Friday, November 30, 2007

డింపుల్ అడ్వర్టైజింగ్ లో 51 శాతం కొనుగోలు చేసిన పిరమిడ్ సాయిమిరా

ముంబై కి చెందిన ప్రముఖ సినీ అడ్వర్టైజింగ్ కంపెనీ డింపుల్స్ సినీ అడ్వర్టైజింగ్ ఆండ్ డింపుల్స్ సినీ యాక్టివేషన్స్ కంపెనీలో 51 శాతం వాటాను చెన్నైకి చెందిన పిరమిడ్ సాయిమిరా థియేటర్ లిమిటెడ్ కొనుగోలు చేసింది. దేశంలోని అతిపెద్ద థియేటర్ చైన్ లింక్ కంపెనీ అయిన పిరమిడ్ సాయిమిరా థియేటర్ లిమిటెడ్ సంస్థకు ఇప్పటికే అమెరికా, సింగపూర్, మలేషియాలలో థియేటర్ల నిర్వహణ చేస్తోంది. భారత దేశంలోని తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మళయాలం భాషలలో చలన చిత్రాలను విడుదలచేయడంతోబాటు, పలు చిత్రాలను నిర్మిస్తోంది.ఒక్క తమిళంలోనే ఏక కాలంలో పది చలన చిత్రాలను నిర్మిస్తున్న పిరమిడ్ సాయిమిరా థియేటర్ లిమిటెడ్ ఇప్పుడు ముంబైకి చెందిన డింపుల్ సినీ అడ్వర్టైజింగ్ కంపెనీని కొనుగోలు చేయడం ద్వారా సినిమా పబ్లిసిటీ రంగంలోకి కూడా అడుగుపెట్టినట్లైంది.పిరమిడ్ సాయిమిరా సంస్థకు ఇప్పటికే అంతర్జాతీయంగా 790 థియేటర్లలో తన వ్యాపార సినీ కార్యక్రమాలను నిర్వహిస్తోంది.డింపుల్ సినీ అడ్వర్టైజింగ్ సంస్థ 200 థియేటర్లలో తన వ్యాపార కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇప్పుడు డింపుల్ సంస్థలో పిరమిడ్ సాయిమిరా 51 శాతం కొనుగోలు చేయడం వల్ల ఈ గ్రూపు సంస్థలకు అంతర్జాతీయంగా సుమారు వెయ్యి థియేటర్ల వ్యాపార సామర్థ్యం ఏర్పడింది. 2010వ సంవత్సరానికల్లా 4000 డిజిటల్ థియేటర్ల వ్యాపార లక్ష్యంతో ముందుకు కదులుతున్న పిరమిడ్ సాయిమిరా థియేటర్ లిమిటెడ్ ప్రపంచంలోని అతిపెద్ద థియేటర్ నిర్వహణా సంస్థగా వృద్ది చెందడమే లక్ష్యంగా పనిచేస్తోంది.పిరమిడ్ సాయిమిరా థియేటర్ లిమిటెడ్ సంస్థ 51 శాతం వాటా కొనుగోలు చేసిన డింపుల్ అడ్వర్టైజింగ్ ఆండ్ డింపుల్ సినీ యాక్టివేషన్స్ ఇక ముందు పిరమిడ్ సాయిమిరా గ్రూప్ ఆఫ్ కంపెనీగా, ముంబై ప్రధాన కార్యాలయంగా పనిచేస్తుంది.

No comments: