Saturday, November 17, 2007

ప్రఖ్యాత "సిసిల్ డిమిల్లి" అవార్డు అందుకోనున్న స్టీవెన్ స్పీల్ బర్గ్







హాలీవుడ్ దర్శకరత్నం స్పీల్ బర్గ్ ప్రఖ్యాత "సిసిల్ డిమిల్లి" అవార్డు అందుకోనున్నారు. చలన చిత్ర పరిశ్రమకు తమ జీవితాన్ని అంకితం చేసిన అత్యున్నత సాంకేతిక నిపుణులకు మాత్రమే ఇచ్చే ఈ అవార్డును స్పీల్ బర్గ్ ఇప్పుడు అందుకోనున్నారు. హాలీవుడ్ ఫారిన్ ప్రెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇచ్చే ఈ అవార్డును ప్రతి సంవత్సరం ఇచ్చే ప్రతిష్టాత్మక "గోల్డెన్ గ్లోబ్ అవార్డు"ల ప్రధానోత్సవం సందర్భంగా ఇస్తారు.60 సంవత్సరల వయస్సుగల స్పీల్ బర్గ్ గతంలో "ఇ.టి","జురాసిక్ పార్క్" తదితర పలు ప్రతిష్టాత్మక చిత్రాలను హాలీవుడ్ కు అందించారు. ఒక విధంగా బాక్స్ ఆఫీస్ చరిత్రను తన కలెక్షన్లతో తిరగరాసిన చరిత్ర స్పీల్ బర్గ్ ది. ప్రస్తుతం 65వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రధానోత్సవంలో ఈ ప్రఖ్యాత "సిసిల్ డిమిల్లి" అవార్డును స్పీల్ బర్గ్ కు వచ్చే జనవరి13,2008న అందిస్తారు.గతంలో స్పీల్ బర్గ్ ఆరు గోల్డెన్ గ్లోబ్ అవార్డులను, మూడు ఆస్కార్ అవార్డులను అందుకోవడమే కాకుండా, డైరెక్టర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా నుంచి ప్రతిష్టాత్మక "లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు"ను సహితం అందుకున్నారు.

No comments: