Saturday, November 10, 2007

టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ రిపొర్ట్: సీజనల్ సూపర్ హిట్ "హ్యాపీడేస్"

1. "హ్యాపీడేస్" నెంబర్ వన్శేఖర్ కమ్ముల "హ్యాపీడేస్" కలెక్షన్ల పరంగా ప్రభంజనం సృస్టిస్తోంది. రాష్ట్రం తో బాటు, తమిళనాడు, కర్నాటకలలో,మరియు అంతర్జాతీయంగా అమెరికా,ఆస్ట్రేలియా,సౌదీ,బ్రిటన్ లలో ఈ చిత్రం మంచి ఆదరణతో నడుస్తోంది. రాష్ట్రంలో ఏ సెంటర్లలో రికార్డు కలెక్షన్లు వసూలు చేస్తున్న ఈ చిత్రం బి సెంటర్లలో మాత్రం సాధారణంగా కొనసాగుతోంది.
2. క్లైమాక్సే పెద్ద దెబ్బ
మహేశ్ బాబు చిత్రం "అతిధి" పరిస్థితి రెండవ స్థానంతో సరిపుచ్చుకోవలసి వస్తోంది. ఈ చిత్రం ఆరంభం నుంచి ప్రేక్షకులను ఆకట్టుకున్నా, చిత్రం క్లేమాక్స్ ఆశించిన స్థయిలో లేక పోవడం చిత్ర విజయాన్ని ప్రభావితం చేస్తోంది. ఈ చిత్రం నడిపిస్తే నడిచే చిత్రం గా మారిందని కొందరు విమర్శిస్తున్నారు.
3. ఉదయ్ కిరణ్ కు తృప్తిని మిగిల్చే "వియ్యాలవరి కయ్యాలు"
ఉదయ్ కిరణ్, శ్రీహరి కలయికలో వచ్చిన "వియ్యాలవారి కయ్యాలు" చిత్రం ప్రేక్షకులను సాధారణంగా ఆక్ర్శిస్తోంది. పేరులోని వియ్యాలు, కయ్యాలు పదాలు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నట్లు సమాచారం. కలెక్షన్ల పరంగా ఫిఫ్టీ ఫిఫ్టీ గా కొనసాగుతున్న ఈ చిత్రం మరో వారం ఇదే తరహాలో కొనసాగే అవకాశం ఉంది.
4. యాక్షన్ దెబ్బకు వాడిపోయిన "తులసి"
వెంకటేశ్ చిత్రాలనగానే ఎక్కువశాతం ప్రేక్షకులు కుటుంబ పరమైన కథలను ఆశిస్తారు. కొంత ప్రేమ, కొంత కుటంబ నేపద్య ఉన్నా శృతిమించిన హింస ఈ చిత్రాన్ని చతికిల పడేసింది. ఈ వారం కలెక్షన్లు బాగా పడిపోవడం తో ఈ చిత్ర పరాజయం దాదాపు ఖాయమైది.
5. పేరుకే "చిరుత"ది అయిదో స్థానం

పేరు గొప్ప, ఊరు దిబ్బ అనే పదానికి అక్షరాలా అతికినట్లు సరిపోయే చిత్రం "చిరుత". వారసత్వం ప్రారంభాన్నిస్తుందే తప్ప చిత్రాన్ని నిలబెట్టదని ఈ చిత్రం మరోమారు నిరూపించింది. రాం చరన్ నటనతో ఏమాత్రం సంతోషపడని ప్రేక్షకులు ఈ చిత్రాన్ని దాదాపు మరిచిపోయారు. దాంతో ఒకటీ, అరా అన్నట్లు కలెక్షనలతో ఈ చిత్రం "సా...గుతోంది".

శ్రీవెంకట్ బులెమోని

No comments: