Friday, November 30, 2007
డింపుల్ అడ్వర్టైజింగ్ లో 51 శాతం కొనుగోలు చేసిన పిరమిడ్ సాయిమిరా
ముంబై కి చెందిన ప్రముఖ సినీ అడ్వర్టైజింగ్ కంపెనీ డింపుల్స్ సినీ అడ్వర్టైజింగ్ ఆండ్ డింపుల్స్ సినీ యాక్టివేషన్స్ కంపెనీలో 51 శాతం వాటాను చెన్నైకి చెందిన పిరమిడ్ సాయిమిరా థియేటర్ లిమిటెడ్ కొనుగోలు చేసింది. దేశంలోని అతిపెద్ద థియేటర్ చైన్ లింక్ కంపెనీ అయిన పిరమిడ్ సాయిమిరా థియేటర్ లిమిటెడ్ సంస్థకు ఇప్పటికే అమెరికా, సింగపూర్, మలేషియాలలో థియేటర్ల నిర్వహణ చేస్తోంది. భారత దేశంలోని తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మళయాలం భాషలలో చలన చిత్రాలను విడుదలచేయడంతోబాటు, పలు చిత్రాలను నిర్మిస్తోంది.ఒక్క తమిళంలోనే ఏక కాలంలో పది చలన చిత్రాలను నిర్మిస్తున్న పిరమిడ్ సాయిమిరా థియేటర్ లిమిటెడ్ ఇప్పుడు ముంబైకి చెందిన డింపుల్ సినీ అడ్వర్టైజింగ్ కంపెనీని కొనుగోలు చేయడం ద్వారా సినిమా పబ్లిసిటీ రంగంలోకి కూడా అడుగుపెట్టినట్లైంది.పిరమిడ్ సాయిమిరా సంస్థకు ఇప్పటికే అంతర్జాతీయంగా 790 థియేటర్లలో తన వ్యాపార సినీ కార్యక్రమాలను నిర్వహిస్తోంది.డింపుల్ సినీ అడ్వర్టైజింగ్ సంస్థ 200 థియేటర్లలో తన వ్యాపార కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇప్పుడు డింపుల్ సంస్థలో పిరమిడ్ సాయిమిరా 51 శాతం కొనుగోలు చేయడం వల్ల ఈ గ్రూపు సంస్థలకు అంతర్జాతీయంగా సుమారు వెయ్యి థియేటర్ల వ్యాపార సామర్థ్యం ఏర్పడింది. 2010వ సంవత్సరానికల్లా 4000 డిజిటల్ థియేటర్ల వ్యాపార లక్ష్యంతో ముందుకు కదులుతున్న పిరమిడ్ సాయిమిరా థియేటర్ లిమిటెడ్ ప్రపంచంలోని అతిపెద్ద థియేటర్ నిర్వహణా సంస్థగా వృద్ది చెందడమే లక్ష్యంగా పనిచేస్తోంది.పిరమిడ్ సాయిమిరా థియేటర్ లిమిటెడ్ సంస్థ 51 శాతం వాటా కొనుగోలు చేసిన డింపుల్ అడ్వర్టైజింగ్ ఆండ్ డింపుల్ సినీ యాక్టివేషన్స్ ఇక ముందు పిరమిడ్ సాయిమిరా గ్రూప్ ఆఫ్ కంపెనీగా, ముంబై ప్రధాన కార్యాలయంగా పనిచేస్తుంది.
తెలుగులోకొస్తున్న కన్నడ నటి సంజన

మరో కన్నడ నటి తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టనుంది. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న "బుజ్జిగాడు-మేడ్ ఇన్ చెన్నై" చిత్రం ద్వారా పరిచయమవుతున్న ఈ నటి తెలుగులో కూడా తను రాణించగలననే నమ్మకంతో ఉంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఇప్పటికే త్రిష నటిగా కొనసాగుతుండగా, సంజన రెండవ హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఈ కన్నడ సంజన తెలుగు సంజనగా పరిచయం అవుతుందా, లేక చెన్నై సంజనగా పరిచయం అవుతుందా అనే విషయం ప్రస్తుతానికి సస్పెన్స్ గా వుంచి చిత్రాన్ని శరవేగంగా రూపొందిస్తున్నారు.
సింగపూర్ లో జరుగనున్న "చిరుత" 50 రోజుల పండుగ


Thursday, November 29, 2007
అమెరికాలో ఘనంగా జరిగిన "యమదొంగ" 100 రోజుల పండుగ


160 థియేటర్లలో తెలుగులో విడుదలవనున్న "జోధా అక్బర్"


హృతిక్ రోషన్, ఐష్వర్యా రాయ్ ల ప్రతిష్టాత్మక చారిత్రక చిత్రం "జోధా అక్బర్" పెద్ద యెత్తున తెలుగులో విడుదల కానుంది. మొగల్ చక్రవర్తి అక్బర్, జోధాభాయ్ ల ప్రేమ కథతో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా యు టి వి విడుదలచేయనుంది. ఇటీవల మహేశ్ బాబు నటించిన "అతిధి" చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడంతోబాటు, పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక చిత్రం "జల్సా' చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్న యు టి వి ఈ జోధా అక్బర్ చిత్రాన్ని విడుదల చేయనుండటంతో దీనిపై భారీ అంచనాలు పెరిగాయి. తెలుగులో 160 థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రం హిందీలో 750 థియేటర్లలో, మరియు తమిళంలో 100 థియేటర్లలో విడుదలకానుంది. ప్రపం
చవ్యాప్తంగా 1200 థియేటర్లలో విడుదల చేయడం లక్ష్యంగా పెట్టుకున్న యు టి వి భారత దేశంలోనే 1000కి పైగా థియేటర్లలో విడుదల చేయనుండటం ఇక్కడ గమనార్హం.

Wednesday, November 28, 2007
హీరోయిన్ గా నటించనున్న కమల హాసన్ కూతురు


కమల్ హాసన్, సారికల గరాలపట్టి శృతీ హాసన్ ఇకపై తన తల్లిదండృలలాగానే తనూ సినిమాలలో నటించనుంది.న్యూయార్క్ లో సంగీతంలో శిక్షణ తీసుకున్న శృతీ హాసన్ తమిళంలో మాధవన్ సరసన నటించనుంది. మంచి గాత్రం కూడా వున్న శృతీ హాసన్ ప్రస్తుతం తన తండ్రి నటించిన "దశావతారం" చిత్రం కోసం ఒక పాట కూడా పాడటమే కాకుండా, స్వంతంగా ఒక ఆల్బం కూడా రూపొందిస్తోంది. ఒకేసారి గాయనిగా, నటిగా రాణించడం పెద్ద కష్టమేమీ కాదని చెబుతున్న శృతీ హాసన్ తన తొలి చిత్రం లో తమిళంలో నటిస్తూ, త్వరలోనే దక్షిణ భారతీయ అన్ని భాషలలో విభిన్నమైన పాత్రలను ఒప్పుకోవడం తనకున్న కోరికగా ఆమె వెళ్ళడించడం తండ్రి పోలికలను పునికిపుచ్చుకున్నట్లు అనిపించడం లేదూ.
ఫిలిం మేకింగ్ లో శిక్షణ తీసుకుంటున్న లవర్ బాయ్

టాలీవుడ్ లవర్ బాయ్ తరున్ లండన్ లో ఫిలిం మేకింగ్ లో శిక్షణ తీసుకుంటున్నాడు.ఇటీవలి "నవవసంతం" చిత్రం రిలీజయిన వెంటనే లండన్ వెళ్ళిన తరున్ మరో నాలుగు నెలల పాటు ఈ శిక్షణ తీసుకోనున్నాడు.ఇందులో భాగంగా చలనచిత్ర నిర్మాణానికి సంబంధించిన ప్రాధమికస్థాయి విషయాలతోబాటు, చిత్ర నిర్మాణం, దర్శకత్వం, ఎడిటింగ్, చిత్ర కథా రచనలకు సంబంధించిన విషయాలను కొంతమేరకు తెలుసుకోనున్నాడు. ఈ శిక్షణ పూర్తయిన తర్వాత తను నటించబోయే చిత్రాలపట్ల ఎక్కువ శ్రద్ద వహిస్తానని తరున్ తన సన్నిహితులతో చెప్పడం ఇక్కడ గమనార్హం. ఇక ముందు చిత్రాలలో నటించడంతోబాటు, ఇతర రంగాలలో కూడా తను వేలు దూర్చే కార్యక్రమాలు చేయనుండటం మంచిదేగా...?!
ప్రతిష్టాత్మకమైన "రెడ్ కార్పెట్ ఫిలిం రేటింగ్స్"(28/11/2007)
(గమనిక : ముందుగా సినిమా పేరు, వెంటనే ఆయా చిత్రానికి రెడ్ కార్పెట్ ఇచ్చిన రేటింగ్ లను చూడగలరు)
AWAKE : Rating-R
(for language, an intense disturbing situation, and brief drug use)
(for language, an intense disturbing situation, and brief drug use)

(for some strong disturbing violence and pervasive language)

(for nudity, sexual content and some language)

(for some sexuality and language)

G : GENERAL AUDIENCES (All Ages Admitted)
PG : PARENTAL GUIDANCE SUGGESTED (Some Material May Not Be Suitable for Children)
PG-13 : PARENTS STRONGLY CAUTIONED (Some Material May Be Inappropriate for Children Under 13)
R : RESTRICTED (Under 17 Requires Accompanying Parent or Adult Guardian)
NC-17 : NO ONE 17 AND UNDER ADMITTED
శ్రీవెంకట్ బులెమోని
Tuesday, November 27, 2007
ఆసియాలోని 10మంది అత్యంత సుందరాంగులు-2007
ఆసియా ఖండంలోని అత్యంత సుందరాంగులు వీరేనని ఓ పత్రిక ఇటీవల పేర్కొంది.బిపాషా బసు అందరిలోకీ అయంత ఆకర్షనీయమైన, మోస్ట్ సెక్సీ యెస్ట్ ఉమన్ గా పేర్కొన్న ఈ పత్రిక ఆ తరువాత స్థానాలను వరుసగా మాధురీ దీక్షిత్, ప్రియాంక చోప్రా, ఐష్వర్య రాయ్,శిల్పా షెట్టి, కత్రినా కైఫ్, కరీనా కపూర్, లారా దత్తా,ఇషా కొప్పీకర్, మల్లికా షెరావత్ లకు కట్టబెట్టింది. వారి ఫోటోలను ఇక్కడ ప్రచురిస్తున్నాము. గమనించండి.

తమిళ "హ్యాప్పీడేస్" లో నటించాలనుందా...

Monday, November 26, 2007
పవన్ కళ్యాణ్ "జల్సా" కు రూ.29/- కోట్ల భారీ ఆఫర్!!!!

పవన్ కళ్యాణ్ నూతన చిత్రం "జల్సా" నిర్మాణానికి ముందే సంచలనాలు సృష్టించడం ప్రారంభించింది. ముంబై కి చెందిన భారీ కార్పోరేట్ కంపెనీ యు టి వి ఈ చిత్ర దేశవ్యాప్త హక్కులకోసం ఏకంగా రూ.29/-కోట్ల భారీ మొత్తాన్ని ఆఫర్ గా ఇచ్చింది.ఇంతవరకు మరే తెలుగు చిత్రానికీ ఇంత పెద్ద మొత్తంలో ఆఫర్ రాకపోవడం ఇక్కడ గమనార్హం. మెగా స్టార్ చిరంజీవి చిత్రానికి మించిన ఆఫర్ ఈ చిత్రానికి ఇవ్వడంపై రాబోయే చిరంజీవి చిత్రాన్ని(ఇంకా ప్రారంభం కాలేదు) ఇంకా పెద్ద మొత్తం
వెచ్చించి కొనడానికి తాము సిద్దమేనని యు టి వి స్పష్టం చేయదలచిందని, అందుకే ఈ చిత్రానికి భారీ మొత్తంలో వెచ్చించడానికి ముందుకు వచ్చ్చిందని టాలీవుడ్ బిజినెస్ పండితులు తెలియజేస్తున్నా, దక్షిణ భారత దేశంలోని బలీయమైన తెలుగు భాషా చిత్రాలను తాము ఎక్కువగా కొనదలచినందులకే ఇక్కడి ప్రముఖ చిత్రాలను పెద్ద మొత్త వెచ్చించి కొంటున్నామని సంస్థకు సంబంధించినవారు ఇండస్ట్రీలో చెబుతున్నట్లు వినికిడీ.గతంలో మహేశ్ బాబు నటించిన "అతిధి" చిత్రాన్ని రూ.23/-కోట్లు వెచ్చించి కొన్న ఈ సంస్థ పవన్ కళ్యాణ్ "జల్సా" కు పెద్ద మొత్తం ఆఫ్ర్ ఇచ్చింది. అయితే ఈ ఆఫర్ ను చిత్ర నిర్మాత అల్లు అరవింద్ ఇంకా ఒప్పుకోలేదు. ముచ్చటగా ముప్పై కోట్ల రూపాయల ఆఫర్ కోసం ఆయన ఎదురుచూస్తున్నట్లు వినికిడి. 


దొంగల కాలేజీ ప్రిన్సిపాల్ గా నటించనున్న "బ్రహ్మానందం"

"డా.ఆనందం,ప్రిన్సిపాల్,దొంగల కాలేజీ" పేరుతో ఓ చిత్రం రూపొందనుంది. ప్రముఖ తెలుగు సినీ హాస్య నటుడు బ్రహ్మానందం ప్రధాన పాత్ర పోశిస్తున్న ఈ చిత్రానికి శరత్ ఉండవల్లి దర్శకత్వం వహించనున్నారు. ఇటీవల పెరిగిన హాస్య చిత్రాల కోవలో పూర్తి స్థాయి వినోదాత్మకంగా రూపొందే ఈ చిత్రంలో తెలుగు సినీ పరిశ్రమలోని హాస్య నటులంతా నటించనున్నట్లు తెలిసింది. ఈ "డా.ఆనందం,ప్రిన్సిపాల్,దొంగల కాలేజీ"చిత్రానికి "బిసైడ్, అసెంబ్లీ రెండో గేటు" అనే క్యాప్షన్
ను కూడా పెట్టి మరీ చిత్రం ద్వారా తము చెప్పదలచుకున్న విషయాన్ని దర్శక,నిర్మాతలు స్పష్టం చేయడంతో ఈ చిత్రం పై పరిశ్రమలో కొన్ని అంచనాలు ఏర్పడ్డాయి.డిసెంబరు నెలాఖరులో షూటింగ్ ప్రారంభమయ్యే ఈ చిత్రాన్ని వచ్చే వేసవిలో విడుదల చేయాలని దర్శక,నిర్మాతల లక్ష్యంగా తెలుస్తోంది.

చిరంజీవి తదిపరి చిత్రం వి వి వినాయక్ దర్శకత్వంలోనే...!

తెలుగు సినీ అభిమానులు ముఖ్యంగా చిరంజీవి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిరంజీవి తదుపరి చిత్రం వి వి వినాయక్ దర్శకత్వంలోనే రూపొందనున్నట్లు తాజా సమాచారం. చిరంజీవి నటించనున్న 150వ చిత్రానికి "ఉయ్యాలవాడ నరసిం హా రెడ్డి" కథను ఎన్నుకోవడం, ఈ చిత్రానికి చిరంజీవే స్వయంగా దర్శకత్వం వహించనుండగా, ఆయన్ శ్రీమతి సురేఖ స్వయంగా నిర్మించనున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం కన్నా ముందు నిర్మించబడే 149వ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారా అని ఇంతకాలం తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద చర్చ కొనసాగింది. తమిళ దర్శకుడు శంకర్ మొదలుకుని కృష్ణ వంశీ, కోదండ రామి రెడ్డి,మురుగదాస్ ల పేర్లు ప్రముఖంగా చర్చకు వచ్చాయి. అయితే చివరికి చిరంజీవి వి వి వినాయక్ వినిపించిన రాజకీయ నేపధ్యం గల చిత్రం వైపు మొగ్గు చూయించారని చిరంజీవికి అతి సన్నిహితులు పేర్కొంటున్నారు. జనవరి నెలలోగానీ, లేక ఫిబ్రవరి నెలలోగానీ ఈ చిత్రం ప్రారంభం కావచ్చు. లేదా వచ్చే ఉగాదికి ఈ చిత్రాన్ని ప్రారంభించవ్బచ్చు. ప్రస్తుతానికి కథను పరిపుష్టిగా తయారుచేయడంలో దర్శకుడు నిమగ్నమై ఉన్నందువల్ల ఇప్పట్లో ఈ చిత్రానికి సంబంధించిన సమాచారాన్ని బయటికి తెలియజేయవద్దని చిరంజీవి, దర్శకుడు కూడా భావించడం వల్ల ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటక్నకోసం మరికొంత కాలం ఎదురుచూడక తప్పదు.
Saturday, November 24, 2007
Subscribe to:
Posts (Atom)