Friday, November 9, 2007

"దీపావళి" పండగంటే మహా ఇష్టం: మమతా మోహన్‌దాస్


"దీపావళి" పండగంటే మహా ఇష్టమని, తాను ఎక్కడున్నా దీపావళి చేసుకుంటానని అంటోంది టాలీవుడ్ కథానాయిక మమతా మోహన్ దాస్. చిన్నతనంలో స్కూల్ స్నేహితులతో కలిసి చేసుకునేవాళ్ళం. కొత్త బట్టలు, స్వీట్లు అవన్నీ తలచుకుంటేనే ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. మా స్కూల్లో చదివేవాళ్ళు మా ఇంటి పక్కపక్కనే ఉండేవారు. అంతా కలిసి చాలా ఎంజాయ్ చేసే వాళ్ళం. హీరోయిన్ అయినా ఆ పండుగను కంటెన్యూ చేస్తునే ఉన్నాను. చిన్నప్పుడు మా బామ్మ ఓ మాట చెబుతుండేది. మతాబులు కాలిస్తే దోమలు, చిన్న పురుగులు రావని, అందుకే ఇంటిలో పొగవచ్చేదాకా వాటిని కాల్చేదాన్ని అంటూ గతాన్ని గుర్తు చేసుకుంది మమతా మోహన్ దాస్.

No comments: