
"రజినీ వెరీ గ్రేట్, విక్టరీ వెంకీ నైస్ జెంటిల్‌మెన్" అంటోంది "లక్ష్మీ", "తులసి" చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాలలో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించిన అందాలతార నయనతార. విక్టరీ వెంకటేష్ పై పొగడ్తల వర్షం కురిపిస్తోంది. ఇటీవల "తులసి" చిత్రం విడుదలైన సందర్భంగా నయనతార మాట్లాడుతూ, వెంకటేష్‌తో నటించటం చాలా కంఫర్టబుల్‌గా ఉంటుందనీ, ఆయన తనకు ఎన్నో మెలకువలు నేర్పారనీ, మొత్తంగా కలిసి ఆయన ఓ జెంటిల్‌మెన్ అనీ చెపుతోంది. ఇక తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ఓ ఎన్ని సినిమాలలో నటించినా తానివి తీరదనీ, ఆయన వెంట ఒకే ఒక్క సన్నివేశంలో నటించినా అదో గొప్ప అనుభూతి అనీ సెలవిస్తోంది. ఎందు
కంటే "రజనీ వెరీ వెరీ గ్రేట్" ఆయనను మరొకరితో పోల్చటం సాధ్యం కాదు అంటోంది.ఇందుమూలంగా అఖిల బ్లాగర్లకూ ఏం తెలుస్తోందంటే "నయనతార బ్రతక నేర్చిందని". కాదంటారా.

No comments:
Post a Comment