Wednesday, November 7, 2007

టైం మ్యాగజైన్ మెచ్చిన వరల్డ్ టాప్-10 మ్యూజిక్ లో ఎ ఆర్ రెహమాన్ "రోజా"


భారతీయ హృదయాలను కొన్ని సంవత్సరాలుగా ఓలలాడిస్తున్న "రోజా" చిత్రంలోని "ఐసా హై క్యా" పాటకు అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచంలోని ప్రతిష్టాత్మకమైన టై మ్యాగజైన్ ఈ పాటను ప్రపంచంలోని టాప్ టెన్ పాటలలో ఒకటిగా కితాబు నిచ్చింది. గత 2005లో ఇదే పాటకు ప్రపంచంలోని 100 అతి మంచి పాటలలో ఒకటిగా గుర్తింపు రాగా, ప్రస్తుతం అది టాప్ టెన్ కు చేరి భారతీయ సంగీతానికి మరింత గౌరవాన్ని చేకూర్చింది. ప్రముఖ దర్శకుడు దేశభక్తి నేపధ్యంలో రూపొందించిన ఈ చిత్రం తమిళంలో రూపొందింది. ఆతర్వాత దాదాపు అన్ని భారతీయ భాషలలోకి అనువదింపబడ్డ ఈ చిత్రం సంచలన విజయం సధించింది. కాగా ఈ చిత్రం ద్వారానే సంగీత దర్శకునిగా తెరంగేట్రం చేసిన ఎ ఆర్ రెహమాన్ భారతీయ సంగీత సామ్రాజ్యంలో మరో కొత్త సంగీత శకానికి తెరతీసాడు.

No comments: