విడుదల చేస్తున్న మళయాళ చిత్రం "అలిభాయ్". ఇందులో మోహన్ లాల్ ప్రధాన పాత్ర పోశించగా నవ్యా నాయర్, గోపికలు కథానాయికలుగా నటించారు.

ధూమపాన సన్నివేశాలను నిషేధించిన "వాల్ట్ డిస్నీ".

ఆబాల గోపాలాన్ని ఎంతగానో అలరించే వాల్ట్ డిస్నీ సంస్థ ప్రపంచం ఆహ్వానించదగ్గ నిర్ణయాన్ని ప్రకటించింది. ఇకపై వాల్ట్ డిస్నీ సంస్థ నిర్మించే చలన చిత్రాలలో ధూమపాన చిత్రాలను చిత్రీకరించరు. ధూమపానాన్ని వ్యతిరేకించే వారితోపాటు న్యాయనిపునులు సూచించిన సలహాలను పాటించిన వాల్ట్ డిస్నీ సంస్థ ఈ నిర్నయాన్ని తీసుకుంది.వాల్ట్ డిస్నీతోబాటు అనుబంధ సంస్థలైన టచ్ స్టోన్, మిరామాక్స్ సంస్థలు చిత్రించే సినిమాలలో కూడా ధూమపాన దృష్యాలను నిషేధించారు. ఇప్పటికే నిర్మించిన చిత్రాలలో ధూమపాన సన్నివేషాలు వచ్చే సందర్భంలో వాటి డి.వి.డి.లలో ఆయా సన్నివేషాల సమయంలో ధూమపాన వ్యతిరేకమైన సందేషాలను కనిపించేలా చేస్తారు. సో, పిల్లల జీవితాలలో ఓ భాగమైన వాల్ట్ డిస్నీ సంస్థ వారి భవిష్యత్తుపై ధూమపాన ప్రభావం పడకుండా తనదైన జాగ్రత్తలు తీసుకుంది. బెస్ట్ ఆఫ్ లక్ వాల్ట్ డిస్నీ.
శ్రీవెంకట్ బులెమోని.

ఇండియన్ పనోరమా పోటీలకు ఆహ్వానం.

38వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఇండియన్ పనోరమా విభాగంలో ప్రదర్శించడం, మరియు పోటీ విభాగంలో ప్రదర్శించడానికి భారతీయ చలన చిత్రాల నిర్మాతలనుండి డైరెక్టరేట్ ఆఫ్ ఫిలిం ఫెస్టివల్స్ ఐ.పి. విభాగం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.ఈ విభాగం ఎంపిక చేసిన చిత్రాలను ఈ సంవత్సరం అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించడంతోబాటు ఈ సంవత్సరం జరిగే వివిధ జాతీయ, అంతర్జాతీయ చిత్రోత్సవాలలో పాల్గోవడానికి వీటిని అనుమతిస్తారు.ఏ భారతీయ భాషలలో అయినా రూపొందించిన ఫీచర్,నాన్ ఫీచర్ చిత్రాలను ఇండియన్ పనోరమా విభాగానికి అనుమతిస్తారు. అయితే ఈ చిత్రాలు 1,సెప్టెంబర్,2006 నుంచి 31,ఆగస్టు,2007 మద్యన రూపొందించినవై ఉండాలి.ఫీచర్ ఫిల్మ్ 35 ఎం.ఎం.,16 ఎం.ఎం. లేదా వైడర్ గేజ్ ప్ఫార్మాట్లో చితీకరించినవై ఉండాలి.డిజిటల్ రూపంలో చిత్రీకరించిన చిత్రాలయితే వాటి విడుదల ఖచ్చితంగా ఫిలిం ఫార్మాట్లో జరిగినదై ఉండాలి.నాన్ ఫీచర్ ప్జిల్మ్ ఏ ఫార్మాట్లో చిత్రీకరించినా ప్రదర్శనమాత్రం ఫిలిం లేదా బీటాకాం నాణ్యతతో జరిగి ఉండాలి.ఆయా చిత్రాల హక్కుదారులు మాత్రమే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. దరఖాస్తులు, ఇతర నియమ నిభందనలకోసం www.dff.nic.in అనే వెబ్ సైట్లో చూడవచ్చు. దరఖాస్తులకు చివరి తేదీ:7,సెప్టెంబర్,2007.
శ్రీవెంకట్ బులెమోని.

Tuesday, August 14, 2007

అమితాబ్ 'డాన్" రీమేక్ లో నటించనున్న ఎన్.టి.ఆర్.

బాలీవుడ్ బిగ్-బి అమితాబ్ బచ్చన్ నటించిన "డాన్" ప్రేక్షకుల స్మృతిపథంలో ఎప్పటికీ నిలిచే ఉంటుంది.ఈ కథ ఆధారంగా స్వర్గీయ ఎన్.టి.ఆర్.తో ఆయన మేకప్ మెన్ పి.పీతాంభరం నిర్మించిన "యుగంధర్" చితం అప్పట్లో సంచలనవిజయం సాధించింది.ఇదే కథ ఆధారంగా తమిళంలో రజినీ కాంత్ హీరోగా "భిల్లా" చిత్రాన్ని నిర్మించగా అది కూడా సంచలన విజయం సాధించింది.ఇదే కథతో అజిత్ హీరోగా తమిళంలో నిర్మించిన చిత్రం సహితం విజయంసాధించగా, ఇటీవలే బాలీవుడ్ భాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా నిర్మించిన లేటెస్ట్ "డాన్" సహితం సంచలన విజయాన్ని సాధించింది. ఇదే కథతో ఇప్పుడు తెలుగులో మరోచిత్రం రూపుదిద్దుకోనుంది.సీనియర్ దర్షకుడు పి.వాసు దర్షకత్వంలో ఆయన సోదరుడు పి.విద్యాసాగర్ గజలక్ష్మి ఫిలింస్ పతాకంపై నిర్మించనున్న ఈ చిత్రంలో జూనియర్ ఎన్.టి.ఆర్ కథానాయకునిగా నటించనున్నారు.ప్రస్థుతం వైజయంతి మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న "కంత్రీ" చిత్రంలో నటిస్తున్న ఎన్.టి.ఆర్ తదనంతరం ఈ చిత్రంలో నటిస్తారని వినికిడి.కాగా గతంలో సీనియర్ ఎన్.టి.ఆర్ తో "యుగంధర్" చిత్రాన్ని నిర్మించిన పి.పితాంబరం ప్రస్థుత దర్షక,నిర్మాతలకు స్వయానా తండ్రి కావడం గమనార్హం.
శ్రీవెంకట్ బులెమోని.

స్వర్గీయ ఎన్.టి.ఆర్.నిజ జీవిత సంఘటనలతో బాలకృష్ణ సినిమా...!?.

స్వర్గీయ నందమూరి తరక రామారావు నిజ జీవిత సంఘటనల ఆధారంగా బాలకృష్ణ నటిస్తున్న " ఒక్కమగాడు" చిత్రం రూపుదిద్దుకుంటోంది. సినీపరిష్రమలోని కొందరు, మరి కొందరు పాత్రికేయులు కూడా ఇది నిజమనే అంటున్నారు. ఇదే విషయాన్ని ఇండియా గ్లిట్జ్.కాం లో కూడా ప్రచురించారు.వై.వి.యస్.చౌదరి నిర్మాణ, దర్షకత్వంలో బొమ్మరిల్లు పతాకంపై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో ఎన్.టి.ఆర్.నిజ జీవితంలోని సినీ,రాజకీయ సంఘటనలను సమ్మిళితంచేసి అత్యద్భుతంగా ఈ చిత్రకథను తయారుచేసినట్లు తెలిసింది. ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారు.ఇందులో బాలకృష్ణ సరసన సిమ్రాన్,అనుష్క,కరిష్మా కొఠక్ లు కథానాయికలుగా నటిస్తున్నారు.
శ్రీవెంకట్ బులెమోని.

కేరళలో ప్రారంభమౌతున్న "పిరమిడ్" సంస్థ.

పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్ సంస్థ కేరళ గడ్డపై అడుగుపెడుతోంది. భారతదేశంలోని అతిపెద్ద థియేటర్ చైన్ లింకింగ్ సంస్థ అయిన పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్ ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్, కర్నాటక,తమిళనాడు,హర్యానాలతోబాటు మలేషియాలలో కూడా విస్తరించింది.పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్ కేరళలో చలనచిత్ర నిర్మాణం,పంపిణీ,ప్రదర్షణ విభాగాలలో సేవలందించనుంది. ఈ నెల 18వ తేదీన పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్ కేరళ రాస్ట్ర కార్యాలయాన్ని రాస్త్ర విద్య,సాంస్కృతిక శాఖామంత్రి ఎం.ఎ.బేబి ప్రారంభిస్థారు.అలాగే పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్ సంస్థ మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కథానాయకునిగా నిర్మించనున్న తొలి మళయాళ చిత్ర ప్రారంభోత్సవం జరుపనున్నారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్ సంస్థల చైర్మెన్ వి.నటరాజన్,డైరెక్టర్ ఎన్.నారాయణన్,మేనేజింగ్ డైరెక్టర్ సామినాధన్, ట్రివేండ్రం మేయర్ జియన్ బాబు, కేరళ రాస్ట్ర కళాచిత్ర అకాడెమీ చైర్మెన్ కె.ఆర్.మోహన్ లు పాల్గొంటారు.కేరళ రాష్ట్ర కార్యాలయ చిరునామా:
పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
59/2082,ట్యాబ్ రోడ్,కొచ్చి-682016,కేరళ,ఇండియా.
శ్రీవెంకట్ బులెమోని.

తులసి రెడ్డిగా వస్తున్న విక్టరీ వెంకటేశ్.

టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్ నటించిన నూతన చిత్రానికి "తులసి రెడ్డిగా " పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.ఈ చిత్ర టాకీపార్ట్ పూర్తయింది. పాటలను ఆస్ట్రేలియాలో చిత్రీకరిస్తున్నారు. వెంకటేశ్ సరసన నయనతార నటిస్తున్న ఈ చిత్రం రాయలసీమ ఫ్యాక్షనిజం నేపద్యంలో, కుటుంబ పరమైన భావోద్వేగాల సమ్మేళనంతో రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రానికి బోయపాటి శీను దర్శకత్వం వహిస్తుండగా సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానరుపై డి.సురేష్ బాబు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం దసరా సందర్బంగా అక్టోబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.
శ్రీవెంకట్ బులెమోని.

శేఖర్ కమ్ముల "హ్యాపీ డేస్" ఓవర్సీస్ హక్కులుకొన్న ఆర్.కె.ఫిలింస్.

శేఖర్ కమ్ముల నూతన చిత్రం "హ్యాపీ డేస్" ఓవర్సీస్ హక్కులను ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్ర రావుకు చెందిన ఆర్.కె.ఫిలింస్ పొందింది. సున్నితమైన కథ, కథనాలతో అద్భుతంగా చిత్రాలను మలచడంలో అందెవేసిన శేఖర్ కమ్ముల ఓవర్సీస్ హీరో.ఆయన గత చిత్రాలు "ఆనంద్", "గోదావరి" పెద్ద హీరోలను మించిన కలెక్షన్లను అమెరికాలో సాధించాయి. ఇప్పుడు ఆయన నిర్మిస్తున్న "హ్యాపీ డేస్"లో అంతా కొత్తవారిని పరిచయం చేస్తున్నారు. బిగ్-ఎఫ్.ఎం.తో కలిసి 'స్టార్ హంట్' నిర్వహించి సందేశ్, నిఖిల్, వంశీ కృష్ణ, రాహుల్ లను ఎన్నుకుని వారితో ఈ చిత్రాన్ని నిర్మించారు.కాలేజి నేపద్యంలో భావాలు, భావావేశాలు, భావోద్వేగాల సమ్మేళనంగా నిర్మించిన ఈ చిత్రానికి మిక్కి.జె.మేయర్ అందించిన సంగీతం బాగా ఉందని తెలుగు సినీ పరిశ్రమ చెబుతోంది. శేఖర్ కమ్ముల నుంచి మనం మరో "ఆనంద్", "గోదావరి" లాంటి చిత్రాలను ఆశించొచ్చు.
శ్రీవెంకట్ బులెమోని.

Monday, August 13, 2007

పోరాఠయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి కథతో చిరంజీవి 150వ చిత్రం.

ఆంధ్రరాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతానికి చెందిన తొలి పోరాఠయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి. గెరిల్లా పోరాఠ యుద్దరీతులు అవలంభించి బ్రిటీశువారికి నిద్రలేకుండా చేసిన గొప్ప దేశభక్తుడాయన. అప్పటి బ్రిటీశ్ ప్రెసిడెన్సీలోని కర్నూలు జిల్లా,కోయిలకుంట్ల ప్రాంతానికి చెందిన ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పాలెగాడుగా జీవించేవాడు.అయితే ప్రజలదగ్గర పన్నులు వసూలుచేసి బ్రిటీశువారికి అప్పగించడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించాడు.దాంతో అప్పటి అధికారులకు ఆయనను భందించి శిక్షించాల్సిందిగా జిల్లా కలెక్టర్ థామస్ మన్రో ఆదేశించగా, అది తెలిసిన ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బ్రిటీశువారికి దొరకకుండా తప్పించుకుని ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని బ్రిటీశువారిపై తిరుగుబాటు చేసాడు. కోయిలకుంట్ల ధనాగారాన్ని కొల్లగొట్టి ప్రజలకు పంచిపెట్టాడు. ఆయుధాగారాలను కొల్లగొట్టి బ్రిటీశువారికి నిద్రలేకుండా చేసాడు.ఉయ్యాలవాడ నరసింహా రెడ్డిని భందించడానికి ప్రత్యేకంగా వచ్చిన బ్రిటీశ్ అధికారి కేప్టెన్ హాల్ట్ నుంచి తప్పించుకుని నైజాం చేరుకుని అక్కడ్నుంచి పోరాటాన్ని సాగించిన ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి నిజాం ప్రభువుల వెన్నుపోటుకు గురై బ్రిటీశ్ వారికి చిక్కి, వారి చేతుల్లో బహిరంగంగా ఉరితీయబడ్డారు. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి ప్రేమ వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే అతన్ని అమితంగా అభిమానించే మరో గిరిజన యువతికూడా బ్రిటీశువారిచేత ఉరితీయబడ్డట్లు తెలుస్తోంది. ఇంతటి మహోన్నతమైన చరిత్ర ఉన్న ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి కథతో తెలుగు ఫిలిం భాద్షా చిరంజీవి 150వ చిత్రం "ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి " రూపుదిద్దుకుంటోంది. చిరంజీవి అత్యంత ప్రతిస్టాత్మకంగా భావిస్తున్న ఈ చిత్రాన్ని ఆయన భార్య శ్రీమతి సురేఖ నిర్మిస్తోఎంది.కాగా ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్షకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పాత్ర పోశించాలని స్వర్గీయ నందమూరి తారక రామారావు గారితోపాటు ప్రస్తుత నాయకులు చిరంజీవి, బాలక్రిష్ణ,వెంకటేశ్ లు భావించగా చివరికి చిరంజీవికి ఆ పాత్ర ధరించే అదృస్టం దక్కింది.

శ్రీవెంకట్ బులెమోని.

"యమదొంగ" లో నటిస్తున్న సీనియర్ ఎన్.టి.ఆర్.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్.టి.ఆర్. నటించిన యమదొంగ ప్రేక్షకులను అలరించనుంది. జూనియర్ ఎన్.టి.ఆర్.క్రియేటివ్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మరియు సినిమా పరిశ్రమలో భారీ అంచనాలు ఉన్నాయి.ఈ చిత్రంలో సీనియర్ ఎన్.టి.ఆర్. తిరిగి ఆంధ్ర ప్రేక్షకులను అలరించనున్నారు. ఇందులో సీనియర్ ఎన్.టి.ఆర్.తో బాటు మోహన్ బాబు,కుష్బూ,ప్రియామని, మమతా మోహన్ దాస్,రంభలతో బాటు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి.అలాగే ఈ చిత్రంలో జూనియర్ ఎన్.టి.ఆర్. ఒక పాటకూడా పాడడం ఆయన అభిమానులను అలరించే విషయం.ఈ చిత్రం ఈ ఆగస్టు 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది.

తొలి తెలుగు చిత్రం " భక్త ప్రహ్లాద" చిత్రం యొక్క పోస్టర్


Saturday, August 11, 2007

పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్.

భారతీయ వినోద పరిశ్రమలో సినిమా ప్రముఖస్థానాన్ని అధిరోహిస్థోంది.భారతీయ చలనచిత్ర నిర్మాణ, పంపినీ వ్యవస్థ 2010వ సంవత్సరానికల్లా $.5,00,00,00,00,000/- ( సుమారు రూ.2,30,00,00,00,00,000/-లకు) చేరుకుంటుందని ఒక అంచనా.ఇందులో ధక్షిణ భారతదేశ చలనచిత్ర నిర్మాణ, ప్రదర్శనల భాగం సుమారు 60 శాతం.చలనచిత్ర పరిష్రమను ప్రధాణంగా నిర్మాణం, పంపిణీ, ప్రదర్శన అనే మూదు భాగాలుగా విభజించగా, అందులో నిర్మానం, ప్రదర్శన ప్రముఖపాత్ర వహిస్తున్నాయి.
పిరమిడ్ భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఒక మైలురాయి. వినియోగదారునికి అత్యంత విలువనిచ్చే సంస్థ. ప్రస్తుతం పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్ (పి.యెస్.టి.ఎల్) భారతదేశంలోని అతి పెద్ద థియేటెర్ చైన్ లింక్ సంస్థ.ధక్షిణ భారతదేశంలోని 260 పట్టణాలలో 371 థియేటర్లు కలిగి ఉంది. 44.15 లక్షల చదరపు అడుగుల వ్యాసార్థంగల స్థలంలో సుమారు 2.41 లక్షల సీట్లు ఆయా థియేటర్లలో ప్రేక్షకులకు సౌకర్యాన్ని కలిగిస్తున్నాయి. పిరమిడ్ సంస్థ 2010వ సంవస్త్సరానికి దేశంలోని 1550 పట్టణాలలోని 2000 థియేటర్లలో డిజిటల్ అప్ లింకింగ్ ద్వారా అత్యున్నత సాంకేతిక పరిగ్నానంద్వారా చిత్రప్రదర్శనలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
అతిపెద్ద థియేటర్ చైన్ లింక్ సంస్థ అయిన పిరమిడ్, డిస్ట్రిబ్యుషంద్వారా వచ్చే ఆదాయాన్ని ఆస్వాదించడంపైన కాక, ఆయా థేటర్లలో సౌకర్యాలను ఆధునీకరించడం, స్క్రీన్లను ఆధునీకరించడంతోబాటు నాన్-బాక్స్ ఆఫీస్ సెగ్మెంట్లోంచి ఆదాయాన్ని పొందడంకోసం ప్రయత్నిస్తోంది.
పిరమిడ్ సంస్థ మలేసియాలో ప్రవేశించి థియేట్ర్లు మల్టిప్లెక్సులు నిర్వహించడంతోబాటు స్థానిక నిర్మాతలు, నిర్మాణ సంస్థలతో కలిసి చలనచిత్రాలను నిర్మిస్థోంది.
2007-08వ ఆర్థిక సంవత్సరంలోని ప్రథమార్థంలో 1 ఏప్రిల్ 2007 నుంచి 30 జూన్ 2007 వరకు లిస్టింగ్ లో ప్రథమస్థానంలో నిలిచిన సంస్థ రూ.12,271.43 లక్షలు కూడగట్టుకుంది.ఈబీఐడీయె రూపంలో రూ.2334.99 లక్షలు పోగవగా, పన్నులు చెల్లించిన అనంతరం కంపెనీ లాభం రూ.1600.77 లక్షలు. కంపెనీ ఈపీయెస్ ప్రథమ క్వార్టర్లో రూ.5.66గాను, సంవత్సరానికి ఈపీయెస్ రూ.22.64గా నమోదైంది.
ఇటీవల పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్ సంస్థ సింగపూర్ స్తాక్ ఎక్సేంజ్లో నమోదై 90 మిలియన్ డాలర్లకు వ్యాపారాన్ని విస్థరించుకుంది.పిరమిడ్ సంస్థ పిరమిడ్ సాయిమిర ప్రొడక్షన్ లిమిటెద్ పేరుతో సినీనిర్మానంలోకి కూడా అదుగుపెట్టింది.సినిమాల నిర్మాణంలో హాలీఉడ్ స్తూడియోను అనుసరిస్తూ సంవస్థరానికి 100 చిత్రాలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
పిరమిడ్ సంస్థ ఈ ఆర్థిక సంవస్థరానికి అదనంగా మరో 800ల థియేటర్లను తన థియేటర్ అప్ లింకింగ్ లోకి కలుపుకుని ప్రపంచంలోని అతి పెద్ద థియీటర్ కంపెనీగా అవతరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.