తెలుగు సినీ రంగంలో పౌరాణిక చిత్రాలకు లోటు లేదు. 1931లో నిర్మించిన తొలి తెలుగు చిత్రం "భక్త ప్రహ్లాద" మొదలుకొని కొన్ని వందల పౌరాణిక చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. అయితే తెలుగు సినిమాలలో కొత్తగా మరో మాడ్రన్ దేవుడు అవతరించనున్నాడు. పి వాసు దర్శకత్వంలో మోహన్ బాబు నిర్మిస్తున్న "కృష్ణార్జునులు" చిత్రంలో విష్ణు కథానాయకునిగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇదే చిత్రంలో టాలీవుడ్ రోమాంటిక్ హీరో నాగార్జున పౌరాణిక పాత్ర ధరిస్తున్న విషయమూ తెలిసిందే. అయితే ఈ చిత్రం ప్రముఖ హాలీవుడ్ చిత్రం "బ్రూస్ ఆల్ మైటీ" ఆధారంగా రూపొందుతోంది. ఇందులో మాడ్రన్ దేవునిగా లా మోర్గన్ ఫ్రీమన్ నటించిన పాత్రను ఇప్పుడు నాగార్జున పోశిస్తున్నారు. అయితే ఈ దేవునికి మాడ్రన్ కృష్ణునిగా నామకరణం చేశారు. దాంతో ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో ఒకేసారి "రంగా పాండురంగా" చిత్రంలో బాలకృష్ణ కృష్ణునిగా నటిస్తుండగా, మరో వైపు నాగార్జున ఆధునిక కృష్ణునిగా నటిస్తున్నాడు. దాంతో తెలీకుండానే పౌరానిక కృష్ణునికీ,ఆధునిక కృష్ణునికీ బాక్స్ ఆఫెస్ పోరాటం మొదలైంది. కొంచెం అటూ, ఇటూగా 2008లో విడుదలవనున్న ఈ చిత్రాలలో ఏ చిత్రం ప్రేక్షకులను ఎక్కువగా మెప్పిస్తుందో వేచి చూస్తే గానీ తెలీదు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment