Friday, November 9, 2007

కమల్ పై హత్యాయత్నం,బెదిరింపు కేసు: కోర్టు ఆదేశంతో కదిలిన పోలీసులు


కమల్ హాసన్ కోర్టునుంచి వ్యతిరేక తీర్పును ఎదుర్కొన్నారు. సెంథిల్ కుమార్ పై కమల్ హత్యాయత్నం బెదిరింపు కేసు నమోదు చేసుకోవాలని తాంబరం పోలీసులకు కోర్టు ఆదేశించింది.తను తయారు చేసిన "దశావతారం" చిత్ర కథను హీరో కమల్ హాసన్ దొంగిలించి తెరకెక్కిస్తున్నారని ఆరోపిస్తూ, చెన్నైలోని తాంబరంకు చెందిన సెంథిల్ కుమార్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశాడు. దీనిపై కొంతకాలంగా విచారణ జరుగుతోంది. ఈ విషయం తెలిసిన కమల్ హాసన్ తన మేనేజర్ తో పాటు కొందరి దుండగులను తన గృహానికి పంపించి, కేసు ఉపసంహరించుకోవాలని, లేకుంటే హత్య చేస్తామని బెదిరించారని పేర్కొంటూ సెంథిల్ కుమార్ స్థానిక తాంబరం కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన తాంబరం కోర్టు కమల్ హాసన్ పై కమల్ పై హత్యాయత్నం,బెదిరింపు కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. సెంథిల్ కుమార్ కు భద్రత కల్పించాలని కూడా కోర్టు పోలీసులను ఆదేశించింది.అంటే "దశావతారం" కథ రసప్పట్టుకు వచ్చిందన్నమాటే కదా!

No comments: