Wednesday, November 7, 2007

నాగార్జునతో తలపడటానికి సిద్దమైన జగపతి బాబు


"నువ్వో, నేనో ఎవరో ఒక్కరే మిగలాలని" ఎప్పుడూ సినిమాలలో వినిపించే పాత డైలాగు ఇప్పుడు నాగారున, జగపతి బాబుల మధ్యన చోటుచేసుకుంది. ఒకరితో మరొకరు సై అనే దాకా వెళ్ళింది. అయితే ఇది నిజ జీవితంలో కాదు, లేటెస్ట్ గా నాగార్జున నటిస్తున్న టాలీవుడ్ రాబున్ హుడ్ "డాణ్ చిత్రంలో. ఇందులో నాగార్జున డాన్ పాత్రలో నటిస్తుండగా, జగపతి బాబు పవర్ ఫుల్ పోలీస్ అదికారిగా నటిస్తున్నాడు. "నెక్ టు నెక్" తరహాలో వీరిద్దరి మధ్యన సన్నివేశాలు ఉంటాయని చిత్ర దర్శకుడు రాఘవ లారెన్స్ తెలిపాడు. కాగా ఈ చిత్రాన్ని డిసెంబర్,20వ తేదీన విడుదల చేయడనికి ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ఖచ్చితంగా అయిదు సంవత్సరాల క్రితం నాగారున సంచలన చిత్రం "మన్మధుడు" విడుదలైన రోజన్నమాట. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ ఆల్.

No comments: