1. యువతకు "హ్యాపీడేస్" జ్వరంతెలుగు యువతరానికి కొత్త జ్వరం పట్టుకుంది. దాని పేరు "హ్యాపీడేస్". దీనికి మందు "హ్యాపీడేస్" చిత్రాన్ని వారానికోసారి చొప్పున కనీసం రెండు మూడు నెలలపాటయినా చూడాలని, అదీ కూడా సమీప భవిష్యత్తులో "హ్యాపీడేస్" చిత్రం ఎక్కడ ప్రదర్శింపబడినా, తమ మితృలతో కలిసి చూస్తే ఈ జ్వరం అతి తొందరగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని సినీ పండిత డాక్టర్ల సూచన. అందుకని ఈ చిత్రాన్ని నంబర్ వన్ స్థానంలో కొనసాగించాలని వారి సూచన.
2. స్నేహం బాగానే ఉన్నట్లుందంటున్న "నవవసంతం"
"హ్యాపీడేస్" కొనసాగింపుగా "నవవసంతం" ను ప్రేక్షకులు స్వీకరిస్తే తప్పు లేదని టాలీవుడ్ సినీ పండితుల అభిప్రాయం. స్నేహం, ప్రేమ, కుటుంబ నేపద్యంలో వచ్చిన తరున్, ప్రియామణిల "నవవసంతం" ఈ వారం రెండవ స్థానాన్ని పొందింది.
3. బాగా వెనకబడిన "అతిధి"
"హ్యాపీడేస్" కొనసాగింపుగా "నవవసంతం" ను ప్రేక్షకులు స్వీకరిస్తే తప్పు లేదని టాలీవుడ్ సినీ పండితుల అభిప్రాయం. స్నేహం, ప్రేమ, కుటుంబ నేపద్యంలో వచ్చిన తరున్, ప్రియామణిల "నవవసంతం" ఈ వారం రెండవ స్థానాన్ని పొందింది.
3. బాగా వెనకబడిన "అతిధి"
మహేశ్ బాబు నటించిన అతిధి చిత్రం ఫెయిల్యూర్ దారి పట్టింది. కలెక్షన్ల పరంగా బాగా వెనకబడిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు అంతగా ఆదరించడం లేదు. మహేశ్ బాబు మార్కు చిత్రంలో లోపించడం, పోకిరికి కొనసాగింపైన క్యారెక్టరైజేషన్ ల వల్ల ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా నిరుత్సాహ పరుస్తోందని సినీ విమర్షకుల కథనం.
విక్టరీ వెంకటేశ్, నయనతారల చిత్రం "తులసి" కలెక్షన్ల వేటలో బాగా వెనకబడింది. శృతిమించిన హింసవల్లే ఈ చిత్రం వెనకబడిందని ట్రేడ్ రిపోర్ట్.
శ్రీవెంకట్ బులెమోని
No comments:
Post a Comment