పవన్ కళ్యాణ్ నూతన చిత్రం "జల్సా" నిర్మాణానికి ముందే సంచలనాలు సృష్టించడం ప్రారంభించింది. ముంబై కి చెందిన భారీ కార్పోరేట్ కంపెనీ యు టి వి ఈ చిత్ర దేశవ్యాప్త హక్కులకోసం ఏకంగా రూ.29/-కోట్ల భారీ మొత్తాన్ని ఆఫర్ గా ఇచ్చింది.ఇంతవరకు మరే తెలుగు చిత్రానికీ ఇంత పెద్ద మొత్తంలో ఆఫర్ రాకపోవడం ఇక్కడ గమనార్హం. మెగా స్టార్ చిరంజీవి చిత్రానికి మించిన ఆఫర్ ఈ చిత్రానికి ఇవ్వడంపై రాబోయే చిరంజీవి చిత్రాన్ని(ఇంకా ప్రారంభం కాలేదు) ఇంకా పెద్ద మొత్తం వెచ్చించి కొనడానికి తాము సిద్దమేనని యు టి వి స్పష్టం చేయదలచిందని, అందుకే ఈ చిత్రానికి భారీ మొత్తంలో వెచ్చించడానికి ముందుకు వచ్చ్చిందని టాలీవుడ్ బిజినెస్ పండితులు తెలియజేస్తున్నా, దక్షిణ భారత దేశంలోని బలీయమైన తెలుగు భాషా చిత్రాలను తాము ఎక్కువగా కొనదలచినందులకే ఇక్కడి ప్రముఖ చిత్రాలను పెద్ద మొత్త వెచ్చించి కొంటున్నామని సంస్థకు సంబంధించినవారు ఇండస్ట్రీలో చెబుతున్నట్లు వినికిడీ.గతంలో మహేశ్ బాబు నటించిన "అతిధి" చిత్రాన్ని రూ.23/-కోట్లు వెచ్చించి కొన్న ఈ సంస్థ పవన్ కళ్యాణ్ "జల్సా" కు పెద్ద మొత్తం ఆఫ్ర్ ఇచ్చింది. అయితే ఈ ఆఫర్ ను చిత్ర నిర్మాత అల్లు అరవింద్ ఇంకా ఒప్పుకోలేదు. ముచ్చటగా ముప్పై కోట్ల రూపాయల ఆఫర్ కోసం ఆయన ఎదురుచూస్తున్నట్లు వినికిడి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment