Monday, November 19, 2007
యానిమేషన్ చిత్రంలో "థీఫ్ ఆఫ్ బాగ్దాద్" గా నటిస్తున్న చిరంజీవి
తెలుగువారి మెగాస్టార్ అతి త్వరలో పరపంచవ్యాప్తంగా చిన్నారులను అలరించనున్నాడు. చిన్న పిల్లలకు ఎంతో ఇష్టమైన యానిమేషన్ రూపంలో చిన్నారులను అలరించడానికి చిరంజీవి సమాయత్తమవుతున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా చిన్నారులను, పెద్దలను ఎంతగానఓ అలరించిన "బాగ్దాద్ గజదొంగ" గా చిరంజీవి నటిస్తున్నారు. గతంలొ ఇదే పేరుతో చిరంజీవి నటిస్తూ ఆగిపోయిన ఇంగ్లీషు చిత్రం తనరూపు మార్చుకుని యానిమేషన్ ప్రక్రియలోకి పరాకాయ ప్రవేశం చేయనుంది. దాంతో మొత్తానికే ఆగిపోయిందనుకున్న "థీఫ్ ఆఫ్ బాగ్దాద్" చివరికి తెరకెక్కడానికి సమాయత్తమవడమే, కాకుండా చిన్నారులకు ఎంతో ఇష్టమైన యానిమేషన్ ప్రక్రియలో దర్శనమివ్వనుండటం నిజంగా తెలుగు ప్రేక్షకులకు, ముఖ్యంగా చిరంజీవిని అభిమానించే అతని అఖిలాంధ్ర ప్రేక్షకులకు సంతోషం కలిగించే విషయమమే మరి. అమెరికాకు చెందిన చలపతి అనే భారతీయ పారిష్రామిక వేత్త రూ.8.5కోట్ల రూపాయల పెద్దమొత్తంలో నిర్మించనున్న ఈ యానిమేషన్ చిత్రం అఖిల భారతీయ భాషలతోబాటు, ఇంగ్లీషు, ఫ్రెంచి, కొరియన్, మలై భాషలలో రూపొందనుంది. గతంలో ఆగిపోయిన "థీఫ్ ఆఫ్ బాగ్దాద్" కు సంబంధించిన ఇంతవరకు షూటింగ్ జరిగిన పార్ట్ లోని క్యారెక్టర్ ఆధారంగా రూపొందించిన కొత్త యానిమేషన్ చిరంజీవి క్యారెక్టర్ ఆధారంగా ఇప్పుడు రూపొందబోయే కొత్త చిత్రం ఉంటుంది. మిగతా పార్ట్ కోసం చిరంజీవి అమెరికాలో ప్రయేకంగా బ్లూ డ్రెస్స్ ధరించి షూటింగ్ లో పాల్గొంటారు. కాగా ఈ చిత్రాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయడానికి కృషిచేతున్నట్లు తెలిసింది. వచ్చే సంవత్సరం దసరా పర్వదినోత్సవం నాటికల్లా ఈ చిత్రాన్ని విడుదలచేయాలనే తలంపుతో ఉన్నట్లు తెలిసింది.
శ్రీవెంకట్ బులెమోని
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment